IND VS NZ : రవీంద్ర జడేజా మ్యాజికల్ డెలివరీ.. నివ్వెర పోయిన బ్లండెల్.. వైరల్ వీడియో

పూణే వేదికగా జరుగుతున్న న్యూజిలాండ్ - భారత జట్ల మధ్య రెండో టెస్టు ఆసక్తికరంగా మారింది. బెంగళూరు టెస్టులో ఓడిపోయిన టీమ్ ఇండియా.. పూణే వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో విజయం సాధించాలని భావిస్తోంది.

Written By: Anabothula Bhaskar, Updated On : October 26, 2024 1:53 pm

IND VS NZ

Follow us on

IND VS NZ : తొలి ఇన్నింగ్స్ లో 259 పరుగులు చేసిన న్యూజిలాండ్.. రెండవ ఇన్నింగ్స్ లో 255 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్ ఎదుట భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఆ తర్వాత రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టు దూకుడుగా ఆడుతోంది. కెప్టెన్ రోహిత్ శర్మ ఆరు పరుగులకే అవుట్ అయినప్పటికీ.. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. గిల్ దూకుడుగా ఆడే క్రమంలో 23 పరుగులకు అవుట్ అయ్యాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ (13) – యశస్వి జైస్వాల్ ఆడుతున్నారు. అయితే న్యూజిలాండ్ ఇన్నింగ్స్ సమయంలో మైదానంలో అద్భుతం చోటుచేసుకుంది. భారత బౌలర్ రవీంద్ర జడేజా అద్భుతమైన బంతి వేసి న్యూజిలాండ్ ఆటగాడు టామ్ బ్లండెల్(41) ను క్లీన్ బౌల్డ్ చేశాడు. వాస్తవానికి మూడో రోజు ఆట ప్రారంభమైన నాటి నుంచి బ్లండెల్ భారత బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టాడు. దీంతో రవీంద్ర జడేజా అద్భుతమైన బంతివేసి పే విలియం చేర్చాడు. జడేజా విసిరిన ఆ బంతి నేరుగా బ్లండెల్ వికెట్లను పడగొట్టింది. మ్యాచ్ 60 ఓవర్ లో ఈ ఘటన జరిగింది. ఈ ఓవర్లో మూడో బంతిని రవీంద్ర జడేజా రౌండ్ ది వికెట్ వేశాడు. దానిని బ్లండెల్ డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ ఆ బంతి మిస్ అయింది. బ్యాట్, ప్యాడ్ గ్యాప్ నుంచి దూసుకెళ్లి మిడిల్ స్టంప్ ను గిరాటేసింది.

ఈ మ్యాచ్ లో జడేజా పడగొట్టిన తొలి వికెట్ ఇదే కావడం విశేషం. శనివారం 198/5 తో మూడోరోజు టీం ఇండియా ఆట మొదలుపెట్టింది. మరో 57 పరుగులు ఇచ్చి మిగతా ఐదు వికెట్లను టీమిండియా పడగొట్టింది. లాతం (86) హాఫ్ సెంచరీ తో ఆకట్టుకున్నాడు. బ్లండెల్ 41, ఫిలిప్స్ 48* రన్స్ చేసి ఆకట్టుకున్నారు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. రవిచంద్రన్ అశ్విన్ రెండు వికెట్లు తీశాడు. రవీంద్ర జడేజా మూడు వికెట్లు సొంతం చేసుకున్నాడు. మొత్తంగా భారత్ ఎదుట 359 పరుగుల విజయ లక్ష్యాన్ని న్యూజిలాండ్ ఉంచింది. అయితే ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో టీమిండియా దూకుడుగా ఆడుతోంది. ఇప్పటికే రెండు వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ నిరాశపరిచినప్పటికీ.. యశస్విజైస్వాల్, గిల్ దూకుడుగా ఆడారు.. రెండవ వికెట్ కు 62 పరుగులు జోడించారు. తొలి వికెట్ కు జైస్వాల్, రోహిత్ శర్మ 34 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.. ఇక విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్ మూడో వికెట్ కు ఇప్పటివరకు 31 పరుగుల భాగస్వామ్యాన్ని నిర్మించారు.