Under 19 World Cup: అండర్ 19 వరల్డ్ కప్ లో అన్ని టీములు మంచి పర్ఫామెన్స్ ఇస్తు ముందుకెలుతున్నాయి. ఇక ముఖ్యంగా గ్రూప్ డి లో ఉన్న పాకిస్తాన్ టీం న్యూజిలాండ్ మీద ఆడిన మ్యాచ్ లో 10 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ ని ఓడించి భారీ విజయాన్ని సాధించడంతో పాటుగా గ్రూప్ డి లో టాప్ పొజిషన్ లో నిలిచి సూపర్ సిక్స్ లోకి ఎంటర్ అయింది.
అయితే న్యూజిలాండ్ 140 పరుగులు చేసి ఆలౌట్ అవ్వగా, 141 పరుగులు లక్ష్యం తో బరిలోకి దిగిన పాకిస్తాన్ టీమ్ కేవలం 22 ఓవర్లలోనే 144 పరుగులు చేసింది. దీంతో పాకిస్తాన్ భారీ విజయం సాధించింది. ఇక దాంతో సూపర్ సిక్స్ లోకి ఎంటర్ అయింది. ఇక ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ ప్లేయర్లు హుస్సేన్ 54 పరుగులు చేయగా, సహజబ్ ఖాన్ 80 పరుగులు చేశాడు ఇక వీళ్లిద్దరూ కలిసి హాఫ్ సెంచరీలు నమోదు చేయడంతో పాకిస్థాన్ భారీ విజయాన్ని అందుకుంది…
ఇక సౌతాఫ్రికా స్కాట్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్ లో సౌతాఫ్రికా 7 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని అందుకొని సూపర్ సిక్స్ లోకి ఎంటర్ అయింది. ఇక ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ టీమ్ నిర్ణీత 50 ఓవర్లకి 269 పరుగులు చేసింది. ఇక 270 పరుగుల భారీ లక్ష్యం తో బరిలోకి దిగిన సౌతాఫ్రికా టీమ్ మూడు వికెట్లు కోల్పోయి 273 పరుగులు చేసింది. ఇక సౌతాఫ్రికా టీం లో స్టీవ్ స్టోల్క్ 86 పరుగులు చేశాడు… ఇక ఈయనే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు.ఇక దీంతో సౌతాఫ్రికా టీమ్ సూపర్ సిక్స్ లోకి ఎంటర్ అయింది.
ఇక జింబాబ్వే నమీబియా మధ్య జరిగిన మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన నమీబియా నిర్ణీత 50 ఓవర్లలో146 పరుగులు చేసింది.147 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే టీం 32 ఓవర్లలో 147 పరుగుల లక్ష్యాన్ని చేదించి భారీ విజయాన్ని అందుకుంది. దీంతో జింబాబ్వే కూడా సూపర్ సిక్స్ లోకి ఎంటర్ అయింది..