Gaddam Raju Viral Video: ప్రేమలో ఉన్నప్పుడు లోకం మొత్తం కొత్తగా కనిపిస్తుంది. ప్రేమించిన వారు పక్కనే ఉంటే స్వర్గం లో విహరిస్తున్నట్టు అనిపిస్తుంది. ప్రేమించిన వారి నుంచి ఏదైనా ఇబ్బంది ఎదురైతే.. అనుకోని సంఘటన మన కంటపడితే పూర్తిగా మారిపోతుంది. అప్పటిదాకా కనిపించిన ప్రేమ ఒక్కసారిగా మాయమైపోతుంది. ప్రేమ దూరమై అనుమానం, అవమానం కళ్ళ ముందు కనిపిస్తుంది. అది అనేక రకాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. చివరికి మనసు ముక్కలై రకరకాల పరిణామాలకు దారితీస్తుంది. ఈ సంఘటన కూడా అటువంటిదే.
యూట్యూబ్ ఓపెన్ చేస్తే కాటికట్టల పాలాయనే బతుకు.. సీత, నా ప్రాణమే నిన్ను కోరితే.. వంటి పాటలు ఏదో ఒక సందర్భంలో కనిపిస్తూనే ఉంటాయి. ఆ పాటల్లో నటించిన వ్యక్తి పేరు గడ్డం రాజు. ఇతడు స్వతహాగానే జానపద కళాకారుడు. లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ లో నటించడంలో ఇతడికి ఇతడే దిట్ట. ఇటువంటి చరిత్ర ఉన్న రాజు బలవంతంగా తన ప్రాణాన్ని తీసుకున్నాడు. రాజు స్వస్థలం పెద్దపల్లి జిల్లా కాలువ శ్రీరాంపూర్ మండలం జాఫర్ఖాన్ పేట. ఇతడు నెలరోజుల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. పెళ్లయిన కొద్ది రోజుల వరకు భార్యాభర్తలు బాగానే ఉన్నారు. ఆ తర్వాత భార్య ఇతడిని వేధించడం మొదలుపెట్టింది. మొదట్లో సర్దుకుంటుందని అనుకున్నాడు. కానీ గొడవ అంతకంతకు పెరిగిపోవడంతో తట్టుకోలేకపోయాడు. ఫలితంగా బతుకమ్మ పండుగ సందర్భంగా భార్య కోసం కొనుగోలు చేసిన చీరతో కురివేసుకొని బలవంతంగా ప్రాణాన్ని తీసుకున్నాడు.
చీరతో ఉరి వేసుకోవడానికి అంటే ముందు రాజు సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ఆ వీడియోలో తన భార్య పెడుతున్న ఇబ్బందిని కళ్లకు కట్టాడు. తాను ప్రాణంగా తన భార్యను ప్రేమించానని.. తను మాత్రం వేధిస్తోందని వాపోయాడు. ఈ వేధింపులు తట్టుకోలేక బలవంతంగా ప్రాణాలు తీసుకున్నట్టు పేర్కొన్నాడు. తనలాంటి కష్టం మరొకరికి రావద్దని ఆ వీడియోలో అతడు వివరించాడు..
” ప్రేమలో ఉన్నప్పుడు అర్థం కాలేదు. నా భార్యను పెళ్లి కాక ముందు నుంచే ప్రేమించాను. ఆమె కూడా నన్ను ప్రేమించింది. వివాహం చేసుకున్నాం. వివాహం జరిగిన తర్వాత మా ప్రేమ మరింత రెట్టింపు కావాలి. కానీ ఆ ప్రేమ స్థానంలో అనుమానం మొదలైంది. చివరికి నాకు అంతులేని ఆవేదన మిగిలింది. దీనిని తట్టుకోవడం నావల్ల కావడం లేదు అంటూ” రాజు తన బాధను మొత్తం వ్యక్తం చేశాడు.. రాజు ఆత్మహత్య చేసుకున్న సంఘటన సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.. రాజు ఆత్మహత్య చేసుకోడాన్ని తోటి కళాకారులు జీర్ణించుకోలేకపోతున్నారు.
భార్య టార్చర్ భరించలేక జానపద నటుడు గడ్డం రాజు ఆత్మహత్య..
సెప్టెంబర్ 29న జరిగిన ఘటన
ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో తీసుకున్న గడ్డం రాజు
స్వస్థలం పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం జాఫర్ ఖాన్ పేటలో అంత్యక్రియలు
నెల రోజుల క్రితమే ప్రేమ వివాహం చేసుకున్న గడ్డం రాజు
బతుకమ్మ… pic.twitter.com/8btSXRXjto
— BIG TV Breaking News (@bigtvtelugu) October 3, 2025