https://oktelugu.com/

OTT Release : ఈ వారం ఓటీటీలో టాప్ 3 చిత్రాలు ఇవే… ఎక్కడ చూడొచ్చు?

OTT Release ఈ సినిమా ఓటీటీలో తెలుగులోనే అందుబాటులోకి రాబోతుంది. ఇక భాష పరంగా కూడా ఇబ్బంది ఉండదు. హ్యాపీగా సినిమా చూసేయొచ్చు. జూన్ 21 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి సిద్ధం అవుతుంది.

Written By:
  • NARESH
  • , Updated On : June 18, 2024 / 10:23 PM IST

    Kota-Factory-Season-3

    Follow us on

    OTT Release : ఓటీటీలో సినిమాలకు అంతకంతకూ క్రేజ్ పెరుగుతుంది. సినీ లవర్స్ ప్రతి వారం ఓటీటీలో విడుదలయ్యే కొత్త సినిమాల కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ వారం కూడా చాలా సినిమాలు, వెబ్ సిరీస్ రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. వాటిలో బాగా చూడదగ్గ సినిమాలు కొన్ని ఉన్నాయి. అందులో ఈ మూడు సినిమాలు చాలా ప్రత్యేకం. ఆ మూవీ ఏంటి. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం.

    కోటా ఫ్యాక్టరీ సీజన్ 3 – ఈ సిరీస్ లో ప్రధానంగా ఎంతో మంది స్టూడెంట్స్ అనుభవిస్తున్న మానసిక ఆందోళన, వారు అనుభవిస్తున్న ఒత్తిడిని కళ్ళకు కట్టినట్టు మేకర్స్ చూపించారు. సీజన్ 1,2 చాలా సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు తాజాగా సీజన్ 3 ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈసారి ఏ విధంగా ఆడియన్స్ ని మెప్పించనుందో చూడాలి. కోటా ఫ్యాక్టరీ సీజన్ 3 జూన్ 20 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

    bak

    బాక్ – ఇది హారర్ కామెడీ జోనర్ లో తెరకెక్కిన థ్రిల్లర్ మూవీ. అరణ్మణై సిరీస్ లో భాగంగా వచ్చినదే ఈ అరణ్మణై 4. దీనిని తెలుగులో బాక్ పేరుతో డబ్ చేశారు. మిల్కీ బ్యూటీ తమన్నా, రాశి ఖన్నా హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటిటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకుంది. ఇక జూన్ 21 నుంచి హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.

    నడికర్ తిలకం – తమిళ భాషలో వచ్చిన కామెడీ జోనర్ మూవీ నడిగర్ తిలకం. ఆ మధ్య కాలంలో బెస్ట్ కామెడీ మూవీ వచ్చిన దాఖలు లేవు. హాస్య ప్రియులకు బెస్ట్ ఛాయిస్. కాసేపు సరదాగా నవ్వుకోవచ్చు. మరో ఆసక్తికర అంశం ఏంటంటే ఈ సినిమా ఓటీటీలో తెలుగులోనే అందుబాటులోకి రాబోతుంది. ఇక భాష పరంగా కూడా ఇబ్బంది ఉండదు. హ్యాపీగా సినిమా చూసేయొచ్చు. జూన్ 21 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి సిద్ధం అవుతుంది.