Viral Celebrity : కొందరు వ్యక్తులు సెలబ్రెటీలు అయ్యాక స్పోర్ట్స్ పర్సన్స్ ను పెళ్లి చేసుకుంటారు. కానీ కొందరు వారిని పెళ్లి చేసుకున్న తర్వాత సెలబ్రెటీలు అవుతారు. ఎవరి లైఫ్ ఎప్పుడు ఎలా టర్న్ అవుతుందో చెప్పడం కష్టమే. అయితే ఇలాంటి వారిలో ధనశ్రీ ఒకరు. తాజాగా ఈమె గురించి తెగ సెర్చ్ చేస్తున్నారు నెటిజన్లు. ఈమె 1996 సెప్టెంబర్ 27న యూఏఈలోని దుబాయిలో జన్మించింది. అయితే ఈమె డెంటిస్ట్ గా పని చేసింది.
2014లో ముంబైలోని డీవై పాటిల్ కాలేజీలో డెంటిస్ట్రీ చదివింది. ధనశ్రీ వర్మకు డాన్స్ అంటే చాలా ఇష్టం. యూట్యూబ్ లో ఓ ఛానెల్ ను క్రియేట్ చేసి తరచుగా తన డ్యాన్స్ వీడియోలను అప్లోడ్ చేయడం ఆమెకు అలవాటు. ఇలా డ్యాన్స్ తోనే సోషల్ మీడియాలో చాలా పాపులర్ అయింది. భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించింది ధనశ్రీ. ఈమెకు ప్రస్తుతం యూట్యూబ్ లో 2.5 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇక యూట్యూబ్ ఛానెల్, ఇతర సోషల్ మీడియా అకౌంట్లు, బ్రాండ్ ఎండార్స్మెంట్స్, కొరియోగ్రపీ వంటి మార్గాల ద్వారా ధనశ్రీ వర్మ బాగా సంపాదిస్తోంది.
ధనశ్రీ నెట్ వర్త్ రూ. 3 మిలియన్ డాలర్లు. మన కరెన్సీలో దాదాపు రూ. 24 కోట్లు ఉంటుంది. ఈమెకు డ్యాన్స్ కారణంగా యుజ్వేంద్ర చాహల్ పరిచయం అయ్యారు. ఈమె దగ్గర ఆయన డ్యాన్స్ నేర్చుకున్నాడు. అలా ఇద్దరి మధ్య స్నేహం కుదిరింది. ఆ స్నేహం ప్రేమగా మారింది. ఇలా ఇద్దరు 2020లో పెళ్లి చేసుకొని ఒకటయ్యారు. ఇక సోషల్ మీడియాలో భర్తతో కలిసి ఉన్న వీడియాలో, ఫోటోలు షేర్ చేసుకునేది. కానీ గతేడాది ఆయన ఇంటిపేరును తొలగించింది. దీంతో చాహల్ ధనశ్రీ విడాకులు తీసుకుంటున్నారన్న రూమర్స్ వచ్చాయి.
టీమిండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తో సన్నిహితంగా ఉండడమే ఇందుకు కారణం అని ట్రోల్ చేశారు నెటిజన్లు. ఇక ఈ విషయంపై ధనశ్రీ స్పందిస్తూ.. మేం కలిసి ఆనందంగా ఉన్నాం అని తెలపడంతో విడాకుల రూమర్స్ కు పులిస్టాప్ పడింది. అయితే తాజాగా మరోసారి ఆమె పోస్ట్ చేసిన ఫోటో ట్రోల్స్ కు గురిచేస్తుంది. ఝలక్ దిఖ్లాజా అనే టీవీ షోలో పాల్గొన్న కొరియోగ్రాఫర్ ప్రతీక్ ఉటేకర్ తో సన్నిహితంగా దిగిన ఫోటో ఒకటి బయటకు వచ్చింది. ప్రతీక్ స్వయంగా ఈ ఫోటోను తన ఇన్ స్టాలో షేర్ చేశారు. దీంతో నెటిజన్లు మరోసారి విమర్శలు గుప్పిస్తున్నారు. మరి చూడాలి దీనిపై ధనశ్రీ ఎలా స్పందిస్తుందో..