Ration card : ఏపీ ప్రభుత్వం( AP government) బియ్యం కార్డుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా రేషన్ కార్డులకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. అందులో భాగంగా ఈ నెల 15 నుంచి వాట్సాప్ ద్వారా కూడా రేషన్ కార్డుల దరఖాస్తు ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించారు. ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ విధానం ప్రారంభించిన సంగతి తెలిసిందే. విద్యార్థులకు సంబంధించి హాల్ టికెట్లు కూడా వాట్సాప్ ద్వారా అందించారు. ఇప్పుడు రేషన్ కార్డుల దరఖాస్తు ప్రక్రియ సైతం వాట్సాప్ ద్వారా చేపట్టాలని నిర్ణయించారు. ఇది నిజంగా ప్రజలకు గుడ్ న్యూస్. మరింత సులభతరంగా కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభం కానుందన్నమాట.
Also Read : యువతకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్..రేషన్ కార్డు ఉంటే చాలు 18 ఏళ్ళు దాటిన వారికి రూ.10 లక్షలు లోన్…
* వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా..
ముఖ్యంగా ఈ విషయంలో సీఎం చంద్రబాబు ( CM Chandrababu) ప్రత్యేకంగా చొరవ చూపారు. బియ్యం కార్డులకు సంబంధించి కీలక ఆదేశాలు ఇచ్చారు. కొన్ని రకాల సూచనలు కూడా చేశారు. వాట్సాప్ గవర్నెన్స్ లో భాగంగా ఈనెల 15 నుంచి బియ్యం కార్డుల సేవలను అందించాలని చెప్పారు. రైస్ కార్డులో పేర్లు ఉండి.. GSS WWS సమాచార నిధులు కనిపించని 79 వేల 173 మంది వివరాలను సరిచేయాలని ఆదేశించారు. సచివాలయంలో పౌరసరఫరాల శాఖపై సమీక్ష చేశారు సీఎం చంద్రబాబు. రేషన్ బియ్యం రీసైక్లింగ్ జరగకుండా చూడాలని స్పష్టం చేశారు. రేషన్ సరుకుల పంపిణీలు ఎలాంటి లోటుపాట్లు జరగకూడదు అన్నారు. మరోవైపు కొత్త రేషన్ కార్డుల దరఖాస్తు ప్రక్రియపై ఆరా తీశారు సీఎం చంద్రబాబు.
* ప్రజల నుంచి విశేష స్పందన..
రేషన్ కార్డులకు( ration cards ) సంబంధించి ఈనెల 7న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. దీనికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందని అధికారులు సీఎం చంద్రబాబుకు తెలిపారు. కొత్త కార్డులతో పాటు విభజన, చేర్పులు, తొలగింపులు వంటి ఏడు రకాల సేవలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. గత ఖరీఫ్ లో 35.94 లక్షల టన్నులు, రబీలో 14.28 లక్షల టన్నుల ధాన్యం సేకరించి డబ్బులు జమ చేసినట్లు అధికారులు వివరించారు. అయితే రేషన్ బియ్యం రీసైక్లింగ్ జరగకుండా కట్టడి చేయాలని అధికారులను ఆదేశించారు చంద్రబాబు. దీపం 2 కింద ఉచిత సిలిండర్లను కూడా పంపిణీ చేయాలని చెప్పారు. ప్రజలకు సేవలు సక్రమంగా అందాలన్నారు.
Also Read : రేషన్ కార్డుదారులకు అలర్ట్.. ఏప్రిల్ 30 చివరి తేదీ..
* చేర్పులు,మార్పులకు అవకాశం..
రాష్ట్రవ్యాప్తంగా రేషన్ కార్డుల దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నెలాఖరు వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. జూన్ లో క్యూఆర్ కోడ్ తో కూడిన స్మార్ట్ కార్డులు( Smart cards) ఇస్తారు. క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేస్తే ఆరు నెలల రేషన్ వివరాలు తెలుసుకోవచ్చు. రేషన్ కార్డు ఉన్నవాళ్లు ఈ కేవైసీ చేసుకుంటే మళ్ళీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. కొత్త రేషన్ కార్డు పొందాలన్నా, పేరు మార్చుకోవాలన్న హౌస్ హోల్డ్ మ్యాపింగ్ తప్పనిసరి అని ప్రభుత్వం స్పష్టం చేసింది. రేషన్ కార్డులు కొత్తగా కుటుంబ సభ్యుల పేర్లను కూడా చేర్చవచ్చు. కోర్టు వద్దనుకుంటే తొలగించడానికి దరఖాస్తు చేసుకోవచ్చు. కుటుంబ విభజనలో భాగంగా కొత్త కార్డు ఇస్తారు. చిరునామా కూడా మార్చుకోవచ్చు. తప్పులు ఉంటే సరి చేసుకోవచ్చు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలకు రేషన్ కార్డ్ లేకపోతే కొత్త కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు.