Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న చిత్రం ‘భీమ్లా నాయక్’. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ సినిమాకి రీమేక్ గా ఈ మూవీని నిర్మిస్తున్నారు. సాగర్ కె చంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా… తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పవన్ కళ్యాణ్, రానా క్యారెక్టర్లు ప్రోమో లు , పాటలకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అయితే తాజాగా షూటింగ్ అనంతరం పవన్ కళ్యాణ్, రానా రెస్ట్ తీసుకుంటున్న ఫోటోను మూవీ యూనిట్ విడుదల చేసింది.
సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ సోషల్ మీడియా ఖాతాలో ఈ పిక్చర్ ను షేర్ చేసింది. సినిమా క్లైమాక్స్ షూటింగ్ లో భాగంగా ఈ ఫోటో తీసినట్లు సమాచారం. ఈ ఫోటో మాత్రం ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ను విడుదల చేయగా… ఆ పాట అదిరిపోయే రేంజ్ లో ట్రెండ్ అవుతుంది. ఇటీవల ‘అంత ఇష్టం ఏందయ్యా’ అనే సెకండ్ సాంగ్ ను విడుదల చేశారు. ఈ పాటకూడ శ్రోతలను అలరిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
Unwinding off the camera #BheemlaNayak & #DanielShekar ♥️💥@pawankalyan @RanaDaggubati #Trivikram @saagar_chandrak @MenenNithya @MusicThaman @dop007 @NavinNooli @vamsi84 @adityamusic pic.twitter.com/JfPeOq21ai
— Sithara Entertainments (@SitharaEnts) October 21, 2021
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగా… త్రివిక్రమ్ మాటలు , స్క్రీన్ ప్లే అందిస్తుండడం విశేషం. ఈ చిత్రంలో పవన్ సరసన నిత్యామీనన్, రానాకి భార్యగా సంయుక్త మీనన్ నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా మూవీని రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం బీమ్లా నాయక్ తో పాటు… క్రిష్ దర్శకత్వంలో ‘హరి హర వీరమల్లు’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పవన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఈ చిత్రానికి ఏ ఎం రత్నం నిర్మాత వ్యవహరిస్తుండగా… నిధి అగర్వాల్ హీరోయిన్ గా చేస్తుంది.