Team India: విరాట్ కోహ్లీ, రోహిత్ ను కలిసి ఇక ఆడించరా?

Team India: టీమిండియాలో విభేదాలు లేవని.. పాత కెప్టెన్ విరాట్ కోహ్లీతో ప్రస్తుత కొత్త కెప్టెన్ రోహిత్ కు అసలు పడదన్న వార్తలు అవాస్తవాలని బీసీసీఐ తోపాటు టీం మేనేజ్ మెంట్ చాలాసార్లు చెప్పుకొచ్చింది. కానీ కెప్టెన్ గా కోహ్లీ వైదొలిగాక జరుగుతున్న మొదటి సిరీస్ లోనే కోహ్లీకి షాకిస్తూ రోహిత్ ను కెప్టెన్ చేసి అతడి టీంలో మాజీ కెప్టెన్ కు చోటు ఇవ్వకపోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అంతేకాదు.. తాజాగా టెస్టు జట్టును ప్రకటించారు. ఇందులో […]

Written By: NARESH, Updated On : November 12, 2021 5:46 pm
Follow us on

Team India: టీమిండియాలో విభేదాలు లేవని.. పాత కెప్టెన్ విరాట్ కోహ్లీతో ప్రస్తుత కొత్త కెప్టెన్ రోహిత్ కు అసలు పడదన్న వార్తలు అవాస్తవాలని బీసీసీఐ తోపాటు టీం మేనేజ్ మెంట్ చాలాసార్లు చెప్పుకొచ్చింది. కానీ కెప్టెన్ గా కోహ్లీ వైదొలిగాక జరుగుతున్న మొదటి సిరీస్ లోనే కోహ్లీకి షాకిస్తూ రోహిత్ ను కెప్టెన్ చేసి అతడి టీంలో మాజీ కెప్టెన్ కు చోటు ఇవ్వకపోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

Rohit-Virat kohli

అంతేకాదు.. తాజాగా టెస్టు జట్టును ప్రకటించారు. ఇందులో రోహిత్ శర్మకు విశ్రాంతినిచ్చి అజింక్యా రహానేను కెప్టెన్ చేశారు. రెండో టెస్టుకు కోహ్లీనే కెప్టెన్సీ వహించనున్నాడు. ఇతడి కెప్టెన్సీలోనూ రోహిత్ కు విశ్రాంతిని ఇవ్వడం విశేషం.

దీన్ని బట్టి రోహిత్ శర్మ కెప్టెన్సీలో విరాట్ కోహ్లీ ఆడడని తేలిపోయింది. ఇక విరాట్ టెస్ట్ కెప్టెన్సీలో రోహిత్ శర్మ ఆడడని బీసీసీఐ స్పష్టమైన సంకేతాలిచ్చింది. అంటే వీరిద్దరి మధ్య విభేదాలు నిజమేనా? అన్న అనుమానాలు కలుగకమానవు.

న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ కు రోహిత్ శర్మ కెప్టెన్ గా, కేఎల్ రాహుల్ వైఎస్ కెప్టెన్ గా జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఇక తాజాగా త్వరలో న్యూజిలాండ్ తో జరుగనున్న టెస్ట్ సిరీస్ కోసం బీసీసీఐ జట్టును ప్రకటించింది. ఇందులో సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చింది. నిలకడగా రాణిస్తున్న పలువురు యువ ఆటగాళ్లకు సైతం షాకిచ్చింది. అజింక్యారహానేను కెప్టెన్ ను చేసింది. కోహ్లీ, రోహిత్, బుమ్రా, షమీ వంటి కీలక ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చింది. పూజారా వైస్ కెప్టెన్ గా ఎంపిక చేసింది. రెండో టెస్టుకు మాత్రం కోహ్లీ కెప్టెన్ గా అందుబాటులోకి వస్తాడని బీసీసీఐ ప్రకటించింది.

ప్రస్తుతం టీం కూర్పును బట్టి వన్డేలు, టీ20లకు కెప్టెన్ గా రోహిత్ శర్మ ఉండడం ఖాయం అనిపిస్తోంది. అదే సమయంలో టెస్టులకు మాత్రమే కోహ్లీని పరిమితం చేయనున్నారు.