https://oktelugu.com/

Bike Ride: అంత పెద్ద కాలువని.. అవలీలగా దాటేశాడు..

సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత ఇలాంటి వీడియోలు కనిపించడం సర్వసాధారణమైపోయింది. రొటీన్ గా చూస్తే వీడియోల్లా కాకపోవడంతో వీటిలో అడ్వెంచర్స్ పాళ్ళు ఎక్కువగా ఉండటంతో నెటిజన్లు అటువంటివి చూడడానికి ఇష్టపడుతున్నారు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : February 6, 2024 / 08:24 AM IST

    Bike Ride

    Follow us on

    Bike Ride: అద్భుతం జరిగేటప్పుడు ఎవరూ పట్టించుకోరు.. జరిగిన తర్వాత పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఖలేజా సినిమాలో ఓ డైలాగ్ ఇది. ఈ డైలాగ్ ఆ బైకర్ కు అచ్చు గుద్దినట్టు సరిపోతుంది. అతని పేరు, ప్రాంతం ఏమిటో తెలియదు కానీ.. అక్కడి పరిసరాలు చూస్తుంటే అది ఎక్కడో బయట దేశంలోని ప్రాంతం లాగా కనిపిస్తున్నది. పెద్దగా హడావిడి లేదు. చుట్టూ జనం కూడా లేరు. వంతెన కింది నుంచి చూస్తేనేమో నీళ్లు పారున్నాయి. ఆ వంతెన కూడా చాలా లోతులో ఉంది. బహుశా భారీ ప్రవాహం అనుకుంటా.. ఇందులోనే చిన్నగా శబ్దం చేసుకుంటూ బైకర్ వచ్చాడు. అమాంతం గాల్లో బైక్ తో సహా గాల్లో ఎగిరాడు. అంత పెద్ద కాలువను క్షణాల్లో దాటేశాడు. సాధారణంగా మనం ఈ స్థాయి స్టంట్స్ సినిమాల్లో చూస్తూ ఉంటాం. సినిమాల్లో అయితే రోప్ లు, క్రేన్ లు, నానా హంగామా ఉంటుంది..కానీ ఇక్కడ అలాంటిది లేదు. జస్ట్ అలా బైక్ పై సుడిగాలిని మించి వేగంతో వచ్చిన వ్యక్తి ఒంట్లో ఎముకలే లేనట్టు అమాంతం అలా గాల్లో ఎగిరాడు. పెద్ద కాలువను అవలీలగా దాటేసాడు.

    సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత ఇలాంటి వీడియోలు కనిపించడం సర్వసాధారణమైపోయింది. రొటీన్ గా చూస్తే వీడియోల్లా కాకపోవడంతో వీటిలో అడ్వెంచర్స్ పాళ్ళు ఎక్కువగా ఉండటంతో నెటిజన్లు అటువంటివి చూడడానికి ఇష్టపడుతున్నారు. ఇన్ స్టా గ్రామ్ లో అర్నౌద్ జోలో డోస్ అనే ఐడిలో ఈ వీడియో అప్ లోడ్ చేశారు. ఇప్పటికే ఈ వీడియో 7 మిలియన్ లైక్స్ సొంతం చేసుకుంది. 37 వేల మంది ఈ వీడియో పై తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. కాగా, ఈ వీడియో లో బైక్ నడిపిన వ్యక్తి ప్రొఫెషనల్ రేసర్ లాగా ఉన్నాడు..గుండె ధైర్యం కూడా అతడిలో ఎక్కువ ఉన్నట్టుంది. లేకుంటే అంత పెద్ద కాలువను.. అది కూడా బైక్ నడుపుతూ.. సుడిగాలి వేగంతో దాటేయడం అంటే మామూలు విషయం కాదు. పైగా ఆ కాలువలో నీళ్లు పారుతున్నాయి. చూసేందుకు అది చాలా లోతుగా ఉంది.. ఏమాత్రం అదుపు కోల్పోయినా ప్రాణాలు గాల్లో కలిసిపోవడం ఖాయం. కనీసం మృత శరీరం కూడా లభించదు. పైగా ఆ కాలువకు అటు ఇటు దట్టంగా వృక్షాలున్నాయి.

    ఆ స్టంట్ చూసిన వారివారికైనా అయ్యో బాబోయ్ అని అనిపిస్తుంది. ఇప్పటికే 7 మిలియన్ల మంది ఈ వీడియో ను లైక్ చేశారు. 37 వేల మంది కామెంట్స్ చేశారు. “అంత పెద్ద కాలువను అంత సులువుగా దాటడం సులభమే అది అతడి కోణంలో” అని ఓ యువతి కామెంట్ చేస్తే.. ” బైక్ వేగంగా దూసుకొచ్చింది. చూస్తుండగానే కాలువను దాటేసింది. ఇది సాహసం కాదు. అంతకుమించి” అని ఓ యువకుడు తన అభిప్రాయాన్ని వ్యక్తీకరించాడు. ” అంత వేగంతో బైక్ నడపడం ఒక రికార్డు అయితే.. అవలీలగా దాటడం మరొక రికార్డు అని” ఓ వ్యక్తి కామెంట్స్ చేశాడు. ” సాహసాలు మంచివే. కానీ ఇలాంటి సాహసాలు ప్రాణాలు తీస్తాయి” అని మహిళ సున్నిత హెచ్చరిక లాంటి కామెంట్స్ చేసింది.