Homeఎంటర్టైన్మెంట్Allu Arjun : వాళ్లు వీళ్లు ఎవరూ లేరు.. ఆఖరికి ఆ డైరెక్టర్ తోనే...

Allu Arjun : వాళ్లు వీళ్లు ఎవరూ లేరు.. ఆఖరికి ఆ డైరెక్టర్ తోనే ఫిక్స్ అయిన అల్లు అర్జున్

Allu Arjun : రెండేళ్ల కిందట విడుదలైన పుష్ప సినిమాతో త‌న క్రేజ్ ను నేష‌న‌ల్ లెవల్లో పెంచుకున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. తాజాగా పుష్ప‌2 తో దాన్ని ఇంట‌ర్నేష‌న‌ల్ లెవెల్ కు తీసుకెళ్లారు. పుష్ప ఫ్రాంచైజ్ సినిమాల‌తో బ‌న్నీ మార్కెట్, ఫాలోయింగ్ ఆకాశమంత పెరిగింది. సౌత్, నార్త్ అన్న తేడా లేకుండా వ‌ర‌ల్డ్ వైడ్ గా పుష్ప రాజ్ రూల్ చేశాడు. పుష్ప‌2 సినిమా ప్రపంచ వ్యాప్తంగా కలిపి రూ.1800 కోట్లు వ‌సూలు చేసి ఎన్నో రికార్డుల‌ను నెలకొల్పింది. ఈ సినిమా త‌ర్వాత బన్నీ ఎవ‌రితో చేస్తాడా అనే ఆస‌క్తి అందరిలో నెలకొంది. పుష్ప‌2 రిలీజ్ కు ముందు బ‌న్నీ పుష్ప‌3 చేస్తాడ‌న్నారు కానీ అది ఇప్ప‌ట్లో సెట్స్ పైకి వెళ్ల‌ద‌ని తేలిపోయింది. ఈ నేపథ్యంలో బ‌న్నీ త‌ర్వాత చేయ‌బోయే దర్శకుల జాబితాలో చాలా మంది ఉన్నారు. వారిలో మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ పేరుతో పాటూ త‌మిళ స్టార్ డైరెక్ట‌ర్ అట్లీ పేరు కూడా వినిపించింది.

అల్లు అర్జున్- త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ లో సినిమా రానున్న‌ట్లు మేక‌ర్స్ ఎప్పుడో ప్రకటించారు. కానీ స‌డెన్ గా అట్లీ లైన్ లోకి రావ‌డం, అట్లీ చెప్పిన క‌థ బ‌న్నీకి నచ్చకపోవడంతో ఆ క‌థను అట్లీ వేరే హీరోతో చేయాల‌నుకున్నారట. మ‌ళ్లీ రీసెంట్ గా అట్లీ బ‌న్నీకి క‌థ చెప్పాడ‌ని వార్త‌లు రావ‌డంతో బ‌న్నీ త‌ర్వాతి సినిమాను ఎవ‌రితో చేయ‌నున్నాడ‌నేది గందరగోళంగా మారిపోయింది. అయితే అల్లు అర్జున్ త‌న త‌ర్వాత సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ తోనే చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్స్ శ‌ర‌వేగంగా జరుగుతున్నట్లు సమాచారం. రీసెంట్ గానే త్రివిక్ర‌మ్, అల్లు అర్జున్ ను క‌లిసి సినిమాకు సంబంధించిన ఫుల్ నెరేష‌న్ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది.

మైథలాజిక‌ల్ పీరియడ్ డ్రామాగా తెర‌కెక్క‌నున్న ఈ సినిమాలో బ‌న్నీ నెవ‌ర్ బిఫోర్ లుక్ లో క‌నిపిస్తాడ‌ని చెప్తున్నారు.శివపార్వతుల పుత్రుడు కార్తికేయ ప్రయాణం నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమా సోషియో మైథలాజికల్ ఫాంటసీ నేపథ్యంలో ఉండబోతుందన్న వార్త హల్ చల్ చేస్తుంది.ఈ మూవీ తండ్రీకొడుకుల (శివుడు- కార్తికేయ) పున: కలయికను చూపించబోతుందట. ఇంకేంటి మరి ఇదే నిజమైతే మాటల మాంత్రికుడుగా పేరున్న త్రివిక్రమ్‌ కాంపౌండ్ నుంచి మరో బ్లాక్ బస్టర్ ఖాయమైనట్టేనని అంటున్నారు సినీ జనాలు.

గాడ్‌ ఆఫ్‌ వార్‌ టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కించనున్నారని సమాచారం. ఏఏ22 అనౌన్స్‌మెంట్‌ వీడియో కూడా త్వరలోనే రిలీజ్ చేయబోతున్నట్లు ఫిలింనగర్ సర్కిల్ సమాచారం. ఇటీవలే పుష్ప 2 ది రూల్‌ సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు బన్నీ. గతేడాది గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు త్రివిక్రమ్‌. ఈ సారి బన్నీతో డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో తీయబోయే సినిమా ఎలాంటి ట్రెండ్‌ క్రియేట్ చేస్తుందనేది చూడాలి. జులాయి, స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి, అల వైకుంఠ‌పుర‌ములో బ్లాక్ బ‌స్ట‌ర్ల త‌ర్వాత బ‌న్నీ- త్రివిక్ర‌మ్ కాంబోలో వ‌స్తున్న సినిమా కావ‌డంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version