Ravichandran Ashwin : చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్ట్ లో లోకల్ బాయ్ రవిచంద్రన్ అశ్విన్ అదరగొట్టాడు. తొలి ఇన్నింగ్స్ లో శతకం బాదాడు. రెండవ ఇన్నింగ్స్ లో ఆరు వికెట్లతో సత్తా చాటాడు. దీంతో బంగ్లాదేశ్ జట్టు కుదేలైపోయింది. ఈ క్రమంలో అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్ ash ki baath తన ఫిట్ నెస్ కు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ” అందరికంటే నేను అద్భుతమైన ఫిట్ నెస్ కలిగి ఉన్నానని” అశ్విన్ వ్యాఖ్యానించడం.. సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది.. ఇందులో కొన్ని మిశ్రమ స్పందనలు కూడా వచ్చాయి. అయితే ఆ స్పందనలపై రవిచంద్రన్ అశ్విన్ తన మార్క్ విశ్లేషణ చేశాడు. ఇదే క్రమంలో కొంతమంది నెటిజన్లు బుమ్రా పై విమర్శలు చేసిన నేపథ్యంలో అశ్విన్ చురకలు అంటించాడు. బుమ్రా భారత జట్టుకు లభించిన అద్భుతమైన బౌలర్ అని.. అతడు రత్న కిరీటం లాంటివాడని ప్రశంసలు కురిపించాడు.. భారత జట్టుకు కీలక సమయంలో వజ్రాయుధం లాగా మారి, కష్టాల నుంచి బుమ్రా గట్టెకిస్తాడని అశ్విన్ వ్యాఖ్యానించాడు.. బుమ్రా అత్యంత ఖచ్చితత్వంతో బంతులు వేస్తాడని వివరించాడు.
145 కిలోమీటర్ల వేగంతో..
బుమ్రా 145 కిలోమీటర్ల వేగంతో బంతులు వేస్తాడని అశ్విన్ వ్యాఖ్యానించాడు. బుమ్రా భారత జట్టుకు లభించిన కోహినూరు వజ్రం లాంటి వాడని పేర్కొన్నాడు.. కపిల్ దేవ్ తర్వాత ఆ స్థాయిలో సత్తా చాటిన బౌలర్ బుమ్రా అని అశ్విన్ కొనియాడాడు. తాను ఇతర క్రికెటర్లను తక్కువ అంచనా వేయడం లేదని అశ్విన్ పేర్కొన్నాడు. అయితే తరచూ గాయాల పాలయ్యే బుమ్రా గొప్ప ఫిట్ నెస్ కలిగిన క్రికెటర్ ఎలా అవుతాడని.. కొంతమంది నెటిజన్లు అశ్విన్ ను ఉద్దేశించి ప్రశ్నించారు. దీనికి అశ్విన్ తనదైన శైలిలో సమాధానం చెప్పాడు. ” ఉదాహరణకు ఒక లారీ, మెర్సడేజ్ బెంజ్ వాహనాలు ఉన్నాయి. బెంజ్ ను అత్యంత జాగ్రత్తగా నడుపుతాం. లారీని మాత్రం అలా నెమ్మదిగా నడపడానికి అవకాశం లేదు. పైగా లారీ దేశం మొత్తం తిరుగుతుంది. సరుకులు రవాణా చేస్తుంది. పేస్ బౌలర్ కూడా లారీలాంటివాడు.. ఒక్కోసారి లారీ బ్రేక్ డౌన్ అవుతుంది. ఆ తర్వాత మరమ్మతులు చేయించుకొని తన పని తాను చేస్తుంది. బుమ్రా కూడా గాయాల నుంచి కోరుకుని 145 కిలోమీటర్ల వేగంతో బంతులు వేస్తున్నాడు. కాబట్టి అతడి ఫిట్ నెస్ గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని” అశ్విన్ సూచించాడు. అలాంటి వ్యాఖ్యలు బాధపెడతాయని పేర్కొన్నాడు .. మరోవైపు ఇదే ప్రశ్నను ఓ విలేఖరి బుమ్రా ను అడిగితే.. మరో మాటకు తావు లేకుండా తన పేరు చెప్పాడు బుమ్రా. పైగా తాను దేశం కోసం క్లిష్ట పరిస్థితుల్లో రాణిస్తున్నానని.. తాను ఫిట్ గా ఉంటేనే ఆ స్థాయిలో బౌలింగ్ చేస్తున్నానని పేర్కొన్నాడు.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Bumrah is an excellent bowler and comments about his fitness hurt ashwin
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com