Elon Musk: ట్విట్టర్‌ అకౌంట్‌తో ఆదాయం.. ఇలా ఏడాదికి రూ.8.2 కోట్లు సంపాదన!

టెస్లా, స్పేస్‌ఎక్స్, ట్విట్టర్‌ సంస్థల సీఈఓ ఎలాన్‌ మస్క్‌ ఇటీవల కీలక ప్రకటన చేశారు. ట్విట్టర్‌ అకౌంట్‌తో కూడా డబ్బులు సంపాదించే అవకాశాన్ని కల్పించారు. దీని కోసం సెట్టింగ్స్‌ల్లోకి వెళ్లి మానిటైజ్‌ ఆప్షన్‌ క్లిక్‌ చేస్తే చాలని చెప్పారు.

Written By: Raj Shekar, Updated On : April 27, 2023 1:59 pm

Elon Musk attends the opening of the Tesla factory in Gruenheide, Germany, on March 22, 2022.

Follow us on

Elon Musk: సామాజిక మాధ్యమాల్లో విప్లవం కొనసాగుతోంది. ఇప్పటికే అనేక సోషల్‌ మీడియా సంస్థలు ప్రజాదరణ పొందుతున్నాయి. తాజాగా ప్రపంచ సోషల్‌ మీడియా దిగ్గజం ట్విట్టర్‌.. తమ ఖాతాతో డబ్బులు కూడా సంపాదించే ఆలోచన చేసింది. ఈమేరకు సంస్థ అధినేత ఎలాన్‌మస్క్‌ ఇటీవల ప్రకటన కూడా చేశారు. ఇలా ట్విట్టర్‌ ఖాతాతో మస్క్‌.. ఏడాదికి భారీగానే ఆర్జిస్తున్నారు.

ట్విట్టర్‌ ఖాతాతో సంపాదన ఇలా..
టెస్లా, స్పేస్‌ఎక్స్, ట్విట్టర్‌ సంస్థల సీఈఓ ఎలాన్‌ మస్క్‌ ఇటీవల కీలక ప్రకటన చేశారు. ట్విట్టర్‌ అకౌంట్‌తో కూడా డబ్బులు సంపాదించే అవకాశాన్ని కల్పించారు. దీని కోసం సెట్టింగ్స్‌ల్లోకి వెళ్లి మానిటైజ్‌ ఆప్షన్‌ క్లిక్‌ చేస్తే చాలని చెప్పారు. ట్విట్టర్‌ యూజర్లు.. సబ్‌స్క్రిప్షన్లతో.. తమ కంటెంట్‌ ద్వారా డబ్బులు సృష్టించుకోవచ్చని మస్క్‌త ఎలిపారు. ఇక ప్రస్తుతానికి ఈ ఆప్షన్‌ అమెరికాలోనే అందుబాటులో ఉందని, త్వరలో ఇతర దేశాలకు కూడా విస్తరించనున్నట్లు ప్రకటించారు. ఇక వీలైనంత ఎక్కువ మంది కంటెంట్‌ క్రియేటర్లను ట్విట్టర్‌లోకి తీసుకొచ్చేందుకు మస్క్‌ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

మస్క్‌ సంపాదన రూ.8 కోట్లు..
మరి ట్విట్టర్‌ సీఈవో ఎలాన్‌ మస్క్‌.. తన ట్విట్టర్‌ అకౌంట్‌తో సంవత్సరానికి ఎంత సంపాదిస్తారో తెలుసా? మస్క్‌ సంవత్సరానికి తన ట్విట్టర్‌ అకౌంట్‌ ద్వారా రూ.8.2 కోట్ల వరకు సంపాదించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ట్విట్టర్‌ యూజర్లు.. తమ కంటెంట్‌ను నగదీకరించుకునే అవకాశం వల్లే ఇది సాధ్యం అవుతుందని అంచనా వేస్తున్నారు.

మస్క్‌ సబ్‌స్క్రైబర్లు 24,700
మస్క్‌.. తన ట్విట్టర్‌ అకౌంట్‌ ఫాలోవర్లు, సబ్‌స్క్రైబర్‌ సంఖ్యను ఇటీవల వెల్లడించారు. తన ట్విట్టర్‌ అకౌంట్‌కు మొత్తం 24,700 మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నట్లు చెప్పారు. ఇక ట్విట్టర్‌ సబ్‌స్క్రిప్షన్‌ ధర అమెరికాలో నెలకు 4.99 డాలర్లు .. భారత కరెన్సీలో సుమారు రూ.400కుపైనే ఉంది. ఇక ఇందులో యాపిల్‌ ఇన్‌యాప్‌ కొనుగోలు, ట్విట్టర్‌ ఆదాయం పోనూ.. ఒక్కో సబ్‌స్క్రైబర్‌ నుంచి 3.39 డాలర్ల చొప్పున కంటెంట్‌ క్రియేటర్‌కు చెల్లిస్తుంది ట్విట్టర్‌. ఈ లెక్కన మస్క్‌కు ప్రస్తుతం ఉన్న ఒక్కో సబ్‌స్క్రైబర్‌ నుంచి నెలకు రూ.277 చొప్పున వస్తుందని అంచనా. మొత్తంగా 27,400 మంది నుంచి నెలకు రూ.68,42,000 వస్తుంది. ఇలా ఏడాదికి లెక్కగడితే రూ.8.2 కోట్ల మేర ఆర్జించవచ్చు.

యూజర్లకూ అవకాశం..
తమ కంటెంట్‌తో డబ్బు సంపాదించుకునే అవకాశం ట్విట్టర్‌.. తన యూజర్లకు ఇస్తోంది. సుదీర్ఘ సమాచారం నుంచి ఎక్కువ డ్యురేషన్‌ ఉన్న వీడియోల వరకు దేనికైనా సబ్‌స్క్రిప్షన్‌ ఆప్షన్‌ సెలక్ట్‌ చేసుకొని వినియోగదారుల నుంచి డబ్బులు సంపాదించుకోవచ్చని మస్క్‌ ప్రకటించారు. దీని కోసం మానిటైజేషన్‌ ఫీచర్‌ను ఎనేబుల్‌ చేసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.