RRB Group D Recruitment: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు కేంద్రం వరుసగా గుడ్ న్యూస్ చెబుతోంది. ఇటీవలే పోస్టల్ జాబ్స్ నోటిఫకేషన్ ఇచ్చింది. అంతకు ముందే ఆర్‌ఆర్‌బీ నోటిఫికేషన్(RRB notification) విడుదల చేసింది. ఈ రెండు నోటిఫికేషన్ల ఉద్యోగాలకు ఉన్నత చదువులు అవసరం లేదు. పదో తరగతి పాస అయితే చాలు. 2025, జనవరి 21న నోటిఫికేషన్ ఇచ్చింది. మొత్తం 32,438 పోస్టులు అందుబాటులో ఉన్నాయి. దరఖాస్తుకు ఆఖరు తేదీ ఫిబ్రవరి 22 గా నిర్ణయించింది. అంటే ఇంకా వారం రోజులే గడువు ఉంది. ఆర్‌ఆర్‌బీ గ్రూప్‌డీ పరీక్ష కంప్యూటర్ ఆధారితంగా ఉంటుంది. పీఈటీ డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్, ఎంప్యానెల్‌మెంట్ కోసం తేదీలు ఈ సీఈఎన్‌లో పారా 21.0లో జాబితా చేసిన రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్స్ వెబ్‌సైట్ ద్వారా అప్‌డేట్ అవుతుంటాయి. భారతీయ రైల్వేలోని వివిధ యూనిట్లలోని 7వ సీపీసీ పే మ్యాట్రిక్స్‌లోని 7వ సీపీసీ పే మ్యాట్రిక్స్‌లోని ఒకటో స్థాయికి చెందిన వివిధ పోస్టు కోసం ఈ సీఈఎన్‌లో పారా 4లో పొందుపరిచింది. అర్హత ఉన్నవారు ఆర్‌ఆర్‌బీలు ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానించాయి.
గ్రూప్– డి ఖాళీల వివరాలివే..
ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో అసిస్టెంట్ బ్రిడ్జ్, అసిస్టెంట్ సీ–డబ్ల్యూ, అసిస్టెంట్ డిపో(స్టోర్స్), అసిస్టెంట్ లోకో షెడ్(డీజిల్), ట్రాక్ మెయింటెయినర్, క్యాబిన్ మ్యాన్, పాయింట్స్ మెన్, ఇతర స్థానాలు ఉన్నాయి. అభ్యర్థులు ప్రతీ పోస్టుకు సంబంధించిన ఖాళీలపై సవివరమైన సమాచారం కోసం అధికారిక నోటిఫికేషన్ చూడొచ్చు.
అర్హతలు ఇవే..
ఆర్‌ఆర్‌బీ గ్రూప్–డి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఐటీఐ, డిప్లొమా తప్పనిసరి కాదు. గతంలో సాంఏతిక విభాగాలకు దరకాస్తు చేసుకునే అభ్యర్థులు నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ జారీ చేసిన ఎన్‌సీఎస్‌సీ లేదా ఐటీఐ డిప్లొమాతోపాటు పదో తరగతి సర్టిఫికెట్ కలిగి ఉండాలి. ఈ అర్హతలు లేని అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు కాదు..
వయోపరిమితి…
నోటిఫికేషన్ ప్రకారం.. లెవల్–1లోని పోస్టులకు గరిష్ట వయోపరిమితి 18 నుంచి 36 ఏళ్ల మధ్య ఉండాలి. కోవిడ్ కారణంగా ఆర్‌ఆర్‌బీ అవకాశం కోల్పోయినవారు లేదా వయోపరిమితి దాటినవారికి మూడేళ్ల సడలింపు ఉంటుంది. దీంతో వేల మందికి ఉపశమనం లభించింది.