BGT 2024: 22 సంవత్సరాల యశస్వి జైస్వాల్.. స్టార్క్ ను ఎదుర్కొన్నాడు. కమిన్స్ కు చుక్కలు చూపించాడు. లయన్ ను బెంబేలెత్తించాడు.. లబూషేన్ ను హడలెత్తించాడు. హేజిల్ వుడ్ ను భయపెట్టించాడు. మార్ష్ కు చుక్కలు చూపించాడు. హెడ్ కైతే సినిమా చూపించాడు.. ఇలా ఒక ఆటగాడు.. అది కూడా తొలిసారి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆడుతున్న కుర్రాడు.. టీమిండియా కు తిరుగులేని లీడ్ అందించాడు. అరి వీర భయంకరమైన ఆస్ట్రేలియా బౌలర్లకు చెమటలు పట్టించాడు.
పెద్ద వేదికగా జరుగుతున్న టెస్ట్ లో జైస్వాల్ అదరగొట్టాడు.. డిఫెన్స్ ఆడుతూనే.. చెత్త బంతులను బౌండరీ తరలించాడు.. ఇంకాస్త తక్కువ ఎత్తులో వచ్చిన బంతులను సిక్సర్లు గా మలిచాడు. ఏకంగా 297 బంతులు ఎదుర్కొని 15 ఫోర్లు, మూడు సిక్సర్లతో 161 రన్స్ కొట్టేశాడు. అంతేకాదు ఆస్ట్రేలియాపై టీమిండియా కు 400 పై చిలుకు పరుగుల లీడ్ అందించాడు. ఓపెనర్ కె ఎల్ రాహుల్(77) తో కలిసి తొలి వికెట్ కు 201 పరుగులు జోడించాడు.. దీంతో యశస్వి జైస్వాల్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపోయాడు. మీడియాలో ప్రధాన వార్త అయిపోయాడు.. న్యూజిలాండ్ సిరీస్ తర్వాత.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తొలి ఇన్నింగ్స్ లో డక్ అవుట్ అయిన తర్వాత.. ఈ స్థాయిలో అతడు రాటు తేలడం మామూలు విషయం కాదు. ఆస్ట్రేలియాలో.. ఆస్ట్రేలియా బౌలర్లను బెదిరించడం అంత సులువైన అంశం కాదు..
విమర్శలను తట్టుకొని
తొలి ఇన్నింగ్స్ లో యశస్వి జైస్వాల్ డక్ ఔట్ అయ్యాడు. దీంతో అతనిపై విమర్శలు వ్యక్తమయ్యాయి. స్వదేశంలో మాత్రమే రెచ్చిపోతాడంటూ విశ్లేషకులు గేలి చేశారు. అయితే వారందరికీ జైస్వాల్ తన బ్యాట్ తోనే తిరుగులేని ఆన్సర్ ఇచ్చాడు. భారీ సెంచరీ తో పాటు అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.
సద్వినియోగం చేసుకున్నాడు
న్యూజిలాండ్ జట్టుతో జరిగిన టెస్ట్ సిరీస్లో దారుణమైన ఓటమి తర్వాత జట్టు ఆటగాళ్లకు కాస్త సమయం దొరికింది. అయితే మిగతా వారంతా విహారయాత్రలు, కుటుంబ సభ్యులతో గడిపితే.. యశస్వి మాత్రం తనకు లభించిన సమయాన్ని ప్రాక్టీస్ కోసం వాడుకున్నాడు. ముంబై నుండి తన ఇంటికి సమీపంలో ఉన్న థానే స్టేడియంలో కాంక్రీట్ స్లాట్ పై ప్రాక్టీస్ చేశాడు. ఇలా వరుసగా 200 ఓవర్ల పాటు షార్ట్ లెంగ్త్ బంతులను అడ్డుకున్నాడు. గంటలకు గంటలు సాధన చేశాడు. స్టంప్స్ కు అటూ ఇటూ రంగురంగుల బంతులతో 150 కిలోమీటర్ల వేగంతో వచ్చే విధంగా ఫర్ఫెక్ట్ ప్లానింగ్ తో ఆడాడు. అయితే ఈ విషయాన్ని రాజస్థాన్ రాయల్స్ క్రికెట్ డైరెక్టర్ జుబిన్ బరోచా పేర్కొన్నాడు. ” అతడు వేగంగా బంతులను వేయించుకున్నాడు. కాంక్రీట్ స్లాట్ పై వాటిని ధైర్యంగా ఎదుర్కొన్నాడు. ఇలా రోజులపాటు చేశాడు.. రోజు మొత్తం క్రీజ్ లో ఉండి ప్రత్యర్థి బౌలర్ల ను ఎదుర్కోవడమే లక్ష్యంగా అతడు ప్రాక్టీస్ చేశాడని” బరుచా వివరించాడు.
సచిన్ కూడా..
ఒకప్పుడు సచిన్ టెండూల్కర్ కూడా ఇదే విధంగా ప్రాక్టీస్ చేసేవాడు. దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ బౌలింగ్ ను ఎదుర్కోవడానికి సచిన్ ఇలా చేసేవాడు. షేన్ బౌలింగ్ ను ఎదుర్కోలేక ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని జట్ల బ్యాటర్లు ఇబ్బంది పడేవారు. కానీ సచిన్ మాత్రం తెలుగా తీసుకునేవాడు. నాడు లక్ష్మణ శివరామకృష్ణన్ అనే స్పిన్ బౌలర్ తో ఎక్కువగా లెగ్ సైడ్ బంతులు పెంచుకొని ఆడేవాడు. 2011లో ఒకప్పటి దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ ఇంగ్లాండ్ పర్యటనకు ముందు ఇలాగే గంటల తరబడి సాధన చేసేవాడు. అయితే ఇప్పుడు యశస్వి ప్రాక్టీస్ కూడా అలానే ఉందని.. అతడు కూడా దిగ్గజ ఆటగాళ్ల జాబితాలో చేర్తాడని క్రికెట్ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Bgt 2024 how yashaswi prepared for the 200 over perth test on sloping concrete
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com