Rohit Sharma out of captaincy: టీమిండియాకు టి20 వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ అందించిన చరిత్ర రోహిత్ శర్మది. వన్డేలలో డబుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా కూడా రోహిత్ శర్మకు పేరు ఉంది. టెస్ట్ ఫార్మాట్ ను కాస్త పక్కన పెడితే పరిమిత ఓవర్లలో రోహిత్ శర్మ దుమ్ము రేపుతాడు. ఓపెనర్ గా పెను విధ్వంసాన్ని సృష్టిస్తాడు. ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా అతడు అదరగొట్టాడు. టి20 వరల్డ్ కప్ లో కూడా దుమ్మురేపాడు. తన బరువు కారణంగా మేనేజ్మెంట్ అనేక అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో.. టెస్ట్ ఫార్మాట్ నుంచి తప్పుకున్నాడు. దానికంటే ముందే t20 ఫార్మాట్ నుంచి కూడా దూరం జరిగాడు. ప్రస్తుతం పరిమిత ఓవర్ల క్రికెట్లో టీం మీడియాకు నాయకుడిగా కొనసాగుతున్నాడు.
వాస్తవానికి రోహిత్ శర్మలో ఇంకా సామర్థ్యం తగ్గలేదు. అతడు ఎలాంటి పరిస్థితుల్లోనైనా బ్యాటింగ్ చేయగలడు. ఎంతటి బౌలర్ నైనా సరే ఎదుర్కో గలడు. అటువంటి రోహిత్ శర్మకు ఎప్పుడు కష్టకాలం సమీపించినట్టు కనిపిస్తోంది. ఎందుకంటే మేనేజ్మెంట్ అతడిని పరిమిత ఓవర్ల నుంచి కూడా తప్పించాలని భావిస్తున్నట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇటీవల ఇంగ్లాండ్ సిరీస్ ప్రారంభానికి ముందు కూడా రోహిత్ శర్మతో మేనేజ్మెంట్ మాట్లాడింది. ఆ తర్వాత అతడు టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. ఇప్పుడు కూడా రోహిత్ శర్మతో టీమ్ ఇండియా మేనేజ్మెంట్ మాట్లాడుతోంది. ప్రస్తుతం టీమిండియా మరికొద్ది రోజుల్లో ఆస్ట్రేలియా జట్టుతో వన్డే సిరీస్ ఆడుతోంది. ఈ సిరీస్ కు నాయకత్వం రోహిత్ శర్మ వహిస్తాడని వార్తలు వచ్చాయి. అయితే అనూహ్యంగా అతనితో మేనేజ్మెంట్ మీటింగ్ ఏర్పాటు చేయడం రకరకాల చర్చలకు దారి తీస్తోంది.
ప్రధానంగా కెప్టెన్సీ విషయంపైనే రోహిత్ శర్మతో మేనేజ్మెంట్ చర్చిస్తుందని సమాచారం. అతని అభిప్రాయం తర్వాతే జట్టును ప్రకటిస్తారని తెలుస్తోంది. జాతీయ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం గిల్ కు నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తారని సమాచారం. టెస్ట్ సిరీస్ లో ఇంగ్లాండ్ జట్టుపై అతడు అద్భుతమైన ప్రతిభ చూపించాడు. ఇటీవల ఆసియా కప్ లో విఫలమైనప్పటికీ.. ఇంగ్లాండ్ సిరీస్ లో మాత్రం గిల్ దుమ్మురేపాడు. పరిమిత ఓవర్లలో గిల్ కు అద్భుతమైన రికార్డులు ఉన్నాయి. అలాంటప్పుడు రోహిత్ శర్మను పక్కకు తప్పించి గిల్ కు నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తారని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. టీమిండియా 2023లో వన్డే వరల్డ్ కప్ రన్నర్ అప్ తో సరిపెట్టుకుంది. 2027లో టీమ్ ఇండియాకు ఎలాగైనా సరే వరల్డ్ కప్ అందించాలని రోహిత్ శర్మ లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఆ లక్ష్యానికి మేనేజ్మెంట్ సహకరిస్తే ఇబ్బంది ఉండదు. ఒకవేళ మేనేజ్మెంట్ ఇతర నిర్ణయం తీసుకుంటే రోహిత్ శర్మ సంచలన విషయాన్ని వెల్లడించే అవకాశం లేకపోలేదని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.