https://oktelugu.com/

Malaysia Masters Badminton 2023 : అదీ ఆటంటే.. చివరి దాకా చూడకపోతే మనకి మనశ్శాంతి ఉండదు!

నాలుగు సింహాలు రెండుగా విడిపోయి పరస్పరం కలబడితే ఎలా ఉంటుంది.. అంతే సంఖ్యలో పులులు జట్టుగా పోరాడితే ఎలా ఉంటుంది.. చివరిదాకా చూడాలనిపిస్తుంది.. ఎవరు గెలుస్తారో అంతకంత పెరుగుతుంది. చివరికి గెలిచిన వాళ్ళని చూస్తే ఆనందం.. ఓడిపోయిన వాళ్ళను చూస్తే పోరాట పటిమ మన కళ్ళకు కనిపిస్తుంది.

Written By: , Updated On : February 10, 2025 / 07:22 PM IST
Malaysia Masters Badminton 2023

Malaysia Masters Badminton 2023

Follow us on

Malaysia Masters Badminton 2023  : కింది లింక్ లో ఉన్న వీడియో కూడా అలాంటిదే. రెండు సంవత్సరాల క్రితం జరిగిన టోర్నీ అది. కానీ ఫైనల్ మ్యాచ్ మాత్రం నువ్వా నేనా అన్నట్టుగా సాగింది. వెంట్రుక వాసిలో విజయం ఒక జట్టుకు లభించగా.. ఇంకో జట్టు అంతే తేడాలో పరాజయం పాలయింది. 2023లో మలేషియా మాస్టర్ స్ బ్యాడ్మింటన్ జరిగింది.. ఇది 2023 మే 23 నుంచి 28 వరకు మలేషియాలోని కౌలాలంపూర్ లోని అక్సియాటా అరేనా లో జరిగింది.. సింగిల్స్, డబుల్స్, మెన్స్, ఉమెన్స్ డబుల్స్ లో పోటీలు నిర్వహించారు.. అయితే ఇందులో ఉమెన్స్ డబుల్స్ పోటీ మాత్రం హోరాహోరీగా సాగింది. మైదానంలో ప్లేయర్లు నువ్వా నేనా అన్నట్టుగా పోటీపడ్డారు..నలుగురూ యోధులైన ప్లేయర్లు కావడంతో మ్యాచ్ మొత్తం రసవత్తరంగా సాగింది. మైదానంలో ఆడుతున్న ప్లేయర్లకు ఉత్కంఠను.. చూస్తున్న ప్రేక్షకులకు ఉల్లాసాన్ని కలిగించింది. కొదమసింహాల్లాగా ప్లేయర్లు పోటీపడి ఆడుతుంటే.. చూసే ప్రేక్షకులు సీట్ ఎడ్జ్ లో కూర్చున్నారు. వెంట్రుకవాసిలో ఫలితం వస్తుందని.. ఎవరు గెలిచినా అద్భుతం అని అలానే చూస్తుండి పోయారు.

సుదీర్ఘ మ్యాచ్

ఫైనల్ మ్యాచ్లో బీక్ హానా, లీ సో హీ ఓ జట్టుగా, పేర్లీ టాన్, తిన్నా మురళీ ధరన్ మరో జట్టుగా పోటీపడ్డారు. ఫైనల్ మ్యాచ్లో ఫైనల్ మ్యాచ్లో హోరాహోరీగా తలపడ్డారు. మూడు సెట్ల పాటు ఈ గేమ్ జరిగింది. తొలి సెట్ లో బేక్, లీ 22 పాయింట్లు సాధించగా.. పార్లీ, తిన్నా 20 పాయింట్లు సాధించారు.. ఇక రెండవ సెట్ లో అయితే పార్లీ, తిన్నా 21 పాయింట్లు సాధించగా, బేక్, లీ 8 పాయింట్లకే పరిమితమయ్యారు. ఇక మూడవ సెట్ సుదీర్ఘకాలం సాగింది.. రెండు జట్ల మధ్య సర్వీస్ బ్రేక్ కాలేదు.. దాదాపు 20 నిమిషాల పాటు ఏకధాటిగా ప్లేయర్లు ఆడారు. పోటాపోటీగా పాయింట్లు సాధించారు. చివరికి పెర్లీ, తిన్నా విజయం సాధించారు.. చివరి సెట్ లో బేక్, లీ జోడి 21 పాయింట్లు సాధించగా.. పార్లీ, తిన్నా 17 పాయింట్లు సాధించారు. రెండేళ్ల క్రితం ఈ మ్యాచ్ జరిగినప్పటికీ.. ఇప్పటికీ ఆ వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తూనే ఉంది. ఆ మ్యాచ్ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బ్యాడ్మింటన్ అభిమానులు కళ్ళు కాయలు కాచే విధంగా ఎదురు చూశారు. అర్ధరాత్రి దాకా సమయం వెళుతున్నప్పటికీ.. అలానే టీవీలకు అతుక్కుపోయారు.. అందుకే కొన్నిసార్లు ఆటలు మానసిక ఉల్లాసాన్నే కాదు.. శారీరక దృఢత్వాన్ని.. అచంచలమైన ఉత్సాహాన్ని అందిస్తాయి. ఆ కోవలో ఈ మ్యాచ్ ముందు వరుసలో ఉంటుంది.