
అఫ్గానిస్థాన్ లో పరిస్థితులు ఇంకా కుదుటపడటం లేదు. తాలిబన్ల ఆధిపత్యం నేపథ్యంలో ఆ దేశాన్ని వీడేందుకు పెద్ద ఎత్తున పౌరులు కాబూల్ విమానాశ్రయానికి చేరుకుంటున్నారు. ఈ క్రమంలో ఆదివారం అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు మృతిచెందినట్లు బ్రిటన్ రక్షణశాఖ తెలిపింది. తాలిబన్లు గాల్లోకి కాల్పులు జరపడంతో పరిస్థితి అదుపుతప్పి తొక్కిసలాట చోటుచేసుకున్నట్లు వెల్లడించింది.
https://twitter.com/LIST4AIRDROP/status/1429337654366248960?s=20