GT Vs MI IPL 2025: వరుసగా ఆరు విజయాలు సాధించి తిరుగులేని స్థాయిలో నిలబడింది. ఈ సీజన్ ప్రారంభంలో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లతో జరిగిన మ్యాచ్లలో ముంబై ఓడిపోయింది. ఇక ఆ తర్వాత తన అసలు ప్రతాపాన్ని చూపించడం మొదలుపెట్టింది. కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు పై గెలిచినప్పటికీ..లక్నో, బెంగళూరు చేతిలో ఓడిపోయింది. ఇక తర్వాత తన బౌన్స్ బ్యాక్ విధానాన్ని చూపించడం ప్రారంభించింది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో మొదలైన ముంబై వీరవిహారం రాజస్థాన్ రాయల్స్ వరకు సాగింది. వరుసగా 6 మ్యాచ్లలో విజయం సాధించి.. పాయింట్లు పట్టికలో ఏకంగా మూడవ స్థానంలో కూర్చుంది.. ప్రస్తుతం ముంబై జట్టు ఖాతాలో 14 పాయింట్లు ఉన్నాయి.. ఒకరకంగా చెప్పాలంటే ముంబై జట్టు ప్లే ఆఫ్ కు దగ్గరగా ఉన్నట్టే. ఈ క్రమంలో మంగళవారం గుజరాత్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్ హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగింది. సొంత మైదానంలో ఆడుతున్నప్పటికీ.. ముంబై టాస్ ఓడిపోయింది. దీంతో ఫస్ట్ బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది.
Also Read: ఆర్మీకి పూర్తిస్థాయిలో స్వేచ్ఛ.. నేడు స్వయంగా వీక్షణ: ఆపరేషన్ సింధూర్ లో మోడీ మార్క్!
కీలు ఎరిగి వాత..
సహజంగా మన పెద్దవాళ్లు కీలు ఎరిగి వాతపెట్టాలి అంటారు కదా.. అదే సూత్రాన్ని గుజరాత్ కెప్టెన్ గిల్ ముంబై జట్టు మీద ప్రయోగించాడు.. ఈ సీజన్లో భీకరమైన ఫామ్ లో ఉన్న ముంబై ఓపెనర్లు రోహిత్ శర్మ, రికెల్టన్ ను సిరాజ్, అర్షద్ ఖాన్ ను ప్రయోగించి పెవీలియన్ పంపించాడు. ఒకరకంగా ఇది ముంబై ఇండియన్స్ జట్టుకు భీకరమైన షాక్. 26 పరుగులకు ఇద్దరు ఓపెనర్లను కోల్పోయి ముంబై జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో వచ్చిన సూర్య కుమార్ యాదవ్ (35), విల్ జాక్స్(53) దూకుడుగా ఆడి మూడో వికెట్ కు 71 పరుగులు జోడించారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని సాయి కిషోర్ విడదీశాడు. సాయి కిషోర్ బౌలింగ్లో సూర్య కుమార్ యాదవ్ అనవసరమైన షాట్ కు ప్రయత్నించి అవుట్ అయ్యాడు. తర్వాత విల్ జాక్స్ కూడా అవుట్ అయ్యాడు. ఈ దశలో వచ్చిన హార్దిక్ పాండ్యా (1), తిలక్ వర్మ (7), నమన్ దార్(7) స్వల్ప పరుగులకే అవుట్ కావడంతో ముంబై జట్టు పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ముంబై బ్యాటర్ల లొసుగును గుర్తించిన గిల్.. పదేపదే బౌలర్లను మార్చి ప్రయోగించడంతో ముంబై జట్టు కోలుకోలేకపోయింది. ఈ సీజన్లో సొంతమైదానంలో కేవలం 155 పరుగుల వద్ద ఆగిపోయింది. 20 ఓవర్లు పూర్తిస్థాయిలో ఆడినప్పటికీ.. ముంబై జట్టు 8 వికెట్లు కోల్పోయి ఈ మాత్రం స్కోర్ చేసింది. ఇక చివర్లో కార్బిన్ బాష్(27) కాస్త సత్తా చూపించడంతో ముంబై జట్టు ఆమాత్రం స్కోరైనా చేయగలిగింది. ఇక గుజరాత్ జట్టు బౌలర్లలో సాయి కిషోర్ రెండు వికెట్లు సాధించాడు. సిరాజ్, రషీద్, అర్షద్, ప్రసిద్ద్, గేరాల్డ్ కోయేట్జీ తలా ఒక వికెట్ పడగొట్టారు. ఇక అనంతరం గుజరాత్ జట్టు బ్యాటింగ్ ప్రారంభించింది. భీకరమైన ఫామ్ లో ఉన్న సాయి సుదర్శన్(5) సింగిల్ డిజిట్ స్కోర్ కే బౌల్ట్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఇక ప్రస్తుతం మరో ఓపెనర్ గిల్(11), బట్లర్ (9) ఆడుతున్నారు.