BCCI's Top Ten Commandments
BCCI top 10 Commandmentsన్యూజిలాండ్ జట్టుతో దారుణమైన ఓటమి.. ఆస్ట్రేలియాతో ఘోరమైన ఓటమి.. స్టార్ ఆటగాళ్లు సరిగా ఆడలేక పోవడం.. వరుసగా విఫలమవడం.. జట్టులో చోటుచేసుకున్న వివాదాలు. అనూహ్యంగా సాగుతున్న రిటైర్మెంట్లు.. వంటివి టీమిండియా విజయాలపై తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఈ క్రమంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) నేరుగా రంగంలోకి దిగింది. కఠిన చర్యలను, నిర్ణయాలను తీసుకుంది.. ఆటగాళ్లు మొత్తం అందరూ డొమెస్టిక్ క్రికెట్ (domestic cricket) ఆడాలని స్పష్టం చేసింది. ఇందులో భాగంగానే 10 కమాండ్మెంట్స్ (10 commendments) ను తెరపైకి తీసుకువచ్చింది. ఇందులో ప్రధానమైనది నో ఛాన్స్ ఫర్ ఫ్యామిలీ.. దీని ప్రకారం విదేశీ పర్యటనలకు టీమిండి ఆటగాళ్లు వెళ్ళినప్పుడు కుటుంబాన్ని దూరంగా ఉంచాల్సి ఉంటుంది. అయితే ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందని ఇప్పటివరకు ఒక స్పష్టత లేదు. తాజాగా జాతీయ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం ప్రస్తుత ఛాంపియన్స్ ట్రోఫీ నుంచే అమల్లోకి తెస్తారని ప్రచారం జరుగుతోంది.. ఛాంపియన్స్ ట్రోఫీకి స్టార్ ఆటగాళ్లు తమ కుటుంబ సభ్యులను వెంట తీసుకెళ్లడానికి బీసీసీఐ అనుమతి ఇవ్వలేదు. ఫిబ్రవరి 19 నుంచి ఈ టోర్నీ మొదలవుతుంది. ఈ టోర్నికి ఇంకా మూడువారాల వ్యవధి మాత్రమే ఉంది. అందువల్లే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది.
బిసిసిఐ పది ఆదేశాల ప్రకారం ఒక వారం కుటుంబాలతో ఉండడానికి ఆటగాళ్లకు అవకాశం ఉండేది. కానీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు జరుగుతుంది. అయితే ఇందులో ఎవరికి ఎలాంటి మినహాయింపు ఇవ్వద్దని బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. అయితే కుటుంబ సభ్యులకు అవకాశం ఇవ్వాలని.. అలా అయితేనే బాగుంటుందని ఒక సీనియర్ ఆటగాడు బిసిసిఐ పెద్దలకు విజ్ఞప్తి చేసినప్పటికీ ఏమాత్రం ఒప్పుకోలేదట.. స్టే చేసే హోటల్ లో కాకుండా.. తోటి ఆటగాళ్లతో కలిసి రూమ్ పంచుకోవడం.. జట్టు ఆటగాళ్లు ప్రయాణించే బస్సులోనే అందరూ వెళ్లడం వంటి నిర్ణయాలు ఆటగాళ్ల మధ్య సంబంధాలను మెరుగ్గా పెంచుతాయని బీసీసీఐ పెద్దలు భావిస్తున్నారు. వ్యక్తిగత సిబ్బందికి కూడా ఇవే నిబంధనలను వర్తింపజేస్తామని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల ఇంగ్లాండు సిరీస్ లలో ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ వ్యక్తిగత కార్యదర్శిని టీం ఉన్న హోటల్లో ఉండడానికి బీసీసీఐ ఏమాత్రం ఒప్పుకోలేదు. దీనిని ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా వర్తింప చేస్తారని తెలుస్తోంది. ” టీ 20, వన్డేలు మినహాయిస్తే టెస్ట్ ఫార్మాట్ లో టీమిండియా ప్రదర్శన బాగోలేదు. ఆ విభాగంలో ఆటగాళ్లు అద్భుతంగా రాణించాల్సి ఉంది. అలాంటప్పుడు కచ్చితంగా మార్పులు జరగాలి. కఠిన నిబంధనలను పాటించాలి. అప్పుడే జట్టు గాడిలో పడుతుంది. సరి కొత్తగా ఆడుతుంది. అలా జరగాలంటే చాలా వరకు మార్పులు అమల్లో ఉండాలని” బీసీసీఐ పెద్దలు భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది.