https://oktelugu.com/

Marriage: కెరీర్ కోసం పెళ్లి, పిల్లలను ఆలస్యం చేస్తున్నారా? ఇలా చేయడం కరెక్టేనా?

ఈరోజుల్లో యువత డబ్బులు ఎక్కువ సంపాదించాలని పెళ్లికి కాస్త వెనుకంజ వేస్తున్నారు. పెళ్లి, పిల్లలు అయితే లైఫ్ లో అనుకున్నవి సాధించలేమని ఉద్దేశంతో వీటికి దూరంగా ఉంటున్నారు. అయితే ఇది తప్పు నిర్ణయం అని ఎక్కువ శాతం మంది అంటున్నారు.

Written By:
  • Srinivas
  • , Updated On : September 8, 2024 / 11:00 AM IST

    wedding season

    Follow us on

    Marriage: ప్రస్తుతం ఉన్న జనరేషన్ లో చాలామంది లైఫ్ లో సెటిల్ అవ్వాలని ప్లాన్ చేస్తున్నారు. అమ్మాయిలు అయిన అబ్బాయిలు అయిన పెళ్లి, పిల్లలు కంటే ముందు మంచి ఉద్యోగంలో సెటిల్ కావాలని ప్లాన్ చేస్తున్నారు. అబ్బాయిల కంటే అమ్మాయిలు ఎక్కువ మంది పెళ్లికి దూరంగా ఉండి.. లైఫ్ లో సెటిల్ కావడానికి ప్లాన్ చేస్తున్నారు. సరి అయిన వయస్సులో పెళ్లి చేసుకోకుండా.. ఎక్కువగా ఒత్తిడికి గురవుతున్నారు. ఎలాంటి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ఉంటే జీవితం బాగుంటుంది. కానీ చాలా మంది వ్యక్తిగత కారణాలు, చదువు, ఉద్యోగం వాళ్ల పర్సనల్ లైఫ్ కి చాలా దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం ఉన్న జీవనశైలి, మారుతున్న పరిస్థితుల వల్ల ఎక్కువగా ఉద్యోగానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకు అంటే చాలా మంది ఈరోజుల్లో ఇతరులపై ఆధారపడకుండా.. గొప్పగా బతకాలని అనుకుంటున్నారు. మంచిగా లైఫ్ ఎంజాయ్ చేయాలంటే.. ఆర్థికంగా బాగా సంపాదించాలని యువత భావిస్తున్నారు. అమ్మాయిలు అయినా అబ్బాయిలు అయినా ఈరోజుల్లో ఉద్యోగం కోసం పెళ్లి, పిల్లలని కూడా ఆలస్యం చేస్తున్నారు. కేవలం వర్క్ లైఫ్ కోసం పెళ్లి, పిల్లలను ఆలస్యం చేయడం అసలు కరెక్టేనా. ఇది ఎలాంటి ప్రతికూల ప్రభావాలకు దారి తీస్తుందో మరి చూద్దాం.

    ఈరోజుల్లో యువత డబ్బులు ఎక్కువ సంపాదించాలని పెళ్లికి కాస్త వెనుకంజ వేస్తున్నారు. పెళ్లి, పిల్లలు అయితే లైఫ్ లో అనుకున్నవి సాధించలేమని ఉద్దేశంతో వీటికి దూరంగా ఉంటున్నారు. అయితే ఇది తప్పు నిర్ణయం అని ఎక్కువ శాతం మంది అంటున్నారు. ఎందుకు అంటే కెరీర్ కోసం పెళ్లిని వాయిదా వేస్తే.. వయస్సు అయిపోతుంది. తరువాత చేసుకోకూడదు అని కాదు. సరైన వయస్సులో పెళ్లి చేసుకుంటే.. ఒత్తిడి, ఆందోళన ఉండవు. వయస్సు పెరిగే కొలది పిల్లలు పుట్టే అవకాశం కూడా తగ్గుతుంది. అయినా ఈరోజుల్లో సరోగసి, ఐవీఎఫ్ వంటివి చాలానే ఉన్నాయి. కానీ సరైన వయసులో పెళ్లి, పిల్లలు అయితే అనారోగ్య సమస్యలు రావు. ఆరోగ్యంగా ఉంటారు. అయితే కొందరు ఎవరి ఇష్టం వాళ్లది. లైఫ్ లో వాళ్లకు ఏం చేయాలి అనేది వాళ్ల ఇష్టం. వాళ్లకి కొన్ని ఇష్టాలు, అభిప్రాయాలు ఉంటాయని కొందరు అంటున్నారు. ఏది ఏమైనా వయస్సు వచ్చినప్పుడే పెళ్లి చేసుకుని పిల్లలు కనడం బెటర్. అది కూడా అర్థం చేసుకునే భాగస్వామి దొరికినప్పుడు అంత కంటే అదృష్టం ఇంకా ఏం ఉండదు. పెళ్లి, పిల్లలు అయిన తరువాత కూడా కెరీర్ లో దూసుకుపోవచ్చు. అది అన్ని విధాలుగా అర్థం చేసుకునే భాగస్వామి వచ్చినప్పుడు మాత్రమే. పెళ్లి అయిన తరువాత కూడా కెరీర్ లో సెటిల్ అయిన వాళ్లు చాలా మంది ఉన్నారు. లైఫ్ లో సెటిల్ ఏ వయసులో అయిన అవ్వచ్చు. కానీ ఒక వయస్సు దాటాక పెళ్లి, పిల్లలు కావడం కొంచెం కష్టం. కాబట్టి వయస్సు దాటాక ముందు పెళ్లి చేసుకుని, కెరీర్ మీద ఫోకస్ చేస్తే సరిపోతుంది.