Vishwak Sen apologize
Vishwak Sen : అధికారం ఎప్పటికీ శాశ్వతం కాదు, ఎదో ఒక సందర్భంలో కుప్ప కూలిపోవాల్సిందే. 2019 ఎన్నికలలో వైసీపీ పార్టీ 151 స్థానాల్లో ఘనవిజయం సాధించి సంచలనం సృష్టించింది. మరో 30 ఏళ్ళు జగనే సీఎం, ఆయనకు పోటీ వచ్చేవాళ్లే లేరంటూ ఆయన సపోర్టర్లు అప్పట్లో రెచ్చిపోయారు. కట్ చేస్తే ఈ ఎన్నికలలో 11 సీట్లకు పడిపోయారు. అధికార గర్వం చూసుకొని ఆయన పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీ లు మాత్రమే కాదు, ఫాలోవర్లు కూడా పెద్ద ఎత్తున అప్పట్లో రెచ్చిపోయేవారి. కట్ చేస్తే అలా రెచ్చిపోయి నోరు పారేసుకున్న ప్రతీ ఒక్కరు నేడు తీవ్రమైన ఇబ్బందులను ఎదురుకుంటున్నారు. ఈరోజు 164 స్థానాల్లో గెలిచి సంచలనం సృష్టించిన కూటమి పార్టీ నాయకులూ, ఫాలోవర్లు కూడా ఈ విషయాన్నీ గుర్తు పెట్టుకోవాలి. అధికారం మదం తో నోరుంది కదా అని ఇష్టమొచ్చినట్టు కామెంట్స్ చేస్తే ఖర్మ ఎవరినీ వదిలిపెట్టదు అనే విషయాన్నీ గుర్తించుకోవాలి.
ఈరోజు వైసీపీ పార్టీ ఫాలోవర్లు ఎదురుకుంటున్న ఇబ్బందులు భవిష్యత్తులో కూటమి నేతలు కూడా ఎదురుకోవచ్చు. ఈ విషయాన్ని మర్చిపోయి ఈమధ్య కాలంలో కొంతమంది నోరుంది కదా అని ఇష్టమొచ్చినట్టు వ్యాఖ్యలు చేస్తున్నారు. రీసెంట్ కమెడియన్ పృథ్వీ ‘గేమ్ చేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో, అదే విధంగా నిన్న జరిగిన ‘లైలా’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వైసీపీ పార్టీ పై చేసిన కామెంట్స్ ఎంత వైరల్ అయ్యాయో మన అందరం చూసాము. సినిమా ఈవెంట్స్ కి వెళ్లి సందర్భం లేకుండా ఇలా మాట్లాడడం అవసరమా అని జనసేన పార్టీ వాళ్లకు కూడా చిరాకు కలిగించే స్థాయిలో కమెడియన్ పృథ్వీ వ్యాఖ్యలు ఉన్నాయి. సోషల్ మీడియా లో వైసీపీ అభిమానులు అయితే ఆయన కామెంట్స్ పై ఒక రేంజ్ లో రెచ్చిపోయారు. #BoycottLaila అనే పేరుతో పెద్ద ఎత్తున ట్రెండ్ చేసారు. సుమారుగా 30 వేలకు పైగా ట్వీట్స్ ఆ ట్యాగ్ మీద పడ్డాయి.
దీనికి కాసేపటి క్రితమే హీరో విశ్వక్ సేన్ ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసి క్షమాపణలు చెప్పడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. మూవీ టీం కూడా భయపడిపోయి రేంజ్ లో వైసీపీ అభిమానులు సోషల్ మీడియా లో చుక్కలు చూపించేసారు. అయితే విశ్వక్ సేన్ అలా క్షమాపణలు చెప్పడానికి వెనుక ఒక ప్రముఖ నిర్మాత, హీరో ఉన్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త. అనవసరమైన వివాదాలు ఎందుకు, వెళ్లి మీడియా ముందు క్షమాపణలు చెప్పమంటేనే విశ్వక్ సేన్ క్షమాపణలు చెప్పినట్టు తెలుస్తుంది. వైసీపీ సోషల్ మీడియా తో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది. ఇక నుండి నోరు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడండి అంటూ వార్నింగ్స్ ఇస్తున్నారు. మా వల్లే ‘గేమ్ చేంజర్’ చిత్రం అలా ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది, జగన్ ఫ్యాన్స్ తో పెట్టుకోవద్దు అంటూ సోషల్ మీడియా లో ఎలివేషన్ వీడియోస్ వేసి వైరల్ చేస్తున్నారు వైసీపీ ఫ్యాన్స్.
Vishwaksen Apologies Cheppadu Kadha …!! Em Chedham Antaru Frndss Laila Movie ki Support chedhama..??? #JustAsking #Laila #BoycotLaila pic.twitter.com/Ob9Y2GjrZe
— Neninthae_ (@Neninthae_) February 10, 2025