https://oktelugu.com/

Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ.. కొత్త జెర్సీలో టీమిండియా ఆటగాళ్లు అదిరిపోయారు..

ఇటీవల టీమిండియా ఆటగాళ్లు కొత్త జెర్సీతో కనిపించారు. ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన టి20, వన్డే సిరీస్ లలో బ్లూ జెర్సీ లు ధరించి ఆకట్టుకున్నారు.. భుజాలపై జాతీయ జెండా ఆకృతులు ఉన్నాయి.

Written By: , Updated On : February 18, 2025 / 01:51 PM IST
Champions Trophy 2025 (5)

Champions Trophy 2025 (5)

Follow us on

Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025(Champions trophy 2025) కోసం భారత జట్టు ఆటగాళ్లు(team India cricketers) ఫొటో సెషన్ లో పాల్గొన్నారు. ఇందులో టీమిండియా ఆటగాళ్లు రోహిత్ శర్మ(Rohit Sharma), హార్దిక్ పాండ్యా(Hardik Pandya), రవీంద్ర జడేజా(Ravindra Jadeja), అర్ష్ దీప్ సింగ్(Arshdeep Singh) తదితరులు సందడి చేశారు..టీ 20 టీమ్(T20 team), టెస్ట్ టీమ్(Test team) క్యాప్ లు ధరించి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. టీమిండియా ఆటగాళ్లు(team India players) ధరించిన జెర్సీలపై పాకిస్తాన్ అనే పేరు రాసి ఉండడం విశేషం. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారాయి.

ఇటీవల టీమిండియా ఆటగాళ్లు కొత్త జెర్సీతో కనిపించారు. ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన టి20, వన్డే సిరీస్ లలో బ్లూ జెర్సీ లు ధరించి ఆకట్టుకున్నారు.. భుజాలపై జాతీయ జెండా ఆకృతులు ఉన్నాయి.. చాతి భాగంలో అడిడాస్ లోగో ఉంది. ఉదర భాగంలో డ్రీమ్ 11 లోగో ఉంది. ఈ జెర్సీలలో టీమిండియా ఆటగాళ్లు అదిరిపోయారు. బ్లూ కలర్ జెర్సీలతో ఆకట్టుకున్నారు.. టీమిండియా ఆటగాళ్లు ధరించిన బ్లూ జెర్సీలు అదిరిపోయాయి.” ఆటగాళ్లు అందంగా ఉన్నారు. కొత్త జెర్సీలలో అదిరిపోయారు. అడిడాస్ కంపెనీ అద్భుతంగా రూపొందించిందని” అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్ చేశారు.

పాకిస్తాన్ పేరుతో..

మొన్నటి ఇంగ్లాండు సిరీస్లో కొత్త జెర్సీలతో దర్శనమిచ్చిన టీమిండియా ఆటగాళ్లు.. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ ముందు మరో కొత్త జెర్సీతో దర్శనమిచ్చారు. ఛాంపియన్స్ ట్రోఫీ ప్రస్తుతం పాకిస్తాన్ లో జరుగుతోంది కాబట్టి.. టీమిండియా ఆటగాళ్లు ధరించిన జెర్సీపై పాకిస్తాన్ అనే పేరు ఉంది. అయితే ఆ మధ్య పాకిస్తాన్ అనే పేరు ఉన్న జెర్సీని టీమిండియా ఆటగాళ్లు ధరించబోరని వార్తలు వినిపించాయి. అయితే దీనిపై బీసీసీఐ వర్గాలు పెద్దగా స్పందించలేదు. ఆటగాళ్లు కూడా మాట్లాడలేదు. అయితే ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఆటగాళ్లు ధరించే జెర్సీపై పాకిస్తాన్ అనే పేరు ఉంది. అయితే దీనిపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నప్పటికీ.. బీసీసీఐ వర్గాలు పెద్దగా స్పందించడం లేదు. ఆటగాళ్లు కూడా మాట్లాడటం లేదు. 2023లో భారత వేదికగా వరల్డ్ కప్ జరిగినప్పుడు.. పాకిస్తాన్ ఆటగాళ్లు ధరించిన జెర్సీపై ఇండియా అనే అక్షరాలు ఉన్నాయి. పాకిస్తాన్ ఆటగాళ్లు అప్పుడు ఆ జెర్సీ ధరించినప్పుడు పాక్ క్రికెట్ బోర్డు నుంచి అభ్యంతరాలు వ్యక్తం కాలేదు. ఇప్పుడు భారత్ ఆటగాళ్లు ధరించిన జెర్సీపై కూడా బీసీసీఐ వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేయడం లేదు.. అయితే కొత్త జెర్సీతో టీమ్ ఇండియా ఆటగాళ్లు పాల్గొన్న ఫోటోషూట్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.. ఆటగాళ్లు ఆ జెర్సీలో మరింత అందంగా కనిపిస్తున్నారు. ” టీమిండియా ఆటగాళ్లు కొత్త జెర్సీలో అందంగా కనిపిస్తున్నారు. మరింత ఉత్సాహంగా దర్శనమిస్తున్నారు. వారు ధరించిన జెర్సీలు అద్భుతంగా ఉన్నాయి. తలపై ధరించిన ఎరుపు రంగు క్యాంపులు కూడా సరికొత్తగా కనిపిస్తున్నాయి. వారు ఇదే ఉత్సాహాన్ని చాంపియన్స్ ట్రోఫీలో ప్రదర్శించాలి. ఛాంపియన్స్ ట్రోఫీలో విజేతగా ఆవిర్భవించాలి. 2017 నాటి పీడకలకు సరైన ముగింపు పలకాలని” నెటిజన్లు పేర్కొంటున్నారు.