Bengaluru Team: చాలాకాలం తర్వాత తొలిసారిగా ఐపీఎల్ ట్రోఫీ గెలిచింది. ఆ ఆనందాన్ని గొప్పగా జరుపుకునే క్రమంలో తప్పటడుగులేసింది. అది చెల్లించుకోలేని మూల్యానికి దారితీసింది. ఇప్పటికీ ఆ వివాదం కొనసాగుతూనే ఉంది. సరే ఆ వివాదానికి కస్త పక్కన పెడితే బెంగుళూరు జట్టును అభినందించాల్సిన ఒక సందర్భం ఇప్పుడు వచ్చింది.
బెంగళూరు జట్టు దశాబ్దానికి మించిన ఎదురుచూపు తర్వాత తొలిసారి ఐపిఎల్ ఛాంపియన్ గా నిలిచింది. ఒకరకంగా ఇది గొప్పగా వేడుక జరుపుకునే సందర్భం. అనితర సాధ్యంగా సంబరాలు జరుపుకునే సమయం. కానీ సాధించిన విజయం వల్ల.. కప్పు అందుకున్న ఆనందం మొత్తం ఆవిరి అయిపోయింది.. ఉత్సవాలను, గెలుపు సంబరాలను ఘనంగా జరుపుకునే క్రమంలో అవి శృతి మించాయి. తొక్కిసలాటకు కారణమయ్యాయి. అంచనాలకు మించి అభిమానులు రావడంతో అక్కడ పరిస్థితి ఒక్కసారిగా అదుపుతప్పింది. పోలీసులు కూడా ఏమీ చేయలేకపోవడంతో దారుణం చోటుచేసుకుంది. మొత్తంగా 10కిమించిన మంది అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 60 కి లోపు గాయపడ్డారు. ఇప్పటికీ అక్కడ భయానక వాతావరణమే కొనసాగుతోంది. అభిమానులు తొక్కిసలాటలో గాయపడటం వల్ల మైదానం పరిసర ప్రాంతాల్లో పాదరక్షలు గుట్టలుగా పేరుకుపోయాయి. కర్ణాటక రాజధాని పారిశుద్ధ్య సిబ్బంది ఏకంగా 120 బ్యాగులలో ఆ పాదరక్షలను ప్యాక్ చేశారంటే అక్కడి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. పైగా రోడ్డుకు ఇరువైపులా రక్తపు మరకలు ఉండడం పారిశుద్ధ్య సిబ్బందిని దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. అయితే ఇలాంటి పరిస్థితి నేపథ్యంలో కన్నడ క్రికెట్ జట్టుకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.
Read Also: ఏపీకి మరో ఉపద్రవం.. ప్రజలకు అలెర్ట్
ప్రతి ఐపీఎల్ సీజన్లో కన్నడ జట్టు ఏదో ఒక మ్యాచ్ ను ఆడేందుకు గ్రీన్ జెర్సీ ధరిస్తుంది. ఐపీఎల్ ప్రారంభం నుంచి కన్నడ జట్టు ఆటగాళ్లు ఈ విధానాన్ని అనుసరిస్తున్నారు. అయితే ఈ గ్రీన్ జెర్సీలను రూపొందించడం వెనక ఒక గొప్ప ఉద్దేశం ఉంది. వాస్తవానికి స్టేడియాలలో మ్యాచులు మొత్తం పూర్తయిన తర్వాత అభిమానులు నీళ్లు తాగిన తర్వాత ప్లాస్టిక్ సీసాలను మైదానంలో పడేస్తారు. అయితే ఆ సీసాలను అత్యంత జాగ్రత్తగా పారిశుధ్య సిబ్బంది సేకరిస్తారు. అనంతరం వాటిని ప్రత్యేకమైన పద్ధతుల్లో రీసైకిల్ చేస్తారు. అత్యంత ఆధునికమైన టెక్నాలజీ ఉపయోగించి పాలియేస్టర్ ఫైబర్ గా రూపొందిస్తారు. దానిద్వారా గ్రీన్ జెర్సీలను తయారు చేస్తారు. ఇక ఒక జెర్సీ తయారు చేయడానికి దాదాపు 11వేల ప్లాస్టిక్ సీసాలను ఉపయోగిస్తారు.. కన్నడ జట్టు ప్లేయర్ల కోసం దాదాపు లక్షకు మించి బాటిల్స్ ఉపయోగిస్తారని తెలుస్తోంది. తద్వారా పర్యావరణ కాలుష్యం తగ్గుతుందని.. నీటి వనరుల మీద ఒత్తిడి తగ్గుతుందని పర్యావరణవేత్తలు అంటున్నారు.
Read Also: ఏపీ నుంచి 500 ఏఐ స్టార్టప్ లు: సీఎం చంద్రబాబు
” కన్నడ జట్టు చేసిన ఈ ప్రయోగం అద్భుతంగా ఉంది. వాస్తవానికి ప్రస్తుత ప్రపంచానికి ప్లాస్టిక్ అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్లాస్టిక్ లేకుండా బతికే పరిస్థితి లేదు. అలాగని వాడిన తర్వాత విచ్చలవిడిగా పడేయడం ఇటీవల కాలంలో పెరిగిపోయింది. ద్వారా నీటి వనరులు.. భూమి మొత్తం కాలుష్యమయమైపోతోంది. దీనివల్ల జీవచరాలు ఇబ్బంది పడుతున్నాయి. జలచరాలు ప్రమాదాలను ఎదుర్కొంటున్నాయి. వాటిని నివారించడానికి బెంగళూరు జట్టు యాజమాన్యం ఇలాంటి పద్ధతిని ఎంచుకోవడం గొప్పగా ఉందని.. దీనిని ఇంకా కొనసాగించాలని” పర్యావరణ వేత్తలు కోరుతున్నారు.