Champions Trophy 2025 (2)
Champions Trophy 2025: ఎనిమిది దేశాలు బరిలో ఉన్నాయి.. 8 సంవత్సరాల తర్వాత టోర్నో జరుగుతున్నది.. వేదిక పాకిస్తాన్ అనే విషయాన్ని కాస్త మర్చిపోతే.. మిగతా అన్ని విషయాలలో ఐసీసీ స్పష్టమైన ప్రణాళికతో ఉంది.. అందువల్లే ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నీని ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నది. 2017 తర్వాత ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ నిర్వహిస్తున్నది ఇప్పుడే. దాదాపు 8 సంవత్సరాల తర్వాత ఐసీసీ ఈ ట్రోఫీని నిర్వహిస్తోంది.
ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించాలి అనే ఆలోచన ఐసిసికి 1998లో కలిగింది. అప్పుడు t20 ఫార్మాట్ లేదు కాబట్టి.. వరల్డ్ కప్ ను మరింత విస్తరించాలని ఐసీసీ భావించింది. ఇందులో భాగంగా బంగ్లాదేశ్ వేదికగా తొలి ట్రోఫీని 1998లో నిర్వహించింది. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించాలని ఐసీసీ నాటి రోజుల్లో భావించింది. తొలి ఛాంపియన్స్ ట్రోఫీ బంగ్లాదేశ్ వేదికగా జరిగితే.. అప్పుడు దక్షిణాఫ్రికా విజేతగా నిలిచింది. ప్రారంభంలో దీనిని ఐసీసీ నాకౌట్ ట్రోఫీగా పిలిచేవారు. ఆ తర్వాత 2002 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీగా మార్చారు. 2002లో ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ – శ్రీలంక జట్లు సమంగా పంచుకోవాల్సి వచ్చింది. ఛాంపియన్ ట్రోఫీ ని ఇప్పటివరకు 8 సార్లు నిర్వహించారు. ఇందులో భారత్ – ఆస్ట్రేలియా రెండుసార్లు ఈ ట్రోఫీని దక్కించుకున్నాయి. 2017లో చివరిసారిగా ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించారు. ఈ ట్రోఫీ ఫైనల్ లో భారత్ – పాకిస్తాన్ జట్లు తలపడ్డాయి. అయితే పాకిస్తాన్ జట్టు విజయం సాధించింది. ఛాంపియన్స్ ట్రోఫీ 2006 వరకు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగేది. ఆ తర్వాత నాలుగు సంవత్సరాలకు మారిపోయింది. ఇక ఇప్పుడైతే 8 సంవత్సరాలకు ఒకసారి జరుగుతున్నది.
అప్పుడు ఆ ప్రశ్న ఎదురయింది
వన్డే వరల్డ్ కప్ లో టాప్ టీమ్ లు ఉన్న తర్వాత.. మళ్లీ అదే ఫార్మాట్లో ఛాంపియన్స్ టోర్నీ నిర్వహించడం ఎందుకనే ప్రశ్న ఐసీసీకి ఎదురైంది. అందువల్లే ఈ టోర్నీ నిర్వహించడానికి వెనకడుగు వేసింది. దీనికి తోడు టి20 టోర్నీలు నిర్వహించడం.. దాంతోపాటు వన్డే వరల్డ్ కప్ కూడా రావడంతో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విషయంలో అంతగా ఆసక్తి చూపించలేదు. వాస్తవానికి 2019లో వన్డే వరల్డ్ కప్ జరిగింది. ఆ తర్వాత మరసటి సంవత్సరం t20 ప్రపంచ కప్ జరగాల్సి ఉంది. అయితే కోవిడ్ సమయంలో టోర్నీ నిర్వహించడం సాధ్యం కాలేదు. ఆ తర్వాత 2021లో జరగాల్సిన ఛాంపియన్స్ ట్రోఫీని నిలిపివేసింది. అయితే ఐసీసీ పెద్దలు ఏమని నిర్ణయించుకున్నారో తెలియదు కానీ.. పరిమిత ఓవర్ల విస్తరణకు కృషి చేయాలని భావించారు.. ఇందులో భాగంగానే మళ్ళీ తెరపైకి ఛాంపియన్స్ ట్రోఫీని తీసుకొచ్చారు.. ఈసారి పాకిస్తాన్ వేదికగా హైబ్రిడ్ విధానంలో ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహిస్తున్నారు. అయితే ఈసారి 8 జట్లు బరిలో ఉన్న నేపథ్యంలో.. పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తున్న నేపథ్యంలో.. ఛాంపియన్ గా ఎవరు నిలుస్తారన్నది ఆసక్తికరంగా మారింది.