https://oktelugu.com/

Vishwak Sen : నిన్న బాయ్ కట్..నేడు డిజాస్టర్..విశ్వక్ సేన్ కి చుక్కలు చూపించేసిన వైసీపీ అభిమానులు!

సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో కేవలం సినిమాల గురించి మాత్రమే మాట్లాడాలి, అది కాకుండా రాజకీయ అంశాల గురించి మాట్లాడడం, వాటి మీద సెటైర్లు వేయడం వంటివి చేస్తే తీవ్రమైన నష్టం వాటిల్లుతుందని నేడు విడుదలైన విశ్వక్ సేన్(vishwak sen) 'లైలా'(Laila Movie) మూవీ మరోసారి నిరూపించి చూపించింది.

Written By: , Updated On : February 14, 2025 / 04:43 PM IST
Vishwak Sen

Vishwak Sen

Follow us on

Vishwak Sen :  సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో కేవలం సినిమాల గురించి మాత్రమే మాట్లాడాలి, అది కాకుండా రాజకీయ అంశాల గురించి మాట్లాడడం, వాటి మీద సెటైర్లు వేయడం వంటివి చేస్తే తీవ్రమైన నష్టం వాటిల్లుతుందని నేడు విడుదలైన విశ్వక్ సేన్(vishwak sen) ‘లైలా'(Laila Movie) మూవీ మరోసారి నిరూపించి చూపించింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కమెడియన్ పృథ్వీ రాజ్ వైసీపీ ని ఉద్దేశించి చాలా సెటైర్లు వేసాడు. దీనికి వైసీపీ సోషల్ మీడియా టీం భగ్గుమంది. ఎదో జీతం తీసుకొని ఉద్యోగం చేసే వారిలాగా ఈ చిత్రాన్ని ‘#BoycottLaila’ అనే హ్యాష్ ట్యాగ్ పై గత నాలుగు రోజుల నుండి లక్షల సంఖ్యలో ట్వీట్స్ వేశారు. ఇప్పుడు ఆ చిత్రానికి ఫ్లాప్ టాక్ రావడం తో ‘#disasterLaila’ అంటూ మరో హ్యాష్ ట్యాగ్ పై లక్షల సంఖ్యలో ట్వీట్లు వేశారు. వైసీపీ మీడియా చాలా పెద్దది.

ఈ మీడియా లో ఎంతోమంది జర్నలిస్టులు ఉన్నారు, రివ్యూయర్స్ కూడా ఉన్నారు. వీళ్లంతా నేడు ఓవర్సీస్ లో ప్రీమియర్ షోస్ అయిపోగానే ఘోరమైన రివ్యూస్ ఇచ్చారు. కేవలం వైసీపీ మీడియా మాత్రమే కాకుండా టీడీపీ, జనసేన మీడియా లు కూడా ఈ చిత్రానికి ఫ్లాప్ టాక్ చెప్పాయి. సినిమా కూడా ఆ రేంజ్ లోనే ఉందనుకోండి, అది వేరే విషయం. కానీ టైం పాస్ కోసం చూసే ఆడియన్స్ కి మాత్రం ఈ సినిమాని ఒకసారి చూడొచ్చు అనే అభిప్రాయం కలుగుతుంది. కానీ ఆ టాక్ అసలు బయటకు రాలేదు, ఎక్కడ చూసినా డిజాస్టర్ టాక్ కనిపిస్తుంది. దాని వల్ల ఓపెనింగ్స్ పై తీవ్రమైన ప్రభావం పడింది. గతంలో విడుదలైన విశ్వక్ సేన్ సినిమాలతో పోలిస్తే ఈ చిత్రానికి పావు శాతం ఓపెనింగ్ కూడా పడలేదు అని చెప్పొచ్చు. మొదటి రోజు తెలుగు రాష్ట్రాల నుండి కోటి రూపాయిల గ్రాస్ వసూళ్లు రావడం కూడా కష్టమే.

అయితే ఈ సినిమాకి ఈ గతి పట్టడానికి ప్రధాన కారణం మేమే, మాతో పెట్టుకోవద్దు, ఇంకోసారి మా జగన్ అన్నపై నెగటివ్ కామెంట్స్ సినిమా ఫంక్షన్స్ లో చేస్తే ఇదే పరిస్థితి వస్తుందని హీరో విశ్వక్ సేన్ ని ట్యాగ్ చేసి హెచ్చరిస్తున్నారు వైసీపీ అభిమానులు. ఇది కేవలం విశ్వక్ సేన్ కి మాత్రమే కాదు, అందరి హీరోలకు వర్తిస్తుందని వార్నింగ్ ఇస్తున్నారు. ఒక సినిమాపై పనిగట్టుకొని నెగటివ్ క్యాంపైన్ చేస్తే కచ్చితంగా ఆ ప్రభావం పడుతుంది. వైసీపీ సోషల్ మీడియా ఇప్పుడు చాలా యాక్టీవ్ అయ్యింది. వాళ్ళ జోలికి వస్తే టార్గెట్ చేసి మరీ తొక్కెస్త్తున్నారు, భవిష్యత్తులో కమెడియన్ పృథ్వీ ఈ విషయాన్నీ అర్థం చేసుకొని సినిమా ఈవెంట్స్ లో ఇష్టమొచ్చినట్టు మాట్లాడడం ఇప్పటికైనా తగ్గించుకోవాలి. లైలా మూవీ టీం మొత్తం పృథ్వీ రాజ్ పై ఫైర్ మీదున్నారు, నీ వల్లే మాకు నష్టం కలిగింది అంటూ ఆయనకు ఇవ్వాల్సిన రెమ్యూనరేషన్ ని కూడా కట్ చేయొచ్చు అంటూ కామెంట్స్ చేస్తున్నారు విశ్లేషకులు.