Champions Trophy Australia Team : కీలకమైన ఆటగాళ్లకు గాయాలు కావడంతో ఆస్ట్రేలియా జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ కోసం కొత్త ప్లేయర్లను ప్రకటించింది. వాస్తవానికి ఈ మార్కుల కోసం ఐసిసి ఫిబ్రవరి 12 వరకు విధించింది.. ఈ నేపథ్యంలో టీమిండియా తో పాటు ఆస్ట్రేలియా కూడా అనేక మార్పులు చేసి జట్టును ఎంపిక చేసింది. గత వన్డే వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా జట్టు విజేతగా నిలిచింది. ఛాంపియన్స్ ట్రోఫీకి వచ్చేసరికి ఆ జట్టు పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఏకంగా ఐదుగురు ప్లేయర్లు తీవ్రంగా గాయపడ్డారు. ఫలితంగా వారి స్థానంలో కొత్త ఆటగాళ్లకు ఆస్ట్రేలియా మేనేజ్మెంట్ అవకాశం కల్పించింది. ఆస్ట్రేలియా జట్టుకు పూర్తిస్థాయి కెప్టెన్ గా కమిన్స్ కొనసాగుతున్నాడు. అతడు గాయపడిన నేపథ్యంలో స్టీవ్ స్మిత్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. పేస్ బౌలర్ హేజిల్ వుడ్, ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ కూడా గాయపడడంతో టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. మార్కస్ స్టోయినిస్ వన్డేలకు శాశ్వత వీడ్కోలు పలుకుతూ ఇటీవల ప్రకటించాడు. స్టార్క్ కూడా వ్యక్తిగత కారణాలవల్ల ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. మొత్తంగా ఐదుగురు కీలక ప్లేయర్లు ఆస్ట్రేలియా జట్టుకు షాకిచ్చారు. వారి స్థానంలో బెన్ డ్వారి షూస్, ఆరోన్ హార్డి, తన్వీర్ సంఘా, మాథ్యూ షార్ట్, స్పెన్సన్ జాన్సన్ కు అవకాశం కల్పించింది.
గత వన్డే వరల్డ్ కప్ ను ఆస్ట్రేలియా జట్టు గెలుచుకుంది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత జట్టుపై విజయం సాధించి.. ట్రోఫీ గెలుచుకుంది. అయితే అదే మ్యాజిక్ ను ఆస్ట్రేలియా జట్టు టి20 వరల్డ్ కప్ లో ప్రదర్శించలేకపోయింది. మరోవైపు కీలక ఆటగాళ్లు ఛాంపియన్స్ ట్రోఫీకి దూరం కావడంతో ఆస్ట్రేలియా జట్టు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. కీలక ఆటగాళ్లు దూరం కావడంతో మునుపటి స్థాయిలో ఆస్ట్రేలియా జట్టు ప్రదర్శన చేసే అవకాశం లేదని తెలుస్తోంది. ” ఆస్ట్రేలియా జట్టు ఆటగాళ్లు గాయాలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో ఆ జట్టు దాదాపు బలహీన పడింది. అయితే ఆస్ట్రేలియా జట్టు ఐసీసీ మెగా టోర్నీల సమయంలో బలంగా ఆడుతుంది. మరి ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీలో ఎలా ఆడుతుంది అనేది ఆసక్తికరంగా మారిందని” క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.
ఐసిసి చాంపియన్ ట్రోఫీకి ఆస్ట్రేలియా జట్టు ఇదే
స్టీవ్ స్మిత్ (కెప్టెన్), అలెక్స్ క్యారీ, సీన్ అబాట్, బెన్ డ్వారి షూస్, నాథన్ ఎల్లిస్, ఆరోన్ హార్డీ, జేక్ ఫ్రేజర్ మెక్ గుర్క్, జోష్ ఇంగ్లిస్, ట్రావిస్ హెడ్, మార్నస్ లబుషేన్, స్పెన్సన్ జాన్సన్, గ్లెన్ మాక్స్ వెల్, ఆడం జంపా, తన్వీర్ సంఘా, మాథ్యూ షార్ట్, ట్రావెల్ రిజర్వ్: కూపర్ కొన్నో ల్లీ.