https://oktelugu.com/

Jabardasth Emmanuel: ఆ జబర్ధస్త్ కమెడియన్ చనిపోయాడా.. అసలు నిజం వెలుగులోకి

బాబు డైరెక్షన్ లో తెరకెక్కిన ప్రేమ వాలంటీర్ అనే వెబ్ సిరీస్ లో నటించారు ఈ కమెడియన్. అయితే ఈ సిరీస్ క్లైమాక్స్ లో ఈయన పాత్ర చనిపోయినట్టుగా కనిపిస్తుంది. కొన్ని ఊరుపేరు లేని యూట్యూబ్ ఛానెల్లు మాత్రం ఇమ్మాన్యూయేల్ చనిపోయారు అంటూ థంబ్ నైల్ పెట్టి ప్రచారం చేశారు.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : November 4, 2023 / 12:24 PM IST

    Jabardasth Emmanuel

    Follow us on

    Jabardasth Emmanuel: జబర్దస్త్ ద్వారా పేరు సంపాదించి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన వారు ఎందరో ఉన్నారు. వారి పంచులు, కామెడీ, టైమింగ్ అన్నీ కూడా నచ్చి జనాలు ఆదరించారు. అదే విధంగా కమెడియన్ ఇమ్మాన్యుయేల్ ను కూడా సెలబ్రెటీని చేశారు. ఈయన టాలెంట్ తో పైకి వచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించారు. ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న ఈ కమెడియన్ ఓ వెబ్ సిరీస్ లో కూడా నటించారు. దీనికి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది ఓ సారి చూసేయండి..

    బాబు డైరెక్షన్ లో తెరకెక్కిన ప్రేమ వాలంటీర్ అనే వెబ్ సిరీస్ లో నటించారు ఈ కమెడియన్. అయితే ఈ సిరీస్ క్లైమాక్స్ లో ఈయన పాత్ర చనిపోయినట్టుగా కనిపిస్తుంది. కొన్ని ఊరుపేరు లేని యూట్యూబ్ ఛానెల్లు మాత్రం ఇమ్మాన్యూయేల్ చనిపోయారు అంటూ థంబ్ నైల్ పెట్టి ప్రచారం చేశారు. వ్యూస్ కోసం హద్దులు దాటి మరీ ప్రచారం చేయడంతో ఎదుటి వారు ఎంత బాధ పడుతారో అని ఆలోచించకుండా ఇలా చేయడం వల్ల ఈ టాపిక్ హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ ఇమ్మాన్యూయేల్ చనిపోతే వర్ష ఏడుస్తున్నట్టు థంబ్ నైల్ పెట్టి ప్రచారం చేశారు. దీనిపై స్పందించిన ఇమ్మాన్యూయేల్ నేను నటిస్తే చనిపోయాను అని రాశారు.

    నేను చావలేదు. బతికే ఉన్నాను. అది కేవలం ప్రేమ వాలంటీర్ అనే వెబ్ సిరీస్ లోని సీన్ అంతే అంటూ ఎమోషనల్ అయ్యారు ఇమ్మాన్యూయేల్. దీంతో ఈ టాపిక్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయినా కేవలం వెబ్ సిరీస్ లోని ఒక ఎండింగ్ క్లిప్ ని తీసుకొని ఇలా ప్రచారం చేయడం ఎంత వరకు కరెక్ట్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇమ్మాన్యూయేల్ అభిమానులు.