https://oktelugu.com/

BCCI Kohli meeting: బీసీసీఐ పెద్దలతో విరాట్ కోహ్లీ సీక్రెట్ మీటింగ్ కథేంటి?

ఇంగ్లండ్ తో టెస్ట్ సిరీస్ లో టీమిండియా బిజీగా ఉంది. ఇక ఆ తర్వాత ఐపీఎల్.. అనంతరం టీ20 ప్రపంచకప్. ఇలా కీలక క్రికెట్ పండుగ ముందుంది. ఈ క్రమంలోనే ఈసారి టీ20 ప్రపంచకప్ పై టీమిండియా దృష్టిసారించినట్టు తెలుస్తోంది. అంతకుముందు ఐపీఎల్ పైనా బీసీసీఐ పక్కా ప్రణాళికతో ఉంది. అందులో రాణించిన వారినే టీ20 ప్రపంచకప్ కు ఎంపిక చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ప్రస్తుతం ఇంగ్లండ్ లోనే ఉన్నాడు. […]

Written By:
  • NARESH
  • , Updated On : August 21, 2021 / 10:49 AM IST
    Follow us on

    ఇంగ్లండ్ తో టెస్ట్ సిరీస్ లో టీమిండియా బిజీగా ఉంది. ఇక ఆ తర్వాత ఐపీఎల్.. అనంతరం టీ20 ప్రపంచకప్. ఇలా కీలక క్రికెట్ పండుగ ముందుంది. ఈ క్రమంలోనే ఈసారి టీ20 ప్రపంచకప్ పై టీమిండియా దృష్టిసారించినట్టు తెలుస్తోంది. అంతకుముందు ఐపీఎల్ పైనా బీసీసీఐ పక్కా ప్రణాళికతో ఉంది. అందులో రాణించిన వారినే టీ20 ప్రపంచకప్ కు ఎంపిక చేయాలని భావిస్తోంది.

    ఈ క్రమంలోనే బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ప్రస్తుతం ఇంగ్లండ్ లోనే ఉన్నాడు. ఆయన తాజాగా భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీతో భేటి అయ్యాడట.. లండన్ లో రెండో టెస్ట్ సందర్భంగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరబ్ గంగూలీ, సెక్రటరీ జైషా, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లాతో కెప్టెన్ విరాట్ కోహ్లీ రహస్యంగా సమావేశమయ్యారని తెలిసింది. త్వరలోనే జరగబోయే టీ20 ప్రపంచకప్ పైనే వీరందరూ సుధీర్ఘంగా సమావేశమైనట్టు తెలిసింది.

    అక్టోబర్-నవంబర్ లో జరిగే ప్రపంచకప్ కు కూడా కోహ్లీ కెప్టెన్సీకి ఎంతో కీలకం. ఎందుకంటే విరాట్ సారథ్యంలోనే భారత్ 2017 చాంపియన్స్ ట్రోఫీ, 2019 వన్డే ప్రపంచకప్, 2021 ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ ను కూడా కోల్పోయింది. ఈ నేపథ్యంలోనే రాబోయే ఐసీసీ ట్రోఫీ ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి కోహ్లీపైనే ఉంది. అందుకే బీసీసీఐ పెద్దలు తాజాగా జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీని కలవడం చర్చనీయాంశమైంది.

    కోహ్లీ కెప్టెన్ గా విఫలం అవుతుండడంతో అతడిని తప్పించి గెలుపు కెప్టెన్ వీరుడు రోహిత్ శర్మకు పగ్గాలు ఇస్తారా? లేక టీ20 ప్రపంచకప్ వరకూ కోహ్లీకి చాన్స్ ఇచ్చారా? అన్నది ఆసక్తి రేపుతోంది.

    ఇక టీ20 క్రికెట్ లో ఇంగ్లండ్, వెస్టిండీస్ జట్లను సవాల్ చేసే ఆటగాళ్లను ఎంపిక చేయడానికి ఈ భేటీ జరిగినట్టు తెలుస్తోంది. ఇషాంత్, ఉమేశ్ యాదవ్ కు జట్టులో చోటు కష్టమేనంటున్నారు. బుమ్రా, షమీలను ఖచ్చితంగా ఎంపిక చేయవచ్చని అంటున్నారు. సిరాజ్ ను కూడా ఎంపిక చేయాలా? వద్దా? అన్నది ఆలోచిస్తున్నారట..

    దీపక్ చహార్, భువనేశ్వర్, బుమ్రా, షమీలు ఖచ్చితంగా ఉంటారు. స్పిన్నర్లుగా జడేజా, చాహల్, రాహుల్ చాహర్, వరుణ్ చక్రవర్తిలో ఎవరిని తీసకుంటారన్నది చూడాలి. ఆల్ రౌండర్లలో హార్ధిక్ పాండ్యా ను తీసుకునే అవకాశం ఉంది. నాలుగో స్థానంలో సూర్యకుమార్ లేదా? శ్రేయాస్ అయ్యర్ లలో ఒకరికి అవకాశం ఉండనుంది.

    ఎంఎస్ ధోని కెప్టెన్సీలో 2013లో చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన భారత జట్టు ఇప్పటివరకూ మరో ఐసీసీ ట్రోఫీ గెలవలేదు. మరి కోహ్లీ ఆ కల నెరవేరుస్తాడా? లేదా? అన్నది చూడాలి.