https://oktelugu.com/

Immanuel- Varsha: కోరికలు తీర్చమని వర్షను వేడుకున్న ఇమ్మానియేల్… నీకు కూడా లోపల ఉందంటూ!

వర్ష-ఇమ్మానియేల్ నిజంగా ప్రేమికులా లేక ఎడారి మధ్య నిజంగా ఏదైనా ఎఫైర్ ఉందా అనే సందేహాలు ఉన్నాయి. ఇమ్మానియేల్ అయితే షూటింగ్ అయ్యాక ఎవరి దారి వారిదే అంటాడు.

Written By:
  • Shiva
  • , Updated On : June 14, 2023 / 11:16 AM IST
    Follow us on

    Immanuel- Varsha: వర్ష ఇమ్మానియేల్ బుల్లితెర లవ్ బర్డ్స్ గా ఉన్నారు. వర్ష జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి ఆమె ఇమ్మానియేల్ కి క్లోజ్ అయ్యారు. ఇమ్మానియేల్ అంటే వర్ష పడి చచ్చిపోతుంది. చందమామలా ఉండే వర్ష అమావాస్యలా ఉండే ఇమ్మానియేల్ వెనుకబడటం ఊహించని పరిణామం. అయితే వర్ష కెరీర్ కి ఇది ఉపయోగపడింది. ఆమె అనతి కాలంలో పాపులర్ కావడానికి ఇమ్మానియేల్ లో లవ్ ట్రాక్స్ దోహదం చేశాయి. ప్రస్తుతం వర్ష బుల్లితెర స్టార్స్ లో ఒకరిగా ఉన్నారు. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలలో వర్ష సందడి చేస్తున్నారు.

    ఎక్స్ట్రా జబర్దస్త్ లేటెస్ట్ ఎపిసోడ్లో వర్ష-ఇమ్మానియేల్ ఓపెన్ అయ్యారు. ఒకరిపై మరొకరికి ఉన్న కోరికలు బయటపెట్టారు. వర్ష-ఇమ్మానియేల్ మాంత్రికులు వేషాలు వేశారు. నీ మాయలతో అక్కా భావాలను(రష్మీ-సుధీర్)లను కలిపేయవచ్చు కదా? అని వర్ష ఇమ్మానియేల్ ని అడిగింది. వాళ్ళు ఇక్కడే కలవడం లేదు. బయట బాగానే కలుస్తున్నారు. మనం ఇక్కడ కలవడం లేదు బయట కలవడం లేదు అన్నాడు.

    నాకు నైట్ నిద్ర పట్టడం లేదు, నిద్ర వచ్చేందుకు ఏదైనా మంత్రం చెప్పాలని వర్ష ఇమ్మానియేల్ ని అడిగింది. ఓం భీమ్ ఇమ్మానియేల్ కి ఒక ముద్దు పెట్టు… అని ఇమ్మానియేల్ మంత్రం చెప్పాడు. ఇది మంత్రంలా లేదు నీ కోరికల్లా ఉన్నాయని వర్ష సమాధానం చెప్పింది. నీ మనసులో కోరికలు కూడా అవే. బయటపెట్టు, అని ఇమ్మానియేల్ అన్నాడు. వర్ష-ఇమ్మానియేల్ మధ్య జరిగిన ఈ సంభాషణ ఆసక్తి రేపింది.

    ఇక వర్ష-ఇమ్మానియేల్ నిజంగా ప్రేమికులా లేక ఎడారి మధ్య నిజంగా ఏదైనా ఎఫైర్ ఉందా అనే సందేహాలు ఉన్నాయి. ఇమ్మానియేల్ అయితే షూటింగ్ అయ్యాక ఎవరి దారి వారిదే అంటాడు. ఆన్ స్క్రీన్ లో వర్ష ఇమ్మానియేల్ మీద విపరీతమైన ప్రేమ చూపిస్తుంది. నువ్వు లేక నేను లేను అన్నంత బిల్డప్ ఇస్తుంది. నువ్వు ఊ అంటే పెళ్ళికి సై అంటుంది. రష్మీ-సుధీర్ ల తర్వాత ఆ స్థాయిలో పాప్యులర్ అయిన జంటగా ఇమ్మానియేల్, వర్ష ఉన్నారు.