IPL Successful Captains: ఆ జాబితాలో సచిన్, గంభీర్ ఫస్ట్.. సెకండ్ ధోనీ, రోహిత్.. ఐదో స్థానంలో కోహ్లీ, రాహుల్

పంజాబ్ కింగ్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో లక్నో జట్టు భారీ విజయాన్ని నమోదు చేసింది. ఏకంగా 56 పరుగులు తేడాతో విజయం సాధించింది. కెప్టెన్ గా ఐపీఎల్ లో రాహుల్ కు ఇది 50 వ మ్యాచ్ కావడం విశేషం. కెప్టెన్ గా తొలి యాబై మ్యాచ్ ల్లో అతడు తన జట్టును 26 సార్లు గెలిపించాడు.

Written By: BS, Updated On : April 29, 2023 3:37 pm
Follow us on

IPL Successful Captains: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ముగింపు దశకు చేరుకుంటోంది. తదుపరి దశకు వెళ్లాలంటే ప్రతి జట్టుకు మిగిలిన మ్యాచ్ లు అత్యంత కీలకంగా మారాయి. ముఖ్యంగా ప్లే ఆప్స్ కు చేరాలంటే ప్రతి మ్యాచ్ లోనూ విజయం కోసం పోరాడాల్సిన పరిస్థితి పలు జట్లకు ఏర్పడింది. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ రెండో దశకు చేరుకుంది. రెండో దశ పోటీలు జరుగుతుండడంతో అత్యంత కీలకంగా తదుపరి మ్యాచ్ లు.

ఈ ఏడాది ఐపీఎల్ అత్యంత ఆసక్తికరంగా సాగుతోంది. ఒకటి, రెండు జట్లు మినహా అన్ని జట్లు మెరుగైన ప్రదర్శన కనబరుస్తుండడంతో.. ప్లే ఆప్స్ కు ఏ జట్లు చేరతాయన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ముఖ్యంగా రానున్న మ్యాచ్ ల్లో విజయం సాధించడం ప్రతి జట్టుకు అత్యంత కీలకంగా మారింది.

విజయాలతో ఏర్పడిన పోటీ..

పంజాబ్ కింగ్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో లక్నో జట్టు భారీ విజయాన్ని నమోదు చేసింది. ఏకంగా 56 పరుగులు తేడాతో విజయం సాధించింది. కెప్టెన్ గా ఐపీఎల్ లో రాహుల్ కు ఇది 50 వ మ్యాచ్ కావడం విశేషం. కెప్టెన్ గా తొలి యాబై మ్యాచ్ ల్లో అతడు తన జట్టును 26 సార్లు గెలిపించాడు. ఈ జాబితాలో సచిన్ టెండుల్కర్ ముందు వరుసలో ఉన్నాడు. సచిన్ 50 మ్యాచ్ ల్లో ముంబై ఇండియన్స్ ను 30 సార్లు గెలిపించాడు. సచిన్ తో పాటు సంయుక్తంగా గౌతమ్ గంభీర్, షేన్ వార్న్ లు కూడా తొలి స్థానంలో ఉన్నారు. ఇక చెన్నై సూపర్ కింగ్స్ సారథి ధోని ఈ జాబితాలో 29 విజయాలతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. అతడితోపాటు రోహిత్ కూడా 29 స్థానాలతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక 28 మ్యాచ్ ల్లో విజయాలతో వీరేంద్ర సెహ్వాగ్ మూడో స్థానంలో ఉండగా, 27 మ్యాచ్ విజయాలతో డేవిడ్ వార్నర్ నాలుగో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ ఏకంగా ఐదో స్థానంలో నిలవడం గమనార్హం. విరాట్ కోహ్లీ 26 మ్యాచ్ ల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును గెలిపించాడు. కోహ్లీ తోపాటు రాహుల్, శ్రేయస్ అయ్యర్లు కూడా ఐదో స్థానంలో కొనసాగుతున్నారు.

పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు..

ఐపీఎల్ లో సగం మ్యాచ్లు పూర్తయ్యేసరికి రాజస్థాన్ రాయల్స్ జట్టు పాయింట్లు పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు ఒక్కో మ్యాచ్ ఆడాల్సి ఉంది. జట్లు మరో మ్యాచ్ ఆడితే 8 మ్యాచ్ లు పూర్తి చేసుకుంటాయి. ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ లను బట్టి చూస్తే రాజస్థాన్ రాయల్స్ జట్టు 8 మ్యాచ్ ల్లో ఐదు విజయాలు, మూడు ఓటములతో పాయింట్లు పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. లక్నో సూపర్ జెయింట్స్ 8 మ్యాచ్ ల్లో ఐదు విజయాలు, మూడు ఓటములతో పాయింట్లు పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. మూడో స్థానంలో కొనసాగుతున్న గుజరాత్ జట్టు ఏడు మ్యాచుల్లో ఐదు విజయాలు సాధించగా, రెండు మ్యాచ్ ల్లో ఓడింది. చెన్నై జట్టు ఎనిమిది మ్యాచ్ ల్లో ఐదు విజయాలు మూడు ఓటములతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు 8 మ్యాచుల్లో నాలుగు విజయాలు, నాలుగు ఓటములతో ఐదవ స్థానంలో, పంజాబ్ కింగ్స్ జట్టు ఎనిమిది మ్యాచ్ ల్లో తెలుగు విజయాలు, నాలుగు ఓటములతో ఆరో స్థానంలో కొనసాగుతోంది. కోల్కతా జట్టు మూడు విజయాలు, ఐదు ఓటములతో ఏడో స్థానంలోనూ కొనసాగుతోంది. ముంబై ఇండియన్స్ జట్టు ఏడు మ్యాచ్ ల్లో మూడు విజయాలు, నాలుగు ఓటములతో ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఏడు మ్యాచ్ ల్లో రెండు విజయాలు, ఐదు మ్యాచ్ ల్లో ఓటములతో తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది. ఈ సీజన్ లో అట్టడుగు స్థానంలో కొనసాగుతోంది ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు. ఏడు మ్యాచ్ ల్లో రెండు విజయాలు, ఐదు ఓటములతో పాయింట్ల పట్టికలతో అట్టడుగు స్థానంలో నిలిచింది.