Chennai Super Kings: ముంబై ఇండియన్స్ జట్టుతో ఆదివారం జరిగిన మ్యాచ్లో దాదాపు 9 వికెట్ల తేడాతో చెన్నై ఓటమిపాలైంది. ఈ సీజన్లో అత్యంత దారుణమైన ఓటమిని ధోని నాయకత్వంలో చెన్నై జట్టు ఎదుర్కోవడం గమనార్హం. ధోని నాయకత్వంలో చెన్నై జట్టు ఈ సీజన్లో ఇప్పటివరకు మూడు మ్యాచ్లు ఆడగా.. రెండిట్లో ఓడిపోయింది. దీంతో చెన్నై జట్టు ప్లే ఆఫ్ అవకాశాలు సంక్లిష్టంగా మారిపోయాయి. వాస్తవానికి ఐపీఎల్ లో అరి వీర భయంకరమైన జట్లను ఓడించిన చరిత్ర చెన్నై జట్టుకుంది. ఐపీఎల్ చరిత్రలో ఐదు సార్లు విజేతగా.. ఐదుసార్లు ఫైనల్ వెళ్లిన జట్టుగా చెన్నైకి పేరుంది. అలాంటి జట్టు వరుస ఓటములు ఎదుర్కొని.. తీవ్ర ఇబ్బందికరమైన పరిస్థితిని చవి చూస్తున్న నేపథ్యంలో.. ఆ జట్టు అభిమానులు సోషల్ మీడియాలో తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..
Also Read: అయ్యర్, ఇషాన్ పై ప్రేమ చూపించి.. తెలుగోడిపై కక్ష కట్టారెందుకు?
ప్లే ఆఫ్ వెళ్లడానికి అవకాశం ఉంది..
వరుసగా ఓటములు ఎదురవుతున్నప్పటికీ.. చెన్నై జట్టు ప్లే ఆఫ్ వెళ్లడానికి ఇంకా అవకాశాలు ఉన్నాయి. ఇన్ని ఓటములు ఎదుర్కొన్నప్పటికీ చెన్నై జట్టు ప్లే ఆఫ్ వెళ్లడానికి అద్భుతాలు చేయాలి. అవి జరగాలంటే ఆటగాళ్లు గొప్ప ప్రదర్శన చేయాలి. ఈ సీజన్లో చెన్నై జట్టు ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్లు ఆడింది. కేవలం రెండిట్లో మాత్రమే గెలిచింది. తన ఖాతాలో నాలుగు పాయింట్లు మాత్రమే కలిగి ఉంది..నెట్ రన్ రేట్ మైనస్లలో ఉంది. దీన్ని మెరుగుపరచుకోవాలంటే చెన్నై జట్టు తదుపరి ఆడే ఆరు మ్యాచ్లలో ఘన విజయం సాధించాలి. నెట్ రన్ రేట్ పెంచుకోవాలి. అంతేకాదు ఈ ఆరు మ్యాచ్లలో ఏ ఒక్క మ్యాచ్ ఓడిపోయినా చెన్నై ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది.. వరుసగా ఓటములు ఎదుర్కొంటున్న నేపథ్యంలో.. చెన్నై జట్టు తదుపరి మ్యాచ్లకు ఆటగాళ్ల విషయంలో మరింత కసరత్తు చేసే అవకాశం కనిపిస్తోంది. ఆడలేక చేతులెత్తేస్తున్న ఆటగాళ్లకు ఉద్వాసన పలికి.. కొత్తవారికి అవకాశం ఇచ్చే యోచనలో ఆ జట్టు మేనేజ్మెంట్ ఉన్నట్టు సమాచారం.
చెన్నై జట్టు లో మార్పులు ఖాయం
చెన్నై జట్టులో ఓపెనర్ రచిన్ రవీంద్ర అంతగా ఆడటం లేదు. మిడిల్ ఆర్డర్ కూడా అంతంతమాత్రంగానే ఆడుతోంది. ధోని లాంటి హిట్టర్ లేకపోవడం చెన్నై జట్టును తీవ్రంగా ఇబ్బందికి గురిచేస్తోంది. ఈ క్రమంలో జట్టులో సమూల మార్పులు చేస్తేనే తదుపరి మ్యాచులు గెలవడానికి అవకాశం ఉంటుందని క్రికెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. చెన్నై జట్టు ఆటగాళ్ల విషయంలో మరింత కఠిన వైఖరి ప్రదర్శించాలని అభిమానులు కోరుకుంటున్నారు. జట్టులో ఆడే ఆటగాళ్లకు మాత్రమే అవకాశం కల్పించాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా స్లో పిచ్ లపై విఫలమవుతున్న ఆటగాళ్లను పక్కన పెట్టాలని హితవు పలుకుతున్నారు.
Also Read: చిన్నప్పుడు వాంఖడే లోకి రానిచ్చేవారు కాదు.. రోహిత్ భావోద్వేగం.. వీడియో వైరల్