Biggest Blast Breaking : పాకిస్తాన్ దేశంతో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో బీసీసీఐ పాలకమండలి శుక్రవారం అత్యవసరంగా భేటీ కానుంది. బీసీసీఐ పాలకమండలి అత్యవసరంగా భేటీ కావడం ఒక్కసారిగా చర్చకు దారితీస్తోంది.. ఇక గురువారం నాటి పంజాబ్ – ఢిల్లీ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ ఉద్రిక్తత వాతావరణం వల్ల రద్దయింది. దీంతో రెండు జట్లకు ఒక్కో పాయింట్ చొప్పున కేటాయించారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో ఐపీఎల్ ను కొద్దిరోజుల వరకు వాయిదా వేసే అవకాశం కనిపిస్తోంది. దాయాది దేశం మన దేశంలోని జన సమ్మర్థ ప్రాంతాలను.. విమానాశ్రయాలను టార్గెట్ గా చేసుకుంది. అయితే మ్యాచ్లు జరుగుతున్న ప్రాంతాలలో ఎక్కువగా పాకిస్తాన్ కు సరిహద్దులో ఉన్నాయి. ఇప్పటికే దాయాది దేశం సరిహద్దుల వెంట విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడుతోంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని కూడా పక్కనపెట్టి.. ఇష్టానుసారంగా ప్రవర్తిస్తోంది. ఒకరకంగా ఉగ్రవాద స్థావరాలను భారత్ నేలమట్టం చేస్తే.. పాకిస్తాన్ మాత్రం తమ సైనికులను, పౌరులను మట్టుపెట్టారని ఆరోపిస్తోంది. వాస్తవానికి భారత్ టార్గెట్ చేసింది కేవలం ఉగ్రవాద స్థావరాలను మాత్రమే. దీనికి సంబంధించిన ఆధారాలను భారత త్రివిధ దళాలు బయటపెట్టాయి. అయినప్పటికీ పాకిస్తాన్ బుకాయించుకుంటూ.. తమ దేశంలో అకారణంగా దాడులు చేశారని ఆరోపించడం విశేషం.
Also Read: సచిన్ కూతురు డేటింగ్ చేస్తోంది గిల్ తో కాదా? హమ్మయ్యా ఇన్నాళ్లకు క్లారిటీ!
జన సమ్మర్థ ప్రాంతాలలో పాకిస్తాన్ దాడులకు పాల్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో.. ముందస్తు జాగ్రత్త చర్యగా ఐపీఎల్ ను కొద్దిరోజుల వరకు వాయిదా వేయడానికి బీసీసీఐ పెద్దలు ముందుకు వస్తారని తెలుస్తోంది.. ఇప్పటికే ధర్మశాల మైదానంలో మ్యాచ్ రద్దు అయిన నేపథ్యంలో.. అభిమానులు వెంటనే మైదానాన్ని వదిలిపెట్టి వెళ్లిపోవాలని సాక్షాత్తు బీసీసీఐ పెద్దలు మైక్ లో అనౌన్స్ చేయడం విశేషం. ఒకరకంగా పరిస్థితి అత్యంత క్రిటికల్ గా ఉన్న నేపథ్యంలో.. ఇలాంటి పరిస్థితిలో ఐపీఎల్ నిర్వహించడం సాధ్యం కాదనే అభిప్రాయానికి నిర్వాహకులు వచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు ఆటగాళ్లకు భద్రత కల్పించడం.. ఒకవేళ ఏదైనా ప్రమాదాలు చోటు చేసుకుంటే.. వాటి బారి నుంచి ప్లేయర్లను రెస్క్యూ చేయడం అంత సులభమైన విషయం కాదు కాబట్టి.. ఎందుకైనా మంచిదనే బీసీసీఐ ఐపీఎల్ ను తాత్కాలికంగా వాయిదా వేసే అవకాశాలున్నాయి. ఒకవేళ వాయిదా పడిన ఐపీఎల్ ను పరిస్థితులు చక్కబడిన తర్వాత నిర్వహిస్తారని తెలుస్తోంది. అయితే దీనిపై బీసీసీఐ అధికారికంగా ప్రకటన చేయాల్సిన అవసరం ఉంది. జాతీయ మీడియాలో మాత్రం ఐపీఎల్ తాత్కాలికంగా వాయిదా పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎందుకంటే ఒకవేళ భారత్ పాకిస్తాన్ మధ్య అనధికారికంగా వార్ గనుక మొదలైతే అప్పుడు పరిస్థితి మరింత దారుణంగా మారుతుంది. అందువల్ల ముందస్తు జాగ్రత్తగానే ఐపిఎల్ ను తాత్కాలికంగా వాయిదా వేయడానికి నిర్వాహకులు ఒక నిర్ణయానికి వచ్చినట్టు జాతీయ మీడియాలో ప్రచారం జరుగుతున్నది.
Also Read: రోహిత్ 7, రికెల్టన్ 2.. ముంబైకి ఏ మంత్రవేశావయ్య గిల్..