Odela 2 Movie : తమన్నా(Tamannaah Bhatia) ప్రధాన పాత్ర పోషించిన ‘ఓదెల 2′(Odela 2 Movie) చిత్రం విడుదలకు ముందు ఆడియన్స్ ని టీజర్, ట్రైలర్ లతో తెగ ఆకర్షించింది. కానీ ఎందుకో ఆ ఆకర్షణకు తగ్గ కలెక్షన్స్ మాత్రం రావడం లేదు. కనీసం ఓపెనింగ్స్ ని కూడా తగ్గించుకోలేకపోయింది ఈ సినిమా. మేకర్స్ మాత్రం నాలుగు రోజుల్లో ఈ చిత్రానికి 8 కోట్ల 80 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు ఒక పోస్టర్ ని విడుదల చేసారు. కానీ నిజానికి అంత వసూళ్లు వచ్చాయా?, అసలు ఈ సినిమా పరిస్థితి ఏమిటి అనేది ఇప్పుడు మనం వివరం గా చూడబోతున్నాం. ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ విడుదలకు ముందు 11 కోట్ల రూపాయలకు జరిగింది. నాలుగు రోజులకు కలిపి ఎంత వసూళ్లు వచ్చాయి అనేది ఒకసారి చూద్దాం.
Also Read : 11వ రోజు చరిత్ర సృష్టించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’..ఇప్పటి వరకు ఎంత వచ్చిందంటే
ట్రేడ్ పండితులు అందిస్తున్న లెక్కల ప్రకారం చూస్తే ఈ చిత్రానికి మొదటి నాలుగు రోజుల్లో 5 కోట్ల 80 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అందులో షేర్ దాదాపుగా 2 కోట్ల 75 లక్షలు వచ్చాయని అంచనా. ఇది మరీ డిజాస్టర్ రేంజ్ అని చెప్పలేము కానీ, జరిగిన బిజినెస్ కి పర్వాలేదు అని అనిపించే రేంజ్ అనొచ్చు. నైజాం ప్రాంతం లో ఇప్పటి వరకు ఈ సినిమాకు 92 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, సీడెడ్ లో 35 లక్షలు, ఆంధ్ర ప్రదేశ్ లో కోటి 14 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల నుండి ఈ చిత్రానికి రెండు కోట్ల 41 లక్షల రూపాయిలు రాగా, గ్రాస్ నాలుగు లక్షల 75 వేల రూపాయిలు వచ్చాయి. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ కలిపి కేవలం 36 లక్షల షేర్ వసూళ్లు వచ్చాయి.
ఓవరాల్ గా 5 కోట్ల 80 లక్షల గ్రాస్ వస్తే, నిర్మాతలు పోస్టర్ లో 8 కోట్లు వచ్చినట్టు చెప్పుకొచ్చారు. కానీ ఈ సినిమా క్లోజింగ్ లో ఈరోజు నిర్మాతలు పోస్టర్ మీద వేసిన గ్రాస్ రావొచ్చు అని అంటున్నారు ట్రేడ్ పండితులు. నిమ్రతలు మాత్రం థియేట్రికల్ + నాన్ థియేట్రికల్ రైట్స్ తో సేఫ్ గానే ఉన్నారు. కానీ బయ్యర్స్ మాత్రం బాగా నష్టపోయారు. థియేటర్స్ లో పెద్దగా రెస్పాన్స్ దక్కించుకోని ఈ చిత్రానికి ఓటీటీ లో మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు కొందరు. మరో రెండు వారాల్లో ఈ సినిమా ఓటీటీ లోకి వచ్చే అవకాశం ఉంది.
Also Read : అర్జున్ S/O వైజయంతి’ 3 రోజుల వసూళ్లు..టాలీవుడ్ కి మరో డిజాస్టర్!