CM Revanth Reddy (4)
CM Revanth Reddy: ప్రధాని నరేంద్రమోదీ చాయ్ వాలా(Chai wala)గా అందరికీ తెలుసు. కానీ ఆయన కులం గురించి ఎవరూ పట్టించుకోరు. అప్పుడప్పుడు బీసీ దేశానికి ప్రధాని అయ్యడని బీజేపీ నేతలు అంటుంటారు. కానీ, బీసీల్లో వందల కులాలు ఉన్నాయి. ఇక మోదీ తెలి కులానికి చెందిన వ్యక్తి. ఆ కులంలో చాలా ఉప కులాలు ఉన్నాయి. అందులో ఒకటైన మోద్–ఘాంచి కులానికి చెందినవారు. ఎడిబుల్ ఆయిల్ సహా ఇతర వ్యాపారాలు చేసేవారు. ఓబీసీ జాబితాలో 23వ ఎంట్రీలో ఘాంచి(ముస్లిం), రాథోడ్ కులాలను చేర్చారు. ఇందులో ఘాంచి కులాన్ని 1999లోనే ఓబీసీ జాబితాలో చేర్చారు. 2000 ఏప్రిల్ 4న తేలి, మోద్-ఘాంచి, తెలి సాహు, తేలి రాథోడ్, తేలి రాథోర్ కులాలను ఓబీసీ జాబితాలో చేర్చారు. తేలి కులస్థులు గుజారాత్‌లోనే కాకుండా దేశమంతా ఉన్నారు. కొందరు పేరు వెనకాల గుప్తా అని పెట్టుకుటారు. మరికొందరు మోదీ అని పెట్టుంటారు. బిహార్‌లో ఉన్న తేలి కులస్థులను 53వ ఎంట్రీగా ఓబీసీలో చేర్చారు. రాజస్థాన్‌లో ఉన్న తేలి కులాన్ని 51వ ఎంట్రీగా ఓబీసీల్లో చేర్చారు. ఒక రాష్ట్రంలో ఒక కులాన్ని ఓబీసీలో చేర్చినంత మాత్రాన ఆ కులం కేంద్రంలో ఉన్న ఓబీసీ జాబితాలో ఉండాలని లేదు. ఆయా రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులను బట్టి ఆయా కులాలను రాష్ట్రంలో ఉన్న ఓబీసీల్లో చేరుస్తారు. తర్వాత కేంద్రం కూడా అధ్యయనం చేసి ఓబీసీల్లో చేరుస్తారు. ఇలా కేంద్ర ఓబీసీ(OBC) జాబితాలో ఓ కులం చేర్చినే తర్వాత దేశవ్యాప్తంగా చెల్లుబాటు కాదు. కేవలం కేంద్రం పరిధిలో ఉన్న విభాగాల్లోనే ఓబీసీలుగా పరిగణిస్తారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న బీసీ జాబితాలో చోటు ఉండదు. కొన్ని రాష్ట్రాల్లో ఓసీగా ఉన్న కులాలు, మరికొన్ని రాష్ట్రాల్లో ఓబీసీగా గుర్తింపు పొందిన సందర్భాలు ఉన్నాయి.
కొన్ని ప్రాంతాల్లో అగ్ర వర్ణాలుగా..
ఇదిలా ఉంటే.. పాటిదార్, బ్రాహ్మణ, వాణిక, ఖత్రి వంటి కులాల మాదిరిగా ఘంచి కులాన్ని కూడా కొన్ని ప్రాంతాల్లో వ్యాపారవర్గంగా పరిగణిస్తారు. అయితే సామాజిక పరిస్థితుల పరంగా తేలి కులాన్ని వెనుకబడిన వర్గంగా గుజరాత్(Gujarath) ప్రభుత్వం 2000లో బీసీ జాబితాలో చేర్చింది. అప్పటివరకు దీనిని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. మోదీ గుజారాత్ సీఎం అయ్యాక అంటే 2002 తర్వాత ఘాంచి/తేలి కులం గురించి ఆరా తీయడం మొదలైంది. అందుకే కొన్నిచోట్ల ఈ ఘాంచి కులాన్ని 2000లో బీసీల్లో చేర్చారని మరికొన్నిచోట్ల 2002లో అని ప్రస్తావించారు. అధికారికంగా మాత్రం 2000లోనే ఈ ప్రక్రియ పూర్తయింది.
మోదీ పేరుపై అనేక వాదనలు
ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా ఉన్న ఓబీసీల జాబితాలో ఎక్కడా మోదీ అనే పేరుతో కులం లేదు. ఇది నిర్ధిష్ట సమాజాన్ని లేదా కులాన్ని మాత్రం సూచించదు. మోదీ ఇంటి పేరును హిందువులే కాకుండా ముస్లింలు పార్సీలు కూడా యూజ్ చేస్తారు. ఇతర కులాల్లో ఉన్నవారు కూడా మోదీ పేరు పెట్టుకుంటారు. గతంలో మోదీ పేరుపై రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. కేసుల్లో ఇరుక్కున్న ఆయనకు రెండేళ్ల జైలు శిక్షను కూడా కోర్టు విధించింది. దీంతో పార్లమెంట్ సభ్యత్వం కోల్పోయారు. అప్పుడే మోదీ ఇంటిపేరు, ఆయన కులంపై చర్చ జరిగింది. ఇప్పుడు తెలంగాణ సీఎం కూడా మోదీ కులం ప్రస్తావన తెచ్చారు.