https://oktelugu.com/

BCCI : బీసీసీఐ షాకింగ్ నిర్ణయం.. నెలరోజులు క్రికెటర్లకు సెలవు.! 

ఇక నెలరోజుల విరామాన్ని భారత ఆటగాళ్లు ఆస్వాదించనన్నారు. పలువురు ఆటగాళ్లు విదేశాలకు డోర్లకు కుటుంబ సభ్యులతో కలిసి వెళుతున్నారు.

Written By:
  • BS
  • , Updated On : June 14, 2023 / 11:04 AM IST
    Follow us on

    BCCI : టీమిండియా జట్టు గత కొన్నేళ్ల నుంచి బిజీ బిజీ షెడ్యూల్ తో క్రికెట్ ఆడుతోంది. ఎడతెరిపి లేని ఆటతో ఆటగాళ్ల ప్రదర్శనపై ప్రభావం చూపుతోంది. బిజీ షెడ్యూల్ కారణంగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ లోనూ భారత జట్టు ఆట తీరు దారుణంగా పడిపోయింది. దీంతో అప్రమత్తమైన బీసీసీఐ ఆటగాళ్లకు విశ్రాంతిని ఇవ్వాలని నిర్ణయించింది. డబ్ల్యూటిసి ఫైనల్ ఓటమి నుంచి తేరుకునేందుకు భారత క్రికెట్ జట్టుకు సుదీర్ఘ విరామం ప్రకటించింది. వెస్టిండీస్ తో సిరీస్ కు ముందు ఆఫ్ఘనిస్తాన్ తో వన్డే సిరీస్ ఆడాల్సి ఉన్నప్పటికీ బీసీసీఐ వాయిదా వేసింది. సుమారు నెలరోజులు విరామం తర్వాత వెస్టిండీస్ పర్యటనతోనే భారత ఆటగాళ్లు మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టనున్నారు.
    టీమిండియా గత కొన్నేళ్ల నుంచి వరుసగా క్రికెట్ ఆడుతూ వస్తోంది. విశ్రాంతి లేని క్రికెట్ ఆడుతుండడం వల్ల ఇండియా జట్టు ప్రదర్శనపైనా ప్రభావం పడుతోంది. ఇదే విషయాన్ని గుర్తించిన బీసీసీఐ ఆటగాళ్లకు విశ్రాంతినివ్వాలని నిర్ణయించింది. అందులో భాగంగానే ఆఫ్గనిస్తాన్ తో జరగాల్సిన సిరీస్ ను భారత జట్టు వాయిదా వేసి ఆటగాళ్లకు విరామం ప్రకటించింది. ఇది ఆటగాళ్ల ఆట తీరును మెరుగుపరుస్తుందని భారత క్రికెట్ నియంత్రణ మండలి భావిస్తోంది.
    షెడ్యూల్ ను ప్రకటించిన బీసీసీఐ..
    భారత జట్టు వెస్టిండీస్ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ను బీసీసీఐ సోమవారం రాత్రి అధికారికంగా ప్రకటించింది. జూలై 12 నుంచి ఆగస్టు 13 వరకు ఈ పర్యటన కొనసాగనుంది. జూలై 12 నుంచి 16 మధ్య డొమినక వేదికగా తొలి టెస్ట్, జూలై 20 – 24 మధ్య ట్రినిడాడ్ వేదికగా రెండో టెస్టు జరగనుంది. మూడు వన్డేల సిరీస్ జూలై 27న ప్రారంభమై ఆగస్టు 13న ముగుస్తుంది. తొలి వన్డే జూలై 27న, రెండో వన్డే జూలై 29న, మూడో వన్డే ఆగస్టు ఒకటో తేదీన జరగనుంది. ఐదు టి20 ల సిరీస్ ఆగస్టు 4 నుంచి 13 వరకు జరగనుండగా, తొలి టీ20 ఆగస్టు 4న, రెండో టి20 ఆగస్టు 6న, మూడో టి20 ఆగస్టు 8న, నాలుగో టి20 ఆగస్టు 12న, ఐదో టి20 ఆగస్టు 13న నిర్వహించనున్నారు.
    వేర్వేరు ఫార్మాట్లకు ఇద్దరు కెప్టెన్లతో భారత జట్టు..
    వెస్టిండీస్ పర్యటనకు వెళుతున్న భారత జట్టుకు రెండు వేర్వేరు ఫార్మాట్లకు ఇద్దరు కెప్టెన్లతో కూడిన రెండు టీములను బీసీసీఐ ఎంపిక చేసింది. వన్డే సిరీస్ తో పాటు టెస్ట్ సిరీస్ కు రోహిత్ శర్మ సారధ్యంలోని భారత జట్టు ఆడనుండగా, టి20 సిరీస్ కు హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని యువ జట్టు ఆడనుంది. ఈ మూడు సిరీస్ లను ఓటిటీ ప్లాట్ఫారం జియో సినిమా ఉచితంగా ప్రసారం చేయనుంది. ఈ మేరకు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు అధికారిక ఓటీపీ బ్రాడ్కాస్టర్ ఫ్యాన్ కోడ్ తో జియో సినిమా ఒప్పందం కుదుర్చుకుంది. టీవీలో భారత ప్రభుత్వానికి చెందిన డిడి స్పోర్ట్స్ లో ఈ మ్యాచులు ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. వెస్టిండీస్ పర్యటనలోని మ్యాచ్ టైమింగ్స్ భారత టైమింగ్స్ కు విరుద్ధంగా ఉండనున్నాయి. ఈ క్రమంలోనే కమర్షియల్ గా లాభం ఉండదని పెద్దపెద్ద ఛానల్స్ అయిన స్టార్ స్పోర్ట్స్, సోని ఈ సిరీస్ లకు దూరంగా ఉన్నాయి. ఇక నెలరోజుల విరామాన్ని భారత ఆటగాళ్లు ఆస్వాదించనన్నారు. పలువురు ఆటగాళ్లు విదేశాలకు డోర్లకు కుటుంబ సభ్యులతో కలిసి వెళుతున్నారు.