Director Shankar’s son-in-law: క్రికెట్ లో మరో వివాదం వెలుగులోకి వచ్చింది. ప్రముఖ దర్శకుడి అల్లుడితో సహా ఐదుగురిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు అయింది. దీంతో ఇందులో క్రికెట్ అసోసియేషన్ వ్యవస్థాపకుడు, ఇద్దరు కోచ్ లు, క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీలు భాగస్వాములు కావడం విశేషం. ప్రముఖ క్రికెటర్ రోహిత్ తోపాటు అతడి తండ్రి కూడా ఉండడం సంచలనం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో సదరు ఐదు మంది మాయం కావడంతో పోలీసులు గాలిస్తున్నారు.

ప్రముఖ దర్శకుడు శంకర్ కూతురును క్రికెటర్ రోహిత్ కు ఇచ్చి వివాహం చేసిన సంగతి తెలిసిందే. కానీ ప్రస్తుతం అతడిపై ఆరోపణలు రావడంతో అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రోహిత్ తండ్రి ప్రముఖ వ్యాపారవేత్త దామోదరన్ పుదుచ్చేరి క్రికెట్ అసోసియేషన్ ఏర్పాటు చేశారు. అందులో ప్రభుత్వ భూమి, మురుగు కాలువలు ఆక్రమించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో దాన్ని మూసివేశారు. తరువాత పుదుచ్చేరిలోని ముతిరాయర్ పాలయం స్కూల్ మైదానంలో క్రికెట్ శిక్షణ ఇస్తున్నారు.
పుదుచ్చేరిలో ఇంటర్ చదువుతున్న ఓ 17 ఏళ్ల అమ్మాయి శిక్షణ కోసం కోచ్ తమరైకన్నన్ ను కలిసి తనకు ట్రైనింగ్ ఇవ్వాలని కోరింది. దీంతో సరేనన్న ఆయన ఆ అమ్మాయి పట్ల అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆమె మరో కోచ్ ను కలిసి తన ఆవేదన వెలిబుచ్చినట్లు తెలిసింది. కానీ ఆయన కూడా ఏదో సర్దుకుపోవాలని సూచించినట్లు సమాచారం. దీంతో కోచ్ ల నిర్వాకంతో విసిగిపోయిన అమ్మాయి క్రికెటర్ రోహిత్ ను కలిసి ఫిర్యాదు చేసింది. ఆయన కూడా పట్టించుకోకపోవడంతో రోహిత్ తండ్రి, పుదుచ్చేరి క్రికెట్ అసోసియేషన్ వ్యవస్థాపకుడు దామోదరన్ ను సైతం కలిసి పరిస్థితి వివరించిది. ఆయన కూడా వారు చెప్పిన విషయాన్ని చెప్పినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో బాధితురాలి ఇంటికి ఇద్దరు వెళ్లి లేనిపోని విషయాలు చెప్పకుండా చక్కగా శిక్షణ తీసుకోవాలని లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బెదిరించినట్లు చెప్పింది. ఈ క్రమంలో అమ్మాయి తండ్రి పుదుచ్చేరి పోలీసులను కలిసి ఫిర్యాదు చేశారు. దీంతో క్రికెటర్ రోహిత్, తండ్రి దామోదరన్, క్రికెట్ కోచ్ లు తమరైకన్నన్, జయకుమార్, క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి వెంకట్ మీద పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.