Chennai : ఈ ఘన విజయం ద్వారా కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు పాయింట్ల పట్టికలో ఒక్కసారిగా మూడవ స్థానంలోకి దూసుకుపోయింది. కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు లో క్వింటన్ డికాక్ (23), సునీల్ నరైన్(44), అజింక్యా రహానే (20), రింకూ సింగ్(15) పరుగులు చేయడంతో..కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు 10.1 ఓవర్లలోనే టార్గెట్ ఫినిష్ చేసింది. అన్షుల్, నూర్ అహ్మద్ చెరోవికెట్ తీశారు. మరో 59 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని పూర్తి చేయడంతో..కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు పాయింట్ల పట్టికలో మూడవ స్థానానికి దూసుకుపోయింది. ఇదే సమయంలో బెంగళూరు జట్టును బీట్ చేసేసింది.. దీంతో బెంగళూరు జట్టు నాలుగో స్థానానికి పడిపోవాల్సి వచ్చింది. గురువారం జరిగిన మ్యాచ్లో బెంగళూరు ఢిల్లీ చేతిలో ఓటమిపాలైంది. 6 వికెట్ల తేడాతో దారుణమైన పరాజయాన్ని ఎదుర్కొంది. అయితే బెంగళూరు జట్టును అధిగమించే నెట్ రన్ రేట్ మిగితా వాటికి లేకపోవడంతో.. ఓటమి ఎదురైనప్పటికీ బెంగళూరు మూడో స్థానంలో కొనసాగింది. అయితే చెన్నైలో జరిగిన మ్యాచ్లో కోల్ కతా నైట్ రైడర్స్ మరో 59 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని సాధించడంతో..కోల్ కతా నైట్ రైడర్స్ ఏకంగా మూడవ స్థానానికి చేరుకుంది.
Also Read : పోటీలో ముగ్గురు.. రుతు రాజ్ గైక్వాడ్ స్థానంలో ఎవరు?
మూడవ అతిపెద్ద రికార్డ్
ఈ మ్యాచ్లో గెలవడం ద్వారా కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు ఐపీఎల్ లో మూడవ అతిపెద్ద విజయాన్ని రన్ చేజ్ విభాగంలో నమోదు చేసింది. ఈ జాబితాలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మొదటి స్థానంలో ఉంది. 2015లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు విధించిన 112 పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు కేవలం 9.4 ఓవర్ లోనే పూర్తి చేసింది.
2024లో లక్నో సూపర్ జెయింట్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ పోటీ పడ్డాయి. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో 166 రన్స్ చేసింది.. 167 పరుగుల లక్ష్యాన్ని సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 9.4 ఓవర్లలో ఫినిష్ చేసింది.
శుక్రవారం జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. 9 వికెట్లు లాస్ అయ్యి 103 పరుగులు చేసింది. 104 పరుగుల టార్గెట్ ను కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు కేవలం 10.1 ఓవర్లలోనే ఖతం చేసి పడేసింది.. ఒకరకంగా మరో 59 బంతులు మిగిలి ఉండగానే ఈ లక్ష్యాన్ని ఫినిష్ చేసింది.. అయితే ఇందులో బెంగళూరు, కోల్ కతా జట్ల మధ్య 2015 లో జరిగిన మ్యాచ్ ను వర్షం కురవడం వల్ల కుదించారు. అయినప్పటికీ కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుకు ఓటమి తప్పలేదు.
Also Read : చెన్నై ఆటగాళ్లకు ఏమైంది.. ఇలా ఎందుకు ఆడుతున్నారు?