Ben Stokes: ఇంగ్లాండ్ మ్యాచ్ ఓడిపోయినా ఆ విషయం లో సంతోషంగా ఉందన్న బెన్ స్టోక్స్…

బస్ బాల్ గేమ్ ని వదిలిపెట్టకుండా ఇక్కడ కూడా అదే స్ట్రాటజీని మెయింటైన్ చేస్తూ ఆడిన మా ప్లేయర్లందరు కూడా వాళ్ల బెస్ట్ పర్ఫామెన్స్ ను ఇచ్చారు. ఇక నాలుగో రోజు 322 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన మేము కొంతవరకు స్ట్రగుల్ అయ్యాము.

Written By: Gopi, Updated On : February 6, 2024 8:27 am

Bike Ride

Follow us on

Ben Stokes: ఇండియా ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో భాగంగా ఈరోజు ఇండియన్ టీమ్ 106 పరుగుల తేడా తో ఇంగ్లాండ్ మీద భారీ విజయాన్ని సాధించింది. ఇక అందులో భాగంగానే ఇంగ్లాండ్ టీమ్ లో కెప్టెన్ అయిన బెన్ స్టోక్స్ మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైజాగ్ లాంటి ఒక పిచ్ లో మా ఆట తీరు మాకు చాలా సంతృప్తిని ఇచ్చింది. ఎందుకంటే ఇది చాలా టఫ్ పిచ్ దీని మీద ఆడాలంటే చాలా అనుభవం ఉండాలి. అలాంటి పిచ్ మీద కూడా మా ప్లేయర్లు ఎక్కడ తగ్గకుండా గెలవాలనే ఒక ఆత్రుతతో ఆడినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం.

అందులోనూ బస్ బాల్ గేమ్ ని వదిలిపెట్టకుండా ఇక్కడ కూడా అదే స్ట్రాటజీని మెయింటైన్ చేస్తూ ఆడిన మా ప్లేయర్లందరు కూడా వాళ్ల బెస్ట్ పర్ఫామెన్స్ ను ఇచ్చారు. ఇక నాలుగో రోజు 322 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన మేము కొంతవరకు స్ట్రగుల్ అయ్యాము. కానీ మా ప్లేయర్ అయిన క్రూలే 73 పరుగులు చేసినప్పటికీ, మిగతా ప్లేయర్లు వాళ్ల శాయ శక్తుల ప్రయత్నం చేసి విజయం సాధించాలని చూశాం కానీ అది కుదరలేదు. నిజానికి మేము 399 పరుగుల లక్ష్యాన్ని చేదించగలమనే కాన్ఫిడెంట్ తోనే ముందుకు కదిలాము.

అయినప్పటికీ ఇండియన్ బౌలర్లైన అశ్విన్, బుమ్రా ల దాటికి మా ప్లేయర్లు కొంతవరకు తడబడ్డారు అయినప్పటికీ మేము బస్ బాల్ గేమ్ ని మాత్రం వదిలి పెట్టకుండా ఆడము కాబట్టి దానికి మాకు చాలా సంతోషంగా ఉంది అని చెబుతూనే మా ప్లేయర్లలో కొందరు ‘వైరల్ ఇన్ఫెక్షన్స్’ కి గురయ్యారు.

దానివల్ల కూడా మా ప్లేయర్లు కొంత వరకు మ్యాచ్ మీద ఫోకస్ పెట్టలేకపోయారు. అది కూడా మాకు చాలా వరకు మైనస్ అయింది. అయినప్పటికీ మిగిలిన మూడు మ్యాచ్ ల్లో మరింత మెరుగైన ఆటను కనపరచడానికి మేం సంసిద్ధంగా ఉన్నాం అంటూ తెలియజేశాడు.ఇక ఆ మాటలను చూసిన ఇంగ్లాండ్ ప్లేయర్లు వాళ్ళ కెప్టెన్ తమ మీద పెట్టిన నమ్మకాన్ని గుర్తు చేసుకొని మిగతా మ్యాచులు గెలవడానికి రెడీగా ఉన్నామని బెన్ స్టోక్స్ తో చెప్పినట్టుగా తెలుస్తుంది…