Virat Kohli vs BCCI: దక్షిణాఫ్రికా పర్యటన ముందు భారత క్రికెట్ అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఎంఎస్ ధోనిలా పగ్గాలు వదిలేసి కోహ్లీకి అప్పగించినంత సులువుగా టీమిండియా కెప్టెన్సీ మారలేదని అర్థమైంది. విరాట్ కోహ్లీని బలవంతంగానే గంటన్నర ముందు మాత్రమే కెప్టెన్సీ నుంచి తొలగించారని స్పష్టమైంది. ఈ విషయాన్ని కోహ్లీనే స్వయంగా చెప్పడం సంచలనమైంది.
టీమిండియా వన్డే కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ వైదొలగలేదని అర్థమైంది. అతడిని తొలగించారని తాజాగా కోహ్లీ మాటలను బట్టి అర్థమవుతోంది. దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో విరాట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే వన్డే కెప్టెన్సీ మార్పు గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి.
టీ20 ఫార్మాట్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు ట్వీంటీ ట్వంటీ ప్రపంచకప్ ముందే కోహ్లీ ప్రకటించాడు. అందులో టీమిండియా ఘోర పరాజయంతో కోహ్లీపై విమర్శలు చెలరేగాయి. ఇక కోహ్లీ స్థానంలో న్యూజిలాండ్ తో సిరీస్ కు రోహిత్ కు కెప్టెన్సీ ఇచ్చారు. ఈ సిరీస్ కు విరాట్ కు విశ్రాంతి ఇచ్చారు. రోహిత్ 3-0తో సిరీస్ గెలవడంతో ఇక వన్డే పగ్గాలు అప్పగించేశారు. అయితే ఇక్కడే బీసీసీఐ ట్విస్ట్ ఇచ్చింది.
విరాట్ కోహ్లీకి వన్డే పగ్గాలు వదిలేయాలని రెండు రోజుల ముందే చెప్పామని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్నారు. కోహ్లీ స్పందించకపోతేనే రోహిత్ ను సెలెక్టర్లు చేశారని చెప్పుకొచ్చాడు.
Also Read: వన్డే సిరీసుకు కోహ్లీ దూరం.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ..!
కానీ ఇప్పుడు దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు విరాట్ బాంబు పేల్చాడు. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ కెప్టెన్సీ తొలగింపుపై టెస్టు జట్టు ప్రకటించడానికి గంటన్నర ముందు మాత్రమే సెలెక్టర్లు తనకు సమాచారం ఇచ్చారని సంచలన విషయాన్ని తెలిపాడు. అయితే బీసీసీఐ మాత్రం రెండు రోజులు ముందుగానే చెప్పామని అన్నది. దీంతో కోహ్లీని అవమానకరంగానే వన్డే కెప్టెన్సీ నుంచి అయిష్టంగానే తొలగించారని అర్థమవుతోంది. దీన్ని బట్టి టీమిండియాలో మరోసారి ముసలం మొదలైనట్టుగా తెలుస్తోంది. బీసీసీఐ కెప్టెన్సీ మార్చినా.. ఎవరికి ఇచ్చినా తాను అర్థం చేసుకోగలనని విరాట్ అనడం అగ్నికి ఆజ్యం పోసినట్టైంది. 2023 వరకూ వన్డే ప్రపంచకప్ వరకూ ఉంటానని అనుకున్నానని కోహ్లీ ట్విస్ట్ ఇచ్చాడు. అంటే బీసీసీఐ తనకు ఇష్టం లేకున్నా తొలగించిందని మీడియా ముందరే కోహ్లీ తెలుపడం సంచలనమైంది. మరి ఇరుకునపడ్డ బీసీసీఐ ఎలా స్పందిస్తుందనేది వేచిచూడాలి.
Also Read: కోహ్లీ పోయిండు.. రోహిత్ గాయం.. ఇప్పుడు జడేజా కూడా బీసీసీఐకి షాక్