spot_img
Homeఎంటర్టైన్మెంట్Peddi movie postponed: సుకుమార్ వల్లే 'పెద్ది' మరోసారి వాయిదా..పూర్తి వివరాలు ఎక్సక్లూసివ్ గా మీకోసం..

Peddi movie postponed: సుకుమార్ వల్లే ‘పెద్ది’ మరోసారి వాయిదా..పూర్తి వివరాలు ఎక్సక్లూసివ్ గా మీకోసం..

Peddi movie postponed: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) నటిస్తున్న ‘పెద్ది'(Peddi Movie) చిత్రం పై అభిమానుల్లో, ప్రేక్షకుల్లో అంచనాలు రోజురోజుకు పెరిగిపోతూ ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన గ్లింప్స్ వీడియో కి, అదే విధంగా చికిరి చికిరి పాటకు సెన్సేషనల్ రీచ్ వచ్చింది. వీటి కారణంగా అంచనాలు ఎవ్వరూ ఊహించని రేంజ్ లో పెరిగిపోయాయి. దానికి తోడు , రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా నాలుగు రోజుల క్రితం విడుదల చేసిన పహిల్వాన్ గ్లింప్స్ వీడియో కి కూడా అద్భుతమైన రెస్పాన్స్ రావడం తో , ఎప్పుడెప్పుడు ఈ సినిమా విడుదల అవుతుందా ?, ఎప్పుడెప్పుడు చూద్దామా అనే ఆత్రుతతో ఉన్నారు అందరూ. కానీ ఆ అంచనాలకు తగ్గట్టు టీం అసలు ప్రవర్తించడం లేదు. ఈ రేంజ్ కంటెంట్ ని పెట్టుకొని కూడా సినిమాని వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వెళ్తున్నారు.

ముందుగా మార్చి 27 న విడుదల చెయ్యాలని అనుకున్నారు , షూటింగ్ చాలా వరకు బ్యాలన్స్ ఉందని ఏప్రిల్ 30 కి వాయిదా వేశారు. అప్పటికి కూడా ఈ సినిమా రెడీ అయ్యే పరిస్థితి లేకపోవడం తో ఇప్పుడు జూన్ 25 కి వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. ఒక్క పాట మినహా షూటింగ్ మొత్తం అయిపోయింది అన్నారు కదా , ఇప్పుడెందుకు ఇన్ని రోజులు వాయిదా వేస్తున్నారు అనే సందేహం ప్రతీ ఒక్కరిలో వచ్చింది. అందుకు ముఖ్య కారణం సుకుమార్. రీసెంట్ గానే సుకుమార్ ఈ సినిమాకు సంబంధించిన ఔట్పుట్ మొత్తం చూశాడట. ఆయనకు సెకండ్ హాఫ్ లో చాలా లోపాలు కనిపించాయని సమాచారం. ఆయన సూచించిన మార్పులు చేర్పులు అన్ని నోట్ చేసుకున్న బుచ్చి బాబు, వాటిని రీ షూట్ చెయ్యాలనే ఆలోచనకు వచ్చాడట. అందుకే రెండు నెలల పాటు ఈ చిత్రాన్ని వాయిదా వెయ్యబోతున్నారని టాక్.

Also Read: ప్రభాస్ ‘స్పిరిట్’ కథ ఇంత రొటీన్ గా ఉండబోతుందా.. ? ఇలా అయితే కష్టమే..

అంతే కాదు మెగాస్టార్ చిరంజీవి కూడా రీసెంట్ గానే ఈ సినిమాని చూసి అనేక సన్నివేశాల విషయం లో అసంతృప్తి వ్యక్తం చేసాడట. ఒకపక్క తన గురువు, మరో పక్క మెగాస్టార్ చిరంజీవి , ఇద్దరు కూడా అసంతృప్తి తో ఉన్నారు , ఇలాంటి సమయం లో విడుదలను ఆపేయడమే మంచిది అని ఫిక్స్ అయ్యి , వాళ్లిద్దరూ సూచించిన సూచనలను ఆధారంగా తీసుకొని రీ షూట్స్ చెయ్యాలని అనుకుంటున్నారట. సాధారణంగా ఇలాంటి రీ షూట్స్ ఎక్కువగా సుకుమార్ చేస్తూ ఉంటాడు. ఒక్కో సన్నివేశానికి ఆయన నాలుగైదు వెర్షన్స్ ని రాసుకుంటూ ఉంటాడు. ఈ సినిమాకు ఆయన శిష్యుడు బుచ్చి బాబు తో కూడా అదే చేయిస్తున్నాడు సుకుమార్. చూడాలి మరి ఈ సినిమా ఔట్పుట్ చివరికి ఎలా ఉండబోతుంది అనేది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version