https://oktelugu.com/

US open 2024: యూఎస్ ఓపెన్ ఫైనల్ లో సంచలనం.. అమెరికా క్రీడాకారిణికి పరాభవం.. టైటిల్ దక్కించుకున్న బెలారెస్ సబలెంక

యూఎస్ ఓపెన్ లో సంచలనం నమోదయింది. ఫైనల్ లో అమెరికా క్రీడాకారిణికి పరాభావం ఎదురయింది. బెలారస్ క్రీడాకారిణి సబలెంక విజేతగా నిలిచింది. 26 సంవత్సరాల సబలెంక యూఎస్ ఓపెన్ గెలుచుకోవడం ద్వారా తన గ్రాండ్ స్లామ్ ల సంఖ్యను మూడుకు పెంచుకుంది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : September 8, 2024 / 10:29 AM IST

    US open 2024 Champoin

    Follow us on

    US open 2024:  యూఎస్ ఓపెన్ లో సబలెంక ఎదురనేది లేకుండా ఆడింది. అద్భుతమైన పోరాటపటి మను చూపించింది. వాస్తవానికి యూఎస్ ఓపెన్ ప్రారంభమైనప్పుడు మహిళల విభాగంలో అందరి అంచనాలు నెంబర్ వన్ ర్యాంకర్ స్వీయా టెక్ పై ఉన్నాయి. ఆమె యూఎస్ ఓపెన్ గెలుచుకుంటుందని అందరూ అనుకున్నారు. టెన్నిస్ వర్గాలు కూడా అదే స్థాయిలో విశ్లేషణ చేశాయి. కానీ క్షేత్రస్థాయిలో జరిగింది వేరు. స్వీయా టెక్ అనూహ్యంగా జెస్సికా పెగులా చేతిలో ఓటమిపాలైంది. దీంతో ఒక్కసారిగా యూఎస్ ఓపెన్ లో సంచలనం నమోదయింది. ఇదే క్రమంలో సబలెంక వరుస విజయాలతో ఫైనల్ దాకా దూసుకొచ్చింది. ప్రతి మ్యాచ్ లో కూడా తన నూరు శాతం ప్రతిభను ప్రదర్శించింది. ప్రత్యర్థి క్రీడాకారిణికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా దూకుడుగా ఆడింది. సర్వీస్ బ్రేక్ డౌన్ కాకుండా చూసుకోవడం, ఏస్ లు సరిగ్గా సంధించడం, ఫోర్ హ్యాండ్ షాట్లు బలంగా కొట్టడం వంటి నైపుణ్యాలను ప్రదర్శించి సత్తా చాటింది. దీంతో ఏకంగా ఫైనల్ చేరుకుంది. ప్రస్తుతం సబ లెంక ప్రపంచ నెంబర్ టు ర్యాంకర్ గా కొనసాగుతోంది. గతంలో సబలెంక యూఎస్ ఓపెన్ ఫైనల్ చేరింది. అయితే ఆమె టైటిల్ అందుకోలేకపోయింది. అప్పట్లో ఫైనల్ పోటీలో కోకో గాఫ్ చేతిలో ఓటమిపాలైంది. కానీ ఈసారి యూఎస్ ఓపెన్ లో గత తప్పులు పునరావృతం చేయలేదు. పెగులా పై ఆధిపత్యాన్ని ప్రదర్శించి వరుస సెట్లలో ఓడించింది. చివరికి యూఎస్ ఓపెన్ ను సొంతం చేసుకుంది..

    చరిత్ర సృష్టించింది

    సబ లెంక ఫైనల్ చేరినప్పటికీ.. అమెరికా వేదికగా మ్యాచ్ జరుగుతోంది కాబట్టి.. ఫైనల్ లో అమెరికా క్రీడాకారిణి పెగులా కూడా ఆడుతోంది కాబట్టి.. ఆమెకే విజయావకాశాలు ఉంటాయని అందరూ భావించారు. పైగా గతంలో సబలెంక కోకో గాఫ్ చేతిలో ఓడిపోవడంతో ఈసారి కూడా అదే సీన్ రిపీట్ అవుతుందని అనుకున్నారు. కానీ ఫైనల్ లో గత తప్పును సబ లెంక పునరావృతం చేయలేదు. 7-5, 7-5 తేడాతో ఓడించి టైటిల్ దక్కించుకుంది. వాస్తవానికి పెగులా గట్టి పోటీ ఇచ్చింది. ఒకానొక దశలో ఇద్దరి మధ్య హోరాహోరీగా పోరు నడిచింది. అయితే దానిని చివరి వరకు కొనసాగించడంలో పెగులా విఫలమైంది. దీంతో సబ లెంక పై చేయి సాధించింది. మొత్తానికి తొలిసారి యూఎస్ ఓపెన్ ను సొంతం చేసుకుంది. ఈ గెలుపు ద్వారా తన గ్రాండ్ స్లామ్ ల సంఖ్యను మూడుకు పెంచుకుంది.. ట్రోఫీ అందుకున్న అనంతరం సబ లెంక భావోద్వేగానికి గురైంది. ” ఈ విజయాన్ని ఊహించాను. మైదానంలో చెమటోడ్చాను. ఇది నాకు గొప్పగా అనిపిస్తోంది. ఈ అనుభూతిని మాటల్లో వర్ణించలేను. నా ఫోకస్ ఇక్కడితో ఆగిపోదు. సాధించాల్సింది చాలా ఉందని” సబలెంక వ్యాఖ్యానించింది.