CCL 2024: ఘనంగా ప్రారంభమైన సెలబ్రిటీ క్రికెట్ లీగ్…మన తెలుగు వారియర్స్ మ్యాచ్ ఎప్పుడంటే..?

దీనికోసం మన తెలుగు హీరోలు ఇప్పటికే చాలా రకాల కసరత్తులను చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే మొదట షార్జా వేదికగా ఈ మ్యాచ్ లు ఆడుతున్నారు.ఆ తర్వాత హైదరాబాద్, చండీగఢ్, త్రివేండ్రం,వైజాగ్ లలో మ్యాచ్ లను నిర్వహించనున్నారు.

Written By: Gopi, Updated On : February 24, 2024 10:42 am
Follow us on

CCL 2024: ఐపీఎల్ తర్వాత మన తెలుగు ప్రేక్షకులు విపరీతంగా ఎదురుచూసే లీగ్ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (సిసిఎల్)… ఇందులో మన హీరోలు పాల్గొని మ్యాచ్ లను ఆడడమే కాకుండా వాళ్ళ అభిమానులను ఉత్సాహపరుస్తూ ఉంటారు. స్క్రీన్ మీద పాటలు పాడుతూ, డాన్సులు వేస్తూ, ఫైట్ చేస్తూ అభిమానులను ఎంటర్ టైన్ చేసే హీరోలు మైదానంలో సిక్స్ లు, ఫోర్లు కొడుతూ అభిమానులను ఆనంద పరుస్తూ ఉంటారు. ఇక అందులో భాగంగానే తెలుగులో మంచి హీరోలుగా గుర్తింపు పొందిన అఖిల్, వెంకటేష్, శ్రీకాంత్ లాంటి నటులు ఈ లీగ్ లో ఎప్పుడు పాల్గొంటూ ఉంటారు. ఇక అక్కినేని అఖిల్ మన టీమ్ కి కెప్టెన్ గా వ్యవహరించడం విశేషం… ఇక 2024 సిసిఎల్ లీగ్ నిన్న ప్రారంభమైంది. దుబాయ్ లోని షార్జా వేదికగా సినీ ప్రముఖుల క్రికెట్ లీగ్ ని ప్రారంభించారు. ఇక ఫిబ్రవరి 23వ తేదీ నుంచి మార్చి 17వ తేదీ వరకు ఈ మ్యాచ్ లు జరగనున్నాయి.

దీనికోసం మన తెలుగు హీరోలు ఇప్పటికే చాలా రకాల కసరత్తులను చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే మొదట షార్జా వేదికగా ఈ మ్యాచ్ లు ఆడుతున్నారు.ఆ తర్వాత హైదరాబాద్, చండీగఢ్, త్రివేండ్రం,వైజాగ్ లలో మ్యాచ్ లను నిర్వహించనున్నారు. ఇక ఈ లీగ్ లో మొత్తం 20 మ్యాచ్ లు జరగనున్నాయి. ఇవాళ్ళ మన తెలుగు వారియర్స్ కి భోజ్ పూరి దబాంగ్స్ కి మధ్య మధ్యాహ్నం 2:30 నిమిషాలకు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ను ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ అయిన జియో సినిమాలో ఉచితంగా చూడవచ్చు…ఇక ప్రతిసారి మన టీమ్ మంచి విజయాలను అందుకుంటూ ముందుకు దూసుకెళ్తుంది.

అక్కినేని అఖిల్ సారధ్యంలో ఆడుతున్న మన టీం ఎప్పుడు దిగ్విజయంగా ముందుకు దూసుకెళ్తూ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తుంది. ఇక ఇప్పుడు కూడా అదే ఊపుతో ముందుకు దూసుకెళ్లాలని ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ఈసారి తెలుగు, హిందీ,తమిళ్, మలయాళం, కన్నడ, బెంగాలీ, భోజ్ పూరి, పంజాబీ జట్టు తలపడనున్నాయి…

ఇక ఇంతకుముందు తెలుగు వారియర్స్ టీమ్ లో కీలకపాత్ర వహించిన అఖిల్, సాయి ధరమ్ తేజ్, అశ్విన్ బాబు, ప్రిన్స్ లాంటి స్టార్ హీరోలు ఇప్పుడు ఈ మ్యాచ్ లో కూడా భాగమై ముందుకు సాగుతూ ఉండడం చాలా వరకు తెలుగు వారియర్స్ టీం కి కలిసి వచ్చే అంశమనే చెప్పాలి.