Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీలో లీగ్ సమరం నేటితో ముగుస్తుంది. భారత్ – న్యూజిలాండ్ (IND vs NZ) జట్లు ఆదివారం దుబాయ్ వేదికగా తలపడతాయి. రెండు గంటల 30 నిమిషాల నుంచి ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. అయితే భారత్ ఆడే మ్యాచ్ మిగతా జట్టులకు ఇబ్బందికరంగా మారింది.
Also Read: భారత్ ను ఊరిస్తున్న మొదటి స్థానం.. కివీస్ ను ఎలా పడగొడుతుందో?
గ్రూప్- ఏ లో న్యూజిలాండ్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. భారత్ రెండవ స్థానంలో ఉంది. ఇప్పటికే ఈ రెండు జట్లు సెమీఫైనల్ వెళ్ళిపోయాయి. అయితే లీగ్ దశలో ఈ రెండు జట్లు ఆదివారం తలపడతాయి. ఇందులో గెలిచిన జట్టు గ్రూప్ – ఏ లో అగ్రస్థానంలో ఉంటుంది. గ్రూపు ఏ లో అగ్రస్థానంలో ఉన్న జట్టు గ్రూప్ బి లో రెండవ స్థానంలో ఉన్న ఆస్ట్రేలియాతో పోటీ పడాల్సి ఉంటుంది. గ్రూప్ ఏ లో రెండో స్థానంలో ఉన్న జట్టు దక్షిణాఫ్రికా తో తలపడాల్సి ఉంటుంది. భారత్ సెమి ఫైనల్ చేరుకున్నప్పటికీ ఏ జట్టుతో ఆడుతుందో ఇంతవరకు స్పష్టత లేదు. పాకిస్తాన్ నుంచి ఆస్ట్రేలియా దుబాయ్ వెళ్లిపోయింది. ఒకవేళ భారత్ న్యూజిలాండ్ జట్టుతో గెలిస్తే.. తొలి సెమీఫైనల్ మ్యాచ్ భారత్ – ఆస్ట్రేలియా మధ్య జరుగుతుంది. అందువల్లే ప్రాక్టీస్ కోసం ఆస్ట్రేలియా దుబాయ్ వెళ్లింది. ఒకవేళ గనుక భారత్ ఓడిపోతే ఆస్ట్రేలియా మళ్ళీ పాకిస్తాన్ రావాల్సి ఉంటుంది.. ఒకవేళ భారత్ గనుక ఓడిపోతే.. సెమీఫైనల్ లో దక్షిణాఫ్రికా జట్టుతో పోటీ పడాల్సి ఉంటుంది. దక్షిణాఫ్రికా ఇప్పటికే గ్రూప్ బి లో మొదటి స్థానంలో ఉంది. శనివారం ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో దక్షిణాఫ్రికా విజయం సాధించింది.. దక్షిణాఫ్రికా జట్టును కూడా ఐసీసీ దుబాయ్ రప్పించడానికి ప్రయత్నాలు చేస్తోంది. గ్రూపు – ఏ లో భారత్ ఎలాంటి స్థానంలో ఉన్నా.. ప్రత్యర్థి జట్టు దుబాయ్ రావాల్సిందే. అందువల్లే ఐసీసీ ఆస్ట్రేలియాను దుబాయ్ పిలిపించింది. దక్షిణాఫ్రికాకు కూడా రెడీగా ఉండాలని సంకేతాలు ఇచ్చింది.
న్యూజిలాండ్ గెలిస్తే..
ఒకవేళ భారత జట్టుతో జరుగుతున్న లీగ్ మ్యాచ్లో న్యూజిలాండ్ గనుక గెలిస్తే.. ఆస్ట్రేలియా పాకిస్తాన్ వెళ్లిపోవాల్సి ఉంటుంది. న్యూజిలాండ్ – పాకిస్తాన్ సెమి ఫైనల్ మ్యాచ్ పాకిస్తాన్లో ఆడతాయి. అప్పుడు దక్షిణాఫ్రికా దుబాయ్ లో ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ న్యూజిలాండ్ పై భారత్ గనుక గెలిస్తే.. దక్షిణాఫ్రికా ఆటగాళ్లు దుబాయ్ నుంచి పాకిస్తాన్ వెళ్లిపోవాల్సి ఉంటుంది. అక్కడ న్యూజిలాండ్ – దక్షిణాఫ్రికా మధ్య రెండవ సెమీఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. అప్పుడు ఆస్ట్రేలియా జట్టుతో భారత్ దుబాయ్ వేదికగా మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్ ఆడుతుంది. అయితే ఇతర జట్లకు ఈ తలనొప్పులు మొత్తం పోవాలంటే భారత్ లీ గ్ మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టుపై గెలవాల్సి ఉంది. అప్పుడే ఆస్ట్రేలియా దుబాయ్ వచ్చినందుకు సార్ధకత ఏర్పడుతుంది. లేకపోతే ఆస్ట్రేలియా ఇక్కడ నుంచి వెళ్ళిపోయి.. దక్షిణాఫ్రికా దుబాయ్ రావాల్సి ఉంటుంది. పాకిస్తాన్ దేశంతో ఉన్న అంతర్గత విభేదాలు.. రాజకీయ కారణాల వల్ల భారత్ ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ మోడ్ లో ఆడుతోంది. గత ఆసియా కప్ లో కూడా భారత్ ఇదే విధంగా ఆడింది.
Also Read: పాక్ క్రికెట్ బోర్డు కు ఎంత కష్టం.. ఓ వైపు 590 కోట్ల ఖర్చు.. మరోవైపు డబ్బులు వాపస్..