Border Gavaskar Trophy: ఇండోర్ వేదికగా మొదలైన మూడో టెస్ట్ లో టీమిండియా 109 పరుగులకే కుప్పకూలింది. టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకున్నప్పటికీ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు.. రోహిత్ శర్మ 12 పరుగులు చేసి స్టంట్ అవుట్ అయ్యాడు. గిల్ 21 పరుగులు చేసి క్యాచ్ అవుట్ గా వెనుతిరిగాడు.. ఇక పూజార నాలుగు బంతులు ఎదుర్కొని లయాన్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.. ఈ క్రమంలో తన పేరిట ఒక చెత్త రికార్డును లిఖించుకున్నాడు.

ఒక బౌలర్ చేతిలో అత్యధిక సార్లు అవుట్ అయిన బ్యాట్స్మెన్ జాబితాలో చేరిపోయాడు.. లయాన్ పూజారాను అవుట్ చేయడం ఇది 12వసారి. ఇంగ్లాండ్ బౌలర్ జేమ్స్ అండర్సన్ కూడా పూజరాను 12సార్లు అవుట్ చేశాడు. ఇంతకుముందు సునీల్ గవాస్కర్ ఆస్ట్రేలియా బౌలర్ అండర్ ఉడ్ చేతిలో 12 సార్లు అవుట్ అయ్యాడు. టీమిండియా తరఫున సునీల్ గవాస్కర్ తర్వాత ఒక బౌలర్ చేతిలో అత్యధిక సార్లు అవుట్ అయిన రెండో క్రికెటర్ గా పూజార నిలిచాడు.
గల్లి స్థాయి క్రికెట్ ఆడుతున్నావా
ఇక ఈ టోర్నీలో పూజార చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. అతని వ్యక్తిగత స్కోర్ ఇప్పటివరకు 25 పరుగులకు మించలేదు. చివరకు తన వందో టెస్ట్ లో కూడా ఆశించినంత మేర ప్రతిభ చూపలేదు.. ఈ క్రమంలో పూజరా పై మీమ్స్ చెలరేగుతున్నాయి. ” పుజారా ఇవాళ అతి గొప్ప చెత్త రికార్డు లిఖించుకున్నాడు.. నువ్వు ఇలాగే ఆడితే మునుముందు మరిన్ని రికార్డులు నీ పాదాక్రాంతమవుతాయని” నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు.