Commonwealth Games: కామన్వెల్త్ క్రీడల్లో భారత్ సత్తా చాటాలని చూస్తోంది. బర్మింగ్ హామ్ వేదికగా ఈ సారి కామన్వెల్త్ క్రీడలు సాగనున్నాయి. 70 దేశాలు, 5 వేల మంది క్రీడాకారులు, 20 క్రీడలు, 280 ఈవెంట్లతో కామన్వెల్త్ ఆతిథ్యం ఇవ్వనుంది. దీంతో ఇండియా పతకాల సాధనలో ప్రతిభ ప్రదర్శించాలని తాపత్రయపడుతోంది. ఇప్పటివరకు జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో భారత్ నాలుగో స్థానం దక్కించుకోవడం విశేషం. ఇప్పటివరకు ఓవరాల్ గా 503 పతకాలు సాధించింది. 181 స్వర్ణం, 173 రజతం, 149 కాంస్య పతకాలు ఉన్నాయి. 2010లో అత్యధికంగా 101 పతకాలు సొంతం చేసుకుని రెండో స్థానంలో నిలిచింది. అప్పుడు మనదేశమే ఆతిథ్యమిచ్చింది.

2018 కామన్వెల్త్ క్రీడల్లో కూడా భారత్ ఫర్వాలేదనిపించింది. 66 పతకాలు సాధించి మూడోస్థానంలో నిలిచింది. కామన్వెల్త్ క్రీడల్లో భారత్ తన హవా కొనసాగస్తూనే ఉంది. 2018లో భారత్ కు అత్యధిక పతకాలు రావడానికి కారణం షూటింగ్. ఇందులో మనకు 26 పతకాలు రావడం చెప్పుకోదగ్గ విషయమే. అథ్లెటిక్స్ లో ఒకే స్వర్ణం రావడం దారుణం. కానీ మిగతా ఈవెంట్లలో సత్తా చాటి పతకాల పట్టికలో ముందుకు వెళ్లింది. దీంతోనే మూడో స్థానం దక్కింది. ప్రస్తుతం కూడా అదే జోరు కొనసాగించాలని భారత్ భావిస్తోంది.
బర్మింగ్ హామ్ వేదికగా జరిగే కామన్వెల్త్ క్రీడల్లో 210 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. ఇందులో 106 మంది పురుషులు, 104 మంది మహిళలు ఉన్నారు. ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా గాయం కారణంగా దూరంగా ఉండటంతో మనకు పతకాల పంట పండనట్లే అని నిరాశలో ఉన్నారు. మరోవైపు సైనా నెహ్వాల్ సైతం పాల్గొనడం లేదు. దీంతో మనకు పతకాలు వచ్చే అవకాశాలు తక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. మెరుగైన ఆటతీరు ప్రదర్శించి ఎక్కువ పతకాలు తీసుకురావడంలో మనవారు సఫలం కావాలని కోరుతున్నారు.
ఇక బ్యాట్మింటన్ లో పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్ లపైనే ఆశలు ఎక్కువగా ఉన్నాయి. అథ్లెటిక్స్ విభాగంలో కూడా మనకు పెద్దగా పతకాలు వచ్చే సూచనలు కనిపించడం లేదు. దీంతో కామన్వెల్త్ క్రీడల్లో భారత్ అభిమానుల ఆశలు ఏమవుతాయో తెలియడం లేదు. కానీ పతకాలు సాధించడానికి క్రీడాకారులు మాత్రం ముమ్మరంగానే ప్రాక్టీసు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఆట మొదలైతే కానీ తెలియదు. మనవారి ఘనత గురించి చెప్పుకోవాలంటే పతకాలు సాధించాలి కదా మరి.
కామన్వెల్త్ క్రీడల్లో తొలిసారి మహిళా క్రికెట్ ప్రవేశపెట్టడంతో మనవారు పతకం సాధిస్తారా? అనేది అనుమానంగానే ఉంది. సెమీస్ కు దూసుకెళ్లడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. కానీ ఆస్ట్రేలియా ఉండటంతో కొంత ఇబ్బందికరమే. మనవారు కప్ గెలవాంటే చెమటోడ్చాల్సి ఉంటుంది. సెమీస్ లో ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా లాంటి జట్లతో తలపడాల్సి ఉండటంతో వాటిని అధిగమించడానికి శ్రమించాల్సి ఉంటుంది. కానీ మనవారు ఏం చేస్తారో తెలియడం లేదు. కప్ తెస్తే మనకు గర్వకారణమే కానీ ఓడితే మాత్రం దారుణమే.
కామన్వెల్త్ క్రీడల్లో మనకు ఎక్కువ పతకాలు వచ్చేవి షూటింగ్, రెజ్లింగే. కానీ ఈసారి షూటింగ్ లేకపోవడం నిరాశే. ఎందుకంటే అందులోనే మనకు ఎక్కువ స్వర్ణాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మన క్రీడాకారులు మిగతా ఈవెంట్లలో అంతగా రాణించరు. అందుకే పతకాల వేటలో మనవారు నిరాశ పరుస్తారో లేక ఉత్సాహం వచ్చేలా తెస్తారో వేచిచూడాల్సిందే. మొత్తానికి కామన్వెల్త్ క్రీడల్లో మనవారు మంచి ఆటను ప్రదర్శించి పతకాలు సొంతం చేసుకోవాలని ప్రతి భారతీయుడు ఆకాంక్షిస్తున్నాడు.