Rashmika , Vijay Deverakonda
Rashmika and Vijay Deverakonda : చాలా కాలం నుండి సోషల్ మీడియా లో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), రష్మిక(Rashmika Mandanna) డేటింగ్ చేసుకుంటున్నారు, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ విషయంపై రష్మిక కూడా పరోక్షంగా ఎన్నోసార్లు నిజమే అన్నట్టుగా సిగ్నల్స్ ఇచ్చింది. ఆమె అలాంటి సిగ్నల్స్ ఇచ్చినా, ఇవ్వకపోయినా అనేక సందర్భాల్లో ఈమె విజయ్ దేవరకొండతో కలిసి కాఫీ షాప్ కి వెళ్లడం, విజయ్ దేవరకొండ ఇంట్లో ఉంటున్నట్టుగా పలు హింట్స్ ఇవ్వడం వంటివి చూసి, వీళ్ళు కచ్చితంగా డేటింగ్ లోనే ఉన్నారని అభిమానులు ఖారారు చేసుకున్నారు. ప్రస్తుతం రష్మిక హైదరాబాద్ లోని విజయ్ దేవరకొండ ఇంట్లోనే అతని కుటుంబం తో కలిసి ఉంటుంది అనేది లేటెస్ట్ సమాచారం. ఈ ఏడాదిలోనే వీళ్లిద్దరు పెళ్లి పీటలు ఎక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా బయటకు రానుంది.
ఇదంతా పక్కన పెడితే కాసేపటి క్రితమే రష్మిక తన ఇంస్టాగ్రామ్ స్టోరీ లో అప్లోడ్ చేసిన ఒక ఫోటో సంచలనం గా మారింది. తన వచ్చిన పూల బొకేని స్టోరీ లో అప్లోడ్ చేస్తూ ‘నా ముఖం పై చిరునవ్వు ఎలా తెప్పించాలో నీకు తెలిసినంతగా ఈ ప్రపంచం లో ఎవరికీ తెలియదు పాపలు’ అంటూ ఒక క్యాప్షన్ పెట్టింది. ఇది కచ్చితంగా ఈమె విజయ్ దేవరకొండ ని ఉద్దేశించి పెట్టింది అంటూ ఆమె అభిమానులు సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. ఇంకెన్ని రోజులు ఈ దాగుడుమూతలు. తొందరగా వీళ్ళ మధ్య ఉన్న రిలేషన్ ని బయటపెడితే అభిమానులు కూడా సంతోషిస్తారు కదా అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే రష్మిక ప్రస్తుతం హీరోయిన్ గా ఎలాంటి క్రేజ్ ని ఎంజాయ్ చేస్తుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసే సినిమాలు ఈమెకు వరుసగా వస్తున్నాయి.
పుష్ప చిత్రంతో మొదలైన రష్మిక మేనియా, ఆ తర్వాత ‘యానిమల్'(Animal Movie), ‘పుష్ప 2′(Pushpa 2) వంటి చిత్రాలతో తారాస్థాయికి చేరుకుంది. ఇప్పుడు రీసెంట్ గా విడుదలైన ‘చావా'(Chhaava Movie) చిత్రంతో మరో ఆల్ టైం బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకున్న రష్మిక, ప్రస్తుతం సల్మాన్ ఖాన్ తో ‘సికందర్’ అనే చిత్రం చేస్తుంది. ఈ సినిమా మీద కూడా అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ చిత్రం తర్వాత ఆమె పాన్ ఇండియా లెవెల్ లో నెంబర్ 1 హీరోయిన్ గా మారిపోయిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక విజయ్ దేవరకొండ విషయానికి వస్తే వరుస డిజాస్టర్ ఫ్లాప్ సినిమాలను ఎదురుకున్న ఆయన, ఇప్పుడు ‘కింగ్డమ్'(Kingdom Movie Teaser) చిత్రంతో మన ముందుకు రాబోతున్నాడు. ఇటీవలే ఈ సినిమా టీజర్ విడుదలై మంచి రెస్పాన్స్ ని దక్కించుకోగా, మే30 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.