Bramhanandam Trailer
Bramhanandam Trailer Review: కామెడీ కింగ్ బ్రహ్మానందం(Bramhanandam) ఆయన కొడుకు రాజా గౌతమ్(Raja Gautham) తో కలిసి నటించిన చిత్రం ‘బ్రహ్మ ఆనందం'(Bramhanandam Trailer). చాలా కాలం గ్యాప్ తర్వాత తనయుడు గౌతమ్ ఈసారి మంచి క్వాలిటీ ఉన్న కథతో మన ముందుకు రాబోతున్నాడు. గతంలో గౌతమ్ నటించిన సినిమాల్లో బ్రహ్మానందం కూడా నటించాడు కానీ, ఫుల్ లెంగ్త్ క్యారక్టర్ చేసింది మాత్రం ఈ సినిమాలోనే. బ్రహ్మానందం, గౌతమ్ లతో పాటు ప్రియా వడ్లమనేని, వెన్నెల కిషోర్, ఐశ్వర్య హోలక్కల్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా ఈ నెల 14 వ తేదీన వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సందర్భంగా కాసేపటి క్రితమే రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) ఈ మూవీ కి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేసాడు. ఈ ట్రైలర్ కి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
ఈ ట్రైలర్ ని చూస్తుంన్నంత సేపు ఒక ఫీల్ గుడ్ మూవీ ని చూస్తున్న అనుభూతి కలిగింది. బ్రహ్మానందం మార్క్ కామెడీ టైమింగ్ తో పాటు, హృదయాలకు హత్తుకునే ఎమోషన్స్ కూడా ఈ సినిమాలో ఉన్నాయని ట్రైలర్ ని చూస్తే అర్థం అవుతుంది. తన స్వార్థం కోసం మాత్రమే బ్రతికే ఒక యువకుడి జీవితం లోకి బ్రహ్మానందం రావడం, అతని అవసరం కోసం తన ఆస్తిని తాకట్టు పెడతానని చెప్పడం, ఆ తర్వాత వీళ్ళ మధ్య జరిగిన సందర్భాలను, బావోదేవగలను, ఎంటర్టైన్మెంట్ ని జోడించి డైరెక్టర్ నిఖిల్ ఈ సినిమాని తెరకెక్కించాడు. ట్రైలర్ ని చూసిన వెంటనే కచ్చితంగా ఈ సినిమాలో ఎదో మంచి విషయం ఉంది, పాజిటివ్ టాక్ వస్తే థియేటర్స్ లో చూడాల్సిందే అనే ఫీలింగ్ కలిగింది. బ్రహ్మానందం కూడా రెగ్యులర్ రోల్ లో కాకుండా అన్ని రకాల ఎమోషన్స్ ఉన్న క్యారక్టర్ ని చేసినట్టుగా అనిపించింది.
ఈమధ్య కాలం లో బ్రహ్మానందం చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్నాడు. తన కామెడీ తో పొట్ట చెక్కలు అయ్యేలా నవ్వించే బ్రహ్మానందం గత ఏడాది ‘రంగమార్తాండ’ సినిమాలో ఎమోషనల్ క్యారక్టర్ చేసి ఆడియన్స్ చేత కంటతడి పెట్టించాడు. మళ్ళీ ఆ తరహా పాత్రలోనే ఆయన కనిపించబోతున్నట్టు ఈ ట్రైలర్ ని చూస్తే అర్థం అవుతుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని త్వరలోనే హైదరాబాద్ లో చేయనున్నారు, ఈ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ముఖ్య అతిథి గా హాజరు కాబోతున్నాడు. బ్రహ్మానందం కి మెగాస్టార్ చిరంజీవి గురువు లాగ అనే విషయం మన అందరికీ తెలిసిందే. నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు కారణం చిరంజీవి గారే అని ఎన్నో సందర్భాల్లో ఆయన తెలిపాడు. ఇప్పటి వరకు ఆయన కొడుకు సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి చిరంజీవి రాలేదు, కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఒకసారి వచ్చాడు.