Renu Desai
Renu Desai : సోషల్ మీడియా లో నిత్యం యాక్టీవ్ గా ఉండే సెలబ్రిటీస్ లో ఒకరు పవన్ కళ్యాణ్(Pawan Kalyan) మాజీ భార్య రేణు దేశాయ్(Renu Desai). ఈమె ఒకప్పుడు ట్విట్టర్ లో కూడా చాలా యాక్టీవ్ గా ఉండేది. కానీ ట్విట్టర్ లో ఉండే నెగటివిటీ ని తట్టుకోలేక, ఆమె తన అకౌంట్ ని తొలగించింది. ఇంస్టాగ్రామ్ లో మాత్రం రెగ్యులర్ గా యాక్టీవ్ గా ఉంటుంది. తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకోవడమే కాకుండా, సమాజంలో జరిగే కొన్ని ప్రత్యేకమైన అంశాలపై ఆమె తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉంటుంది. తనకు తప్పు ఏదైనా అనిపిస్తే కచ్చితంగా తప్పు అని కుండబద్దలు కొట్టినట్టు చెప్తుంది. అంతే కాకుండా సోషల్ మీడియా ద్వారా ఆమె ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేసింది. ముఖ్యంగా మూగ జీవాలపై ఆమె చూపించే ప్రేమ ఎనలేనిది అని చెప్పొచ్చు. ఒక ఫౌండేషన్ ని స్థాపించి, ఆ ఫౌండేషన్ ద్వారా ఆమె మూగజీవాలను తనకు తోచిన విధంగా సంరక్షిస్తూ ఉంటుంది.
ఇది ఇలా ఉండగా ఇప్పుడు సోషల్ మీడియా లో ఎక్కడ చూసిన రణవీర్ అలహాబాధియా(Ranaveer Alahabadiya) అనే పేరు మారుమోగిపోతుంది. సమయ్ రైనా(samay raina) అద్వర్యం లో ‘ఇండియాస్ గాట్ టాలెంట్|’ అనే ప్రోగ్రాం విజయవంతంగా నడుస్తుంది. ఈ ప్రోగ్రాం లో పాల్గొన్న రణవీర్ అత్యంత అసభ్యకరమైన, వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడు. దీనిపై ఆయన సోషల్ మీడియా లో తీవ్రమైన నెగటివిటీ ని ఎదురుకుంటున్నాడు. పలువురు సినీ ప్రముఖులు కూడా రణవీర్ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వారిలో రేణు దేశాయ్ కూడా ఒకరు. ఆమె తన ఇంస్టాగ్రామ్ లో రణవీర్ పై తీవ్రంగా విరుచుపడుతూ చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఇంత ఫైర్ తో రేణు దేశాయ్ మాట్లాడి చాలా కాలమే అయ్యింది.
ఆమె మాట్లాడుతూ ‘మీ పిల్లలను జాగ్రత్తగా, బాధ్యతాయుతంగా పెంచాలంటే రణవీర్ లాంటి దుర్మార్గపు ఆలోచన ఉన్న వాళ్లకు దూరం గా ఉంచండి. అలాంటోళ్లని అనుసరించడం వెంటనే మానుకోవాలి. యంగ్ జనరేషన్ మొత్తం కూడా ఎంతో బాధ్యతతో వ్యవహరించాలి. ఈమధ్య కాలం లో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరిట ఏదైనా మాట్లాడొచ్చు అనే క్రమంలో వల్గారిటీ ని యూత్ తమ కాన్సెప్ట్ గా మార్చేసుకుంది, ఇది చాలా తప్పు’ అంటూ ఆమె చెప్పుకొచ్చింది. ఇది ఇలా ఉండగా రేణు దేశాయ్ తనయుడు అకీరానందన్ నేడు పవన్ కళ్యాణ్ తో కలిసి ఆధ్యాత్మిక యాత్రకు బయలుదేరిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన నేడు కేరళలోని అగస్త్య మహర్షి ఆలయ సందర్శించగా, పవన్ కళ్యాణ్ తో ఉన్న అకీరానందన్(Akira Nandan) బాగా హై లైట్ అయ్యాడు. సోషల్ మీడియా లో ఇప్పుడు ఎక్కడ చూసిన ఆయన ఫొటోలే కనిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ని సైతం డామినేట్ చేసే కటౌట్ అకిరా సొంతమని అభిమానులు ఈ సందర్భంగా కామెంట్ చేస్తున్నారు.