USA Cricketer : భార్య కోసం అమెరికా వెళ్తే హేళన చేశారు.. సీన్ కట్ చేస్తే USA క్రికెట్ టీం హీరో అయ్యాడు..

USA Cricketer : ఇదే సమయంలో న్యూజిలాండ్ జట్టు లీగ్ దశలోనే ఇంటి బాట పట్టింది. బలహీనమైన ఆఫ్ఘనిస్తాన్ జట్టు చేతిలో దారుణమైన ఓటమిని చవిచూసింది.

Written By: NARESH, Updated On : June 18, 2024 10:18 pm

USA Cricketer Corey Anderson

Follow us on

USA Cricketer : అతడు పుట్టింది క్రైస్ట్ చర్చ్ లో.. అది న్యూజిలాండ్ లోని ఓ ప్రాంతం.. అతడు కూడా న్యూజిలాండ్ జాతీయ క్రికెట్ జట్టులో ఒక సభ్యుడు. బౌలింగ్ బాగా వేస్తాడు. బ్యాటింగ్ అద్భుతంగా చేస్తాడు. ఇలా ఓసారి ఓ అమెరికా దేశస్థురాలు అతనికి పరిచయమైంది. చాలాకాలం డేటింగ్ చేసిన తర్వాత.. ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. అయితే అతడు భార్య కోసం అమెరికా వెళ్లాల్సి వచ్చింది. అక్కడే స్థిర పడాల్సి వచ్చింది. ఇది కొంతమందికి నవ్వు తెప్పించింది. ఇంకేముంది అతడిని హేళన చేయడం మొదలుపెట్టారు. దీంతో అతడు చాలా రోజులు బాధపడ్డాడు. అతడికి క్రికెట్ తప్ప మరో వ్యాపకం లేదు. అందువల్లే అమెరికా జాతీయ జట్టుకు ఎంపిక అయ్యాడు. నవ్వినా నాప చేనే పండుతుంది అనే సామెతను రుజువు చేశాడు. అంతేకాదు అమెరికా జట్టును సూపర్ -8 లో చేర్చాడు. ఇంతకీ ఆ ఆటగాడు ఎవరంటే..

కోరి అండర్సన్.. న్యూజిలాండ్ జాతీయ జట్టు తరఫున గతంలో ఆడాడు. 13 టెస్ట్ మ్యాచులు, 49 వన్డేలు, 31 t20 లలో పాలుపంచుకున్నాడు. అటు బ్యాటింగ్, బౌలింగ్ లో సత్తా చాటినప్పటికీ ఎక్కువ కాలం జట్టులో కొనసాగలేకపోయాడు. మంచి వయసులో ఉండగానే క్రికెట్ కు గుడ్ బై చెప్పేశాడు. 2018లో న్యూజిలాండ్ జట్టు తరఫున చివరి మ్యాచ్ ఆడాడు. అతడి భార్య మేరీ శాంబార్గర్ కోసమే అండర్సన్ ఈ నిర్ణయం తీసుకున్నాడని క్రికెట్ వర్గాల్లో అప్పట్లో చర్చ జరిగింది.

భార్య కోసం ఏకంగా దేశమే మారిపోయాడు ఈ స్టార్ ఆల్ రౌండర్. టెక్సాస్ లో వివాహం చేసుకున్న అనంతరం.. అతడు తన మకాం అమెరికాకు మార్చాడు. అమెరికా జాతీయ క్రికెట్ జట్టులో చేరాడు. దీంతో చాలామంది అతడిని చూసి నవ్వుకున్నారు. పిచ్చోడిలా ఉన్నాడంటూ ఎగతాళి చేశారు. టాప్ -5 జట్టును వదిలివేసి, పసికూనతో ఆడుతున్నాడు అంటూ ఎగతాళి చేశారు. కానీ ఇప్పుడు అతడు తిరుగులేని స్టార్ గా అవతరించాడు. తన భార్య సొంత దేశం తరఫున ఆడుతున్న అతడు.. తిరుగులేని ఫామ్ కనబరిచాడు. టి20 వరల్డ్ కప్ లో ఏమాత్రం ఆశలు, అంచనాలు లేని అమెరికా జట్టును సూపర్ -8 కు చేర్చడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఇదే సమయంలో న్యూజిలాండ్ జట్టు లీగ్ దశలోనే ఇంటి బాట పట్టింది. బలహీనమైన ఆఫ్ఘనిస్తాన్ జట్టు చేతిలో దారుణమైన ఓటమిని చవిచూసింది.