Ben Stokes Vs Ashwin: ఇండియా ఇంగ్లాండ్ టీమ్ ల మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో రెండు టీమ్ లు కూడా అద్భుతమైన పర్ఫామెన్స్ ఇస్తూ ముందుకు దూసుకెళ్తున్నాయి. ఇక ఇలాంటి క్రమంలోనే ఇంగ్లాండ్ టీమ్ రెండో ఇన్నింగ్స్ లో 420 పరుగులు చేసి ఆలౌట్ అయింది. అయితే పోప్ ఒక్కడే ఒంటరి పోరాటం చేసి 196 పరుగులు చేశాడు.
దాంతో ఇంగ్లాండ్ టీమ్ ని ఆదుకునే ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ ఇంగ్లాండ్ టీమ్ పెద్దగా స్కోర్ అయితే సాధించలేకపోయింది. ఇక ఇదిలా ఉంటే ఇంగ్లాండ్ కెప్టెన్ అయిన బెన్ స్టోక్స్ ఇండియన్ టీమ్ దగ్గజ స్పిన్నర్ అయిన రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో తను కేవలం 6 పరుగులు మాత్రమే చేసి అవుట్ అవ్వడం ఇంగ్లాండ్ అభిమానులను తీవ్రంగా నిరాశ పరిచిందనే చెప్పాలి. ఇక అశ్విన్ తన దిగ్గజ స్ఫిన్ మాయాజాలంతో బెన్ స్టోక్స్ ని అవుట్ చేసి ఎంటైర్ టెస్ట్ కెరియర్ లో 12 వసారి స్టోక్స్ ని అవుట్ చేసిన బౌలర్ గా ఒక రికార్డుని క్రియేట్ చేశాడు.
ఇక ఇంతకుముందు టెస్టులో కపిల్ దేవ్ పాకిస్తాన్ ప్లేయర్ అయిన ‘ముదస్సర్ నాజర్’ ని 12 సార్లు అవుట్ చేశాడు. ఇక ఇప్పుడు అశ్విన్ బెన్ స్టోక్స్ ని 12 సార్లు అవుట్ చేయడంతో కపిల్ దేవ్ రికార్డుతో సమం చేశాడు… అయితే బెన్ స్టోక్స్ టెస్టుల్లో అశ్విన్ ని ఎదుర్కోడం లో చాలావరకు ఇబ్బంది పడుతు ఉంటాడు. తను వేసే బాల్స్ ని ఎదుర్కోవడంలో చాలాసార్లు ఫెయిల్ అవుతూ ఉంటాడు.
ఇక ఈసారి కూడా అదే నెగ్లిజెన్సీ అతని కొంపముంచిందనే చెప్పాలి. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో అశ్విన్ 3 వికెట్లు తీసి ఇంగ్లాండ్ టీమ్ ఎక్కువ స్కోర్ చేయకుండా తన వంతు పాత్రనైతే పోషించాడు. ఇక అదే విధంగా ఇండియన్ టీమ్ 231 పురుగుల భారీ టార్గెట్ ని రీచ్ అయ్యే క్రమంలో ముందుకెళ్తుంది. ఇక ఇదే క్రమంలో మొత్తానికైతే అశ్విన్ కపిల్ దేవ్ రికార్డును సమం చేశాడు. ఇక ఈ సిరీస్ లో ఇంకో నాలుగు మ్యాచ్ లు ఆడాల్సి ఉన్న నేపథ్యం లో మరోసారి స్టోక్స్ ని ఔట్ చేసి కపిల్ దేవ్ రికార్డ్ ని బ్రేక్ చేస్తాడేమో చూడాలి…